Asked By: KUMARIKUNTA
Ans:
The following link will help you.
Asked By: Manikanta
Ans:
There are many jobs which you can apply, you had not told your Post Graduation subject. Hope the following link will help you.
https://www.jagranjosh.com/careers/after-post-graduation-1528887448-1
Asked By: LAKSHMI
Ans:
The following link will help you.
Asked By: పి. నూకరాజురెడ్డి
Ans:
సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 లాంటి పరీక్షలకు శిక్షణ ఎంత ముఖ్యమో ఆ శిక్షణ సంస్థ విశ్వసనీయత కూడా అంతే ముఖ్యం. సాధ్యమైనంతవరకు గ్రూప్స్/సివిల్స్ శిక్షణను ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం శ్రేయస్కరం. గ్రూప్స్/ సివిల్స్ శిక్షణలో తరగతి గదిలో నేర్చుకొనే సబ్జెక్టుతో పాటు, తోటి అభ్యర్ధుల నుంచీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆఫ్‌లైన్ అవకాశం లేకపోతేనే ఆన్లైన్ శిక్షణ తీసుకోండి. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా చాలా సంస్థలు ఆన్లైన్లో సివిల్స్/గ్రూప్స్ కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో నాణ్యమైన శిక్షణ అందించే సంస్థల నుంచే ఆన్లైన్ శిక్షణ పొందండి.
ఆన్లైన్ శిక్షణ సంస్థ ఎంపికలో ఏ విషయాలు గమనించాలంటే.. 1. కంటెంట్ నాణ్యత 2. పరీక్షల నాణ్యత 3. వ్యక్తిగత శ్రద్ధ 4. విశ్లేషణాత్మక వీడియో పరిష్కారాలు 5. సాంకేతిక సేవలు 6. ఇతర అభ్యర్థులతో చర్చించగలిగే డిస్కషన్ ఫోరమ్ 7. అధ్యాపకుల విషయ పరిజ్ఞానం/ అనుభవం 8. నిరంతర ఆన్లైన్ సహాయం. వీటిని దృష్టిలో పెట్టుకొని గత రెండు, మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ శిక్షణ పొందినవారిని సంప్రదించి, వారి సూచనల ప్రకారం మంచి శిక్షణ సంస్థను ఎంచుకోండి.
- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,
Asked By: జి. వాణీప్రియ
Ans:
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి ముందుగా క్వాలిఫయింగ్ పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు అవుతారు. క్వాలిఫయింగ్ పరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణించరు. క్వాలిఫయింగ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది జనరల్ ఇంగ్లిష్, రెండోది మేథమెటిక్స్ (10వ తరగతి స్థాయి). జనరల్ ఇంగ్ల్లిష్ కోసం ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్ (ఎస్ చాంద్), ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ ఫర్ జనరల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ (పియర్సన్), ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్ (అరిహంత్), ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ (ఎస్ చాంద్) లాంటి పుస్తకాలను చదవండి. మేథమెటిక్స్ కోసం హైస్కూల్ మేథమెటిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ఎస్ చాంద్), టీచ్ యువర్ సెల్ఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (మెక్ గ్రాహిల్) లాంటి పుస్తకాలను చదవండి. రెండో దశలో జనరల్ స్టడీస్, ఒక ఆప్షనల్ సబ్జెక్ట్‌లో రెండు పరీక్షలుంటాయి. జనరల్ స్టడీస్ కోసం తెలుగు అకాడెమీ, అరిహంత్, లూసెంట్ లాంటి పబ్లిషర్లు ప్రచురించిన పుస్తకాలను చదవండి. ఆప్షనల్ పేపర్ విషయానికొస్తే, మీరు ఎంచుకొన్న ఆప్షనల్ సబ్జెక్ట్ సిలబస్‌ను అనుసరించి ప్రామాణిక పుస్తకాలను చదివి సొంత నోట్స్ ఆధారంగా తయారవ్వండి. - ప్రొ. బెల్లకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీకాంత్
Ans:
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేప్పుడు నిర్ధారిత సిలబస్ కంటే ఎక్కువే చదవాలి. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్లో ఇచ్చే సిలబస్ విశాల పరిధిలో ఉంటుంది. కొన్నిసార్లు పరీక్షలో ఇచ్చే ప్రశ్నలు సిలబస్ పరిధి దాటినట్లు అనిపించినా సాంకేతికంగా నిరూపించడం కష్టమే. పదోతరగతి పాఠ్య పుస్తకాలు చదివి అర్థం చేసుకోవాలంటే, అందుకు సంబంధించిన ప్రాథమిక విషయాలు దిగువ తరగతుల్లో ఉంటాయి కాబట్టి, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ పుస్తకాలు కూడా చదవండి. మీరు గ్రూప్-4 కు దరఖాస్తు చేసుకుంటే, ఆ సిలబస్ తోపాటు, అంతకంటే పై స్థాయి సిలబస్‌నూ చదవడం శ్రేయస్కరం. ఉదాహరణకు మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ సిలబస్‌లో డిగ్రీ, ఇంటర్, పదో తరగతి స్థాయిలో వివిధ రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కానీ పరీక్షలో ఇచ్చే ప్రశ్న ఏ స్థాయిలో ఉందో కచ్చితంగా నిర్థÄరించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు, నిరంతర కృషి ఉంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్