Asked By: జి. చరిత
Ans:
మీరు ఈ డిప్లొమాని ఇంటర్మీడియట్ తర్వాత చేసివుంటే, డిగ్రీ కూడా చదివే ప్రయత్నం చేయండి. డిగ్రీ చదివిన తరువాత బీఈడీ కూడా చేసే అవకాశం ఉంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్న ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడీ/ బీఎస్సీ బీఈడీ/ బీకామ్ బీఈడీ కోర్సు కూడా చేయొచ్చు. ఎలిమెంటరీ ఎడ్యుకేష న్లో డిప్లొమాతో పాటు ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ చేసినట్లయితే, బీఈడీ చేయకుండా నేరుగా ఎంఈడీ చేయడానికి అర్హులవుతారు.
డీఈడీ/ బీఈడీ తరువాత టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో బోధన రంగంలోకి ప్రవేశించవచ్చు. మీరు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా తరువాత ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ, పీజీలతో పాటు ఎంఈడీ+ పీహెచ్డీ కూడా చేసినట్లయితే బీఈడీ/ ఎంఈడీ కోర్సులను బోధించడానికి అర్హులవుతారు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: లింగరాజు జల
Ans:
ప్రస్తుతం బీఈడీలో చదువుతున్న ఇంగ్లిష్, సోషల్ స్టడీస్ మెథడాలజీలతో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులకూ మీరు అర్హులే. వీటితో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు కూడా అర్హత ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంటర్మీడియట్/ దీనికి సమానమైన కోర్సు కచ్చితంగా చదివివుండాలి. డీఈడీ/ బీఈడీల శిక్షణ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. టెట్‌లో 1 నుంచి 5 వరకు బోధించడానికి పేపర్-1 లో, 6 నుంచి 8 వరకు బోధించడానికి పేపర్-2లో ఉత్తీర్ణత సాధించాలి. పేపర్-1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్), మేథమ్యాటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌ల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పేపర్-2లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్), మేథమ్యాటిక్స్/ సైన్స్/సోషల్ స్టడీస్‌ల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి.
ఇంటర్మీడియట్, డీఈడీ లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడీ, టెట్ల్లో ఉత్తీర్ణులయినవారు డీ…ఎస్సీ పరీక్ష రాయాల్సివుంటుంది. దీనిలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఎంచుకున్న సబ్జెక్టులో కంటెంట్, మెథడాలజీల్లో ప్రశ్నలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి జాతీయ విద్యాసంస్థల్లోనూ ప్రయత్నించండి. వీటి కోసం సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్ రాయవలసి ఉంటుంది. టెట్, సీటెట్.. రెండు పరీక్షలకూ ఒకే సిలబస్ ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్