Post your question

 

    Asked By: వెంకటరమణ‌

    Ans:

    బీఫార్మసీ పూర్తి చేశాక కొన్ని స్వల్పకాలిక కోర్సులు చేసి మెడికల్‌ కోడర్స్‌ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. మెడికల్‌ కోడింగ్‌లో శిక్షణ పూర్తిచేసినవారికి కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఫార్మా కంపెనీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. విదేశీ సంస్థలు కూడా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా మెడికల్‌ కోడర్స్‌ నియామకాలు చేపడుతున్నాయి. కరోనా సంక్షోభం తరువాత మెడికల్‌ కోడర్స్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ రంగంలోకి ప్రవేశించాలంటే హ్యూమన్‌ అటానమీ, ఫార్మా, బయాలజీలపై ప్రాథమిక అవగాహన ఉండాలి. మెడికల్‌ కోడింగ్‌ స్వల్పకాలిక కోర్సులు చేసి, పరీక్ష రాసి ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ పొందాలి. దాన్ని ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలి. ఆ తరువాత యునైటెడ్‌ హెల్త్‌ గ్రూప్, ఒమేగా, సదర్లాండ్‌ హెల్త్‌ కేర్, ఫైకేర్, ఎలికో హెల్త్‌ కేర్, ఏజిస్, మెడ్‌టెక్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు.

     

    Asked By: అబ్దుల్‌ రవూఫ్‌

    Ans:

    బీటెక్‌లో చదువుకున్న కోర్సుకు సంబంధించిన రంగంలో కొనసాగటానికి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు బీటెక్‌ చదివి 7 సంవత్సరాలు అవుతోంది కాబట్టి, కనీసం సంవత్సరం పాటు వివిధ కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ఇటీవల కాలంలో ఐటీ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, బిగ్‌ డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లాంటి రంగాలకు చాలా డిమాండ్‌ ఉంది. వీలుంటే  NPTEL, Coursera, Udemy లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ లాంటి కోర్సులను చదివే ప్రయత్నం చేయండి. మీ విషయ పరిజ్ఞానాన్ని, భావప్రకటనా సామర్ధ్యాల్ని మెరుగుపర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Srinivas

    Ans:

    మీరు హైదరాబాద్‌ జిల్లా కిందకు వస్తారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ నాలుగు సంత్సరాలు చదివితే అదే లోకల్‌ అవుతుంది. 

    Asked By: జి. అరుణ్‌కుమార్‌

    Ans:

    మీరు బీఏ (హెచ్‌ఈపీ)లో చదివిన హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ల్లో మీకు బాగా నచ్చిన సబ్జెక్టులో ఎంఏ చేయవచ్చు. ఎకనమిక్స్‌ కోర్సులో విశిష్ట స్పెషలైజేషన్‌గా ఉన్న ఫైనాన్సియల్‌ ఎకనమిక్స్‌లోనూ ఎంఏ చేసే అవకాశం ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆంత్రపాలజీ, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషల్‌ వర్క్, సైకాలజీ, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చదవొచ్చు. డిగ్రీలో మీరు చదివిన ఇంగ్లిష్, తెలుగు/ హిందీ/ సంస్కృతంలో పీజీ చేయవచ్చు. భాషాశాస్త్రంపై ఆసక్తి ఉంటే లింగ్విస్టిక్స్‌లో పీజీ చదవొచ్చు. విభిన్న భాషా సాహిత్యాలపై తులనాత్మక అధ్యయనం చేయాలనుకొంటే కంపారిటివ్‌ లిటరేచర్‌లో ఎంఏ చేయొచ్చు.
    న్యాయశాస్త్రం మీద ఆసక్తి ఉన్నట్లయితే ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ అవకాశమూ ఉంది. జర్నలిజం రంగంపై అభిరుచి ఉంటే అందులో పీజీ చేసి మీడియా రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఎంబీఏ కోర్సు చేసి, ఉద్యోగంలో త్వరగా స్థిరపడొచ్చు. డిగ్రీలో మీరు హిస్టరీ చదివారు కాబట్టి, టూరిజంలో పీజీ చదివే అవకాశాల గురించి ఆలోచించండి. పాఠశాలల్లో బోధన చేయాలనివుంటే బీఈడీ/ డీఈడీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడవచ్చు. వ్యాయామ విద్యపై ఆసక్తి ఉంటే బీపీఈడీ గురించి ఆలోచించవచ్చు. గ్రామీణాభివృద్ధి రంగంలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ లో పీజీ చేయొచ్చు. మీరు ఇంటర్‌లో మేథమేటిక్స్‌ చదివివుంటే ఎంసీఏ కోర్సులో చేరే వీలుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌. రామ్మోహన్‌

    Ans:

    ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదించిన ఆరేళ్ల ప్రొఫెషనల్‌ కోర్సు అయిన ఫార్మ్‌.డి.చదివినవారు రిటెయిల్‌ ఫార్మసిస్ట్, క్లినికల్‌ ఫార్మసిస్ట్, కమ్యూనిటీ ఫార్మసిస్ట్, డ్రగ్‌ అడ్వైజర్, అనలిటికల్‌ కెమిస్ట్, మెడికల్‌ రైటర్, క్లినికల్‌ ట్రయల్స్‌ సైంటిస్ట్, ఫార్మకో విజిలెన్స్‌ సైంటిస్ట్, లెక్చరర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులవుతారు. వీరు ఫార్మాస్యూటికల్‌ రంగంలో ప్రొడక్షన్, టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇవేకాకుండా, ఫార్మకో ఎకనమిక్స్, ఫార్మకో ఎపిడమాలజీ, క్రోనో ఫార్మకాలజీ, ఫార్మకో జెనోమిక్స్, ఫార్మకో జెనెటిక్స్‌ లాంటి విభాగాల్లోనూ ప్రత్యేకమైన ఉద్యోగావకాశాలుంటాయి. విదేశాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మనదేశంలో ఫార్మ్‌.డి కోర్సు పూర్తి చేసినవారికి ఇటీవల కొంత డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వ రంగం కంటే ప్రైవేటు రంగంలోనే వీరికి ఎక్కువ ఉద్యోగాలున్నాయి. ఫార్మ్‌. డి. తరువాత ఫార్మా కంపెనీల్లో, ప్రైవేటు ఆసుపత్రులు, క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించే సంస్థలూ, రెగ్యులేటరీ సంస్థలూ, మెడికల్‌ కోడింగ్, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో, ఫార్మసీ కళాశాలల్లో ఉపాధి కోసం ప్రయత్నించవచ్చు.   - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రవికుమార్‌

    Ans:

    భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ కేంద్రప్రభుత్వ జాతీయ సేవాపథకం- ఎన్‌ఎస్‌ఎస్‌. ఇది జూనియర్‌ కళాశాలల్లో, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వ పరిధిలోని వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులు పాల్గొనడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం- యువతకు సమాజ సేవానుభవాన్ని అందించడం. ఈ పథకంలో పాల్గొనడం వల్ల అలవడిన సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు, బృందాల్లో పనిచేయగల శక్తి సామర్థ్యాలు జీవితాంతం ఉపయోగపడతాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారికి విద్య, ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. కానీ ఇంటర్వ్యూలకు హాజరైనపుడు మీకు ఈ సర్టిఫికెట్‌ ఉండటం వల్ల ఇంటర్వ్యూ బోర్డుకు మీపై సానుకూల దృక్పథం ఏర్పడే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఉద్యోగం పొందటానికి ఈ సర్టిఫికెట్‌ కొంతమేరకు ఉపయోగపడుతుంది.

    Asked By: nayudupalli

    Ans:

    ఐటీ ఉద్యోగాల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హెల్త్‌కేర్‌కు సంబంధించిన ఐటీ కంపెనీల్లో కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మెడికల్‌/ డెంటల్‌ చదివినవారికీ అర్హత ఉంటుంది. అలాంటి సంస్థలను ఎంచుకొని, వాటిలో ఉద్యోగాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ పొంది ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. ప్రస్తుతం అనలిటిక్స్‌ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువున్నాయి. ఆ  దిశలో కూడా ప్రయత్నం చేయండి.

    మెడికల్‌ కోడింగ్‌ రంగంలో కంటే, హెల్త్‌కేర్‌ ఐటీ రంగానికే మంచి భవిష్యత్తు ఉంది. మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉద్యోగాలకోసం సర్టిఫికేషన్‌ ఇన్‌ మెడికల్‌ కోడింగ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం, సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ కోడర్‌ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం, అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ మెడికల్‌ కోడింగ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం లాంటి కోర్సుల్లో శిక్షణ పొందాలి. కెనడా/యూఎస్‌లో మెడికల్‌ కోడింగ్‌ కోర్స్‌ చేసి, ఆ దేశాల్లోనే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే మెరుగైన అవకాశాలుంటాయి. మెడికల్‌ కోడింగ్‌లో వృత్తి అనుభవం ఉన్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తారు. మొదటి ఉద్యోగం తక్కువ వేతనంతో మొదలైనా, అనుభవం పెరిగే కొద్దీ వేతనం పెరుగుతుంది. మీకు ఆసక్తి ఉంటే ఎంబీఏ హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివి, ఆ రంగంలో కూడా మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: శివప్రసాద్‌

    Ans:

    మాస్‌ కమ్యూనికేషన్‌ రంగంలో రాణించాలంటే భావప్రకటన సామర్థ్యం, సృజనాత్మకత, నెట్‌ వర్కింగ్‌ నైపుణ్యాలు, పరిశీలన, పరిశోధన, సమస్యా పరిష్కార నైపుణ్యాలు అవసరం. మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం కోర్సు చదివినవారికి మీడియా, టీవీ, రేడియోల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో, బోధన, చలనచిత్ర, అడ్వర్‌టైజింగ్, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మార్కెటింగ్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. జర్నలిజం కోర్సులో మీడియా ప్రాక్టీస్, మీడియా స్టడీస్, వీడియో ప్రొడక్షన్, ఫిల్మ్‌ ప్రొడక్షన్, డిజిటల్‌ మీడియా, కమ్యూనిటీ రేడియో, అడ్వర్‌టైజింగ్, పబ్లిక్‌ రిలేషన్స్, మల్టీమీడియా లాంటి స్పెషలైజేషన్లను ఎంచుకోవచ్చు. మీ అభిరుచి, ఆసక్తిలను బట్టి సరైన స్పెషలైజేషన్‌ ఎంచుకుని ఆ రంగంలో ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: బ్రహ్మయ్య

    Ans:

    - వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తయ్యాక ఇదే విభాగంలో పీజీ చేయవచ్చు. ఇందుకోసం ఐసీఏఆర్‌ నిర్వహించే ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి. పీజీలో.. వెటర్నరీ అనాటమీ, గైనకాలజీ, మెడిసిన్, పారాసైటాలజీ, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, పెథాలజీ, వైల్డ్‌ లైఫ్‌ సైన్స్‌/ వైల్డ్‌లైఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, వైరాలజీ, మైక్రో బయాలజీ అండ్‌ ఇమ్యునాలజీ/బ్యాక్టీరియాలజీ, సర్జరీ అండ్‌ రేడియాలజీ, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎపిడిమయాలజీ, యానిమల్‌ హజ్బెండ్రీ/ డైరీ సైన్స్, యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, యానిమల్‌ న్యూట్రిషన్, యానిమల్‌ ఫిజియాలజీ, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ హస్బెండ్రీ ఎక్స్‌టెన్షన్, లైవ్‌స్టాక్‌/ వెటర్నరీ / యానిమల్‌ హజ్బెండ్రీ ఎకనామిక్స్,... తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వెటర్నరీ ఆఫీసర్లుగా, ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు, పౌల్ట్రీఫామ్‌లు, షీప్‌ అండ్‌ రాబిట్స్‌ ఫామ్‌లు, రేస్‌ క్లబ్బులు, జువలాజికల్‌ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోటెక్‌ కంపెనీలు, బోధన కళాశాలలు, యానిమల్‌ బ్రీడింగ్‌ కేంద్రాలు, ప్రైవేటు వెటర్నరీ క్లినిక్‌లు, పరిశోధన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యానిమల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వెటర్నరీ ఫార్మా కంపెనీలు, యానిమల్‌ న్యూట్రిషన్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి.  

    Asked By: ఎస్. వినితాగౌడ్

    Ans:

    బీఎస్సీ (ఎంబీజడ్‌సీ)లో మీరు చదువుతున్న మైక్రో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ... మూడు సబ్జెక్టుల్లో ఎంఎస్సీ చదవొచ్చు. ఇవేకాకుండా ప్లాంట్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ, యానిమల్‌ బయాలజీ, బయోటెక్నాలజీల్లో కూడా పీజీ చదివే అవకాశం ఉంది. పరిశోధనా రంగంపై ఆసక్తి ఉంటే లైఫ్‌సైన్స్‌ సబ్జెక్టుల్లో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పీహెచ్‌డీ, బోధనా రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేయొచ్చు. ఇక ఉద్యోగావకాశాల విషయానికొస్తే.. బయోటెక్‌ కంపెనీల్లో, ఫార్మా కంపెనీల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల్లో, బయో మెడికల్‌ కంపెనీల్లో, ఆగ్రో బేస్డ్‌ పరిశ్రమల్లో, బెవరేజ్‌ ఇండస్ట్రీలో, పర్యావరణ పరిశోధన సంస్థల్లో, మెడికల్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో, యూనివర్సిటీ/ కళాశాల ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. బీఎస్సీ విద్యార్హతతో పొందే ఉద్యోగాలకు వేతనాలు ఆకర్షణీయంగా ఉండవు. ఏదైనా సబ్జెక్టులో పీజీ చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌