Post your question

 

    Asked By: కార్తీక్

    Ans:

    బీటెక్‌ మెకానికల్‌ చదివినవారు యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ రాయటానికి అర్హులవుతారు. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, కోల్‌ ఇండియా, గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోలియం కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌ గ్రిడ్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత్‌ ఎలక్ట్రానిక్స్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియా, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్, మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్, నేషనల్‌ అల్యూమినియం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లాంటి  ప్రభుత్వరంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలుగా, ఇంజినీర్‌ ట్రైనీలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పైవాటిలో చాలా సంస్థలు గేట్‌ పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతాయి. డీ…ఆర్‌డీవో లాంటి రక్షణ సంస్థల్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. రాష్ట్ర రోడ్‌ రవాణా సంస్థల్లో కూడా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారికి కొలువులు లభిస్తాయి. వీటితో పాటు డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం.కీర్తి

    Ans:

    ఇటీవలి కాలంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు అవసరానికి మించిన సంఖ్యలో అందుబాటులో ఉన్నారు. చాలా సంస్థలు వారికి కావలసినవారిని ప్రాంగణ నియామకాల్లోనే తీసుకుంటున్నాయి. ఉద్యోగానుభవం ఉన్నవారిని మాత్రమే నేరుగా నియమించుకొంటున్నారు. మీరు బీటెక్‌ తరువాత స్కూళ్లలో పనిచేశారు కాబట్టి, నేరుగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సాధించడం కొంత కష్టమే. మీ స్కూల్‌ ఉద్యోగానుభవం ఉపయోగపడేలా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీలోకి ప్రవేశించే ప్రయత్నం చేయండి. ఈ రంగంలో టెక్నాలజీ పరిజ్ఞానం, సాఫ్ట్‌ స్కిల్స్, ఆన్‌లైన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌ టూల్స్, డిజిటల్‌ సెక్యూరిటీలపై పట్టు ఉండాలి. వీటితో పాటు యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్, గేమిఫికేషన్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌/ ప్రోగ్రామింగ్, కాంకరెంట్‌ ప్రోగ్రామింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, సోషల్‌ మీడియా, ఇన్‌స్ట్రక్షనల్‌ డిజైన్‌లపైనా కొంత అవగాహన ఉండాలి. కొంత అనుభవం గడించాక, సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి పూర్తిగా మారే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కృష్ణ

    Ans:

    - ఎథికల్‌ హ్యాకింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన రంగం. ఈ రంగంలో రాణించాలంటే విపరీతమైన ఆసక్తి, విషయ పరిజ్ఞానం చాలా అవసరం. ఈ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సవాళ్ళ దృష్ట్యా నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణ పొందినవారికి పెనట్రేషన్‌ టెస్టర్, వల్నరబిలిటీ అసెసర్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్, సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్, సెక్యూరిటీ ఇంజినీర్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. నెట్‌ వర్కింగ్, కంప్యూటర్‌ సిస్టమ్స్, వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్, వివిధ రకాల పాస్‌వర్డ్స్‌ను ఛేదించగలగటం, ఎథికల్‌ హ్యాకింగ్‌పై పూర్తి పరిజ్ఞానం, ఎన్‌క్రిప్షన్, క్రిప్టోగ్రఫీ, కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్, ప్రొఫెషనల్‌ కాండక్ట్‌లపై పట్టు సాధించాలి. ఎథికల్‌ హ్యాకింగ్‌లో నిలదొక్కుకోవాలంటే, సీ, సీ++, పైతాన్, ఎస్‌క్యూఎల్, జావా, పీహెచ్‌పీ..లాంటి కోడింగ్‌ లాంగ్వేజ్‌లూ నేర్చుకోవాల్సిందే. కాబట్టి మీరు సీ, సీ++, పైతాన్‌లు నేర్చుకోవడం ద్వారా ఎథికల్‌ హ్యాకింగ్‌తో పాటు, ఇతర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలనూ ప్రయత్నించవచ్చు.

    Asked By: హరిచరణ్‌

    Ans:

    మీ అనుభవాన్ని బట్టి ళీతిశి కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో మీరు ఏయే విభాగాల్లో పనిచేశారో, ఏ విభాగంలో మీకు ఆసక్తి ఉందో ళీతిశి లో సంబంధిత మాడ్యూల్‌ని చేయండి. ఐటీ ఉద్యోగాలు అంటే టెస్టింగ్, డెవలపింగ్‌ మాత్రమే కాదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉన్న మీకు మెకానికల్‌ డిజైన్స్, డ్రాయింగ్, అనాలిసిస్‌ల్లో కూడా ఐటీ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే ప్రోగ్రామింగ్, కోడింగ్‌ కోర్సులు చేయండి. డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి కోర్సులు చేసి ఆ రంగంలోనూ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఫ్రెషర్స్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు ఎక్కువ. కాబట్టి మీకు అనుభవమున్న మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.

    Asked By: జ్యోత్స్న

    Ans:

    ఇతర విభాగాలతో పోలిస్తే కంప్యూటర్‌ సైన్స్‌తో ఇంజినీరింగ్‌ చదివినవారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. వీరికి ఆకర్షణీయమైన వేతనాలతో ప్రైవేటు రంగంలో చాలా ఉద్యోగాలున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారిని కూడా గేట్‌ అర్హతతో, ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకొంటాయి. ఎన్‌ఐసీ‡, ఇస్రో, డీఆర్‌డీవో, బార్క్‌ లాంటి పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. వీటితో పాటు స్టీల్‌ ప్లాంట్స్, ఇంటలిజెన్స్, ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్, రైల్వేల్లో ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సిస్టమ్స్‌ ప్రోగ్రామర్‌ లాంటి ఉద్యోగాలకు కంప్యూటర్‌ సైన్స్‌తో ఇంజిరింగ్‌ చదివినవారికి అర్హత ఉంటుంది. పైన చెప్పిన చాలా ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు అదనంగా గ్రూప్‌ డిస్కషన్‌ కూడా ఉండే అవకాశం ఉంది.
    ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యేవారు ఆ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను క్షుణ్ణంగా చదవాలి. దాదాపు అన్ని నియామక పరీక్షలూ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతోనే ఉంటాయి. కొన్ని పరీక్షల్లో నెగిటివ్‌ మార్కులూ ఉండొచ్చు. రాత పరీక్షలో కనపర్చిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపికవుతారు. ఇంటర్వ్యూల్లో థియరీ కంటే అప్లికేషన్‌ల మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు ఇవ్వటంతో పాటు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కూడా అవసరం. కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు హిందీలో మాట్లాడగలగటం అదనపు అర్హత అవుతుంది. ఇవే కాకుండా డిగ్రీ అర్హత ఉన్న ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ యూపీఎస్‌సీ, ఎల్‌ఐసీ, బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగాలకోసం కూడా ప్రయత్నించవచ్చు.

    Asked By: ఎం.పార్థసారథి నాయుడు

    Ans:

    ఇంటర్‌ చదివిన తరువాత త్వరగా ఉద్యోగం సంపాదించాలంటే ప్రాచుర్యమున్న ఏదో ఒక కోర్సులో డిగ్రీ/ ఒకేషనల్‌ డిగ్రీ చేయాలి. ఉదాహరణకు- హోటల్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ సైన్స్, టూరిజం మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, డేటా సైన్స్, రిటెయిలింగ్, ఈ-కామర్స్, డిజిటల్‌ మార్కెటింగ్, కోడింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఆటోమొబైల్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, రెఫ్రిజరేషన్, ఏర్‌కండిషనింగ్, ఫారిన్‌ ట్రేడ్, యానిమేషన్, మల్టీమీడియా, విజువల్‌ ఆర్ట్స్, మాస్‌ కమ్యూనికేషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, వెబ్‌ డిజైనింగ్, ఇంటీరియర్‌ డిజైన్‌. మీకు బోధనరంగంపై ఆసక్తి ఉంటే డీ…ఈడీ చేసే అవకాశం ఉంది. లాయర్‌గా స్థిరపడే ఆలోచన ఉంటే ఐదు సంవత్సరాల లా కోర్సు గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవే కాకుండా చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, కాస్ట్‌ అండ్‌ వర్క్‌ అకౌంటెంట్‌ లాంటి కోర్సులు చేసినవారికీ డిమాండ్‌ ఉంది. పైన చెప్పిన కోర్సుల్లో ఆసక్తి ఉన్న కోర్సును చదివి, త్వరగా ఉద్యోగం సంపాదించాలనే మీ కల నిజం చేసుకోండి! - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రామకృష్ణ

    Ans:

    ఎంటెక్‌ కోర్సు దూరవిద్యలో చేయడానికి అవకాశం లేదు. మీరు ఎంటెక్‌ కోర్సుని రెగ్యులర్‌గా చదవాలనుకొంటే రెండు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టి, మంచి విద్యాసంస్థలో చదివే ప్రయత్నం చేయండి. అతి తక్కువ యూనివర్సిటీల్లో పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ కోర్స్‌ కాలవ్యవధి మూడు సంవత్సరాలు. ఈ కోర్సులో క్లాసులు సాయంత్రం పూట నిర్వహిస్తారు. బిట్స్‌ పిలానీలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఎం టెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె. విజయ్‌కుమార్‌

    Ans:

    ఏఐసీటీఈ గెజెట్‌ నోటిఫికేషన్‌ (28 ఏప్రిల్, 2017) ప్రకారం ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్‌ రెండు డిగ్రీలు కూడా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో కానీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో గానీ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్‌ రెండు డిగ్రీలూ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో అయినా, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో అయినా ఉండాలి.
    ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ 23 అక్టోబర్, 2020 నాడుఏఐసీటీఈ మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం మీరు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హులు కారు. ప్రస్తుతం మీకున్న విద్యార్హతలతోనే బోధన రంగంలో స్థిరపడాలనే ఆలోచన ఉంటే పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఇంజినీరింగ్‌ కళాశాల్లోనే పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంటెక్‌ చేసి, ఆ విభాగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. జాతీయ విద్యావిధానం అమలు జరిగినపుడు  సబ్జెక్టుల మధ్య ఉన్న అంతరాలు తగ్గుతాయి. ఉద్యోగ అర్హతా నియమాల్లోనూ  మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

    Asked By: ఎ. అరవింద్‌

    Ans:

    ఏ సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసినవారికైనా పూర్వ విద్యార్హతలతో సంబంధం లేకుండా సమస్యా పరిష్కార సామర్థ్యం, కోడింగ్, ప్రోగ్రామింగ్, అనలిటికల్‌ నైపుణ్యాలు ఉంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ. మీరు డిగ్రీ చేయడానికి తీసుకున్న ఎక్కువ సమయం పెద్ద సమస్య కాదు. డిగ్రీ పూర్తి చేశాక ఏ రంగంలో స్వయం ఉపాధి పొందుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో వచ్చిన మార్కులను కాకుండా మీకున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొనే కంపెనీలు చాలా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ  చేయడం అనేది మీకో అదనపు అర్హత అవుతుంది. ముందుగా మీరు డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ కోర్సులను మరొకసారి పూర్తిగా చదివి విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకోండి. కొన్ని లైవ్‌ ప్రాజెక్టుల్లో పనిచేసి మీ బయోడేటాను మెరుగుపర్చుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే సీ‡, సీ‡ ప్లస్‌ ప్లస్, జావా, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, వెబ్‌ డెవలప్‌మెంట్, బిగ్‌ డేటా, మెషిన్‌ లర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి వాటిలో మీకు నచ్చిన కోర్సుల్ని చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: nayudupalli

    Ans:

    - రెండు ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లో దేని ప్రత్యేకత దానిదే. ఆసక్తీ, అభిరుచులకు అనుగుణంగా ఏ బ్రాంచినైనా ఎంచుకోవాల్సివుంటుంది.

    ఈసీఈలో ఇంజినీరింగ్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ట్రాన్స్‌మిటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ లాంటి కమ్యూనికేషన్‌ పరికరాల గురించి చదువుతారు. వీటితో పాటు బేసిక్‌ ఎలక్ట్రానిక్స్, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌మిషన్, డేటా, వాయిస్, వీడియో రిసెప్షన్‌ (ఉదాహరణ ఏఎం, ఎఫ్‌ ఎం, డీటీహెచ్‌), మైక్రోప్రాసెసర్‌లు, శాటిలైట్‌ కమ్యూనికేషన్, మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్, యాంటెన్నా, వేవ్‌ ప్రోగ్రెషన్‌ల గురించీ తెలుసుకుంటారు. ఉపగ్రహాలు, టెలివిజన్, రేడియో, కంప్యూటర్లు, మొబైల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్‌ లాంటి అప్లికేషన్ల తయారీలో ఈ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు.

    టెలికమ్యూనికేషన్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/ఐటీ, పవర్‌ సెక్టర్, హార్డ్‌వేర్‌ తయారీ, గృహోపకరణాలు, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, టెలివిజన్‌ పరిశ్రమ, పరిశోధన- అభివృద్ధి, ఆధునిక మల్టీమీడియా సేవా సంస్థల్లో, సివిల్‌ ఏవియేషన్, డిఫెన్స్, ఆలిండియా రేడియో, రైల్వే, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, డీఆర్‌డీ…ఓ లాంటి వివిధ రంగాల్లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు ఎక్కువ. 

    కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో కంప్యుటేషన్‌కు సంబంధించిన వివిధ అంశాలతో పాటు కంప్యూటర్‌ నెట్‌ వర్క్, అల్గారిద]మ్‌ల విశ్లేషణ, ప్రోగ్రామింగ్‌ భాషలు, ప్రోగ్రామ్‌ డిజైన్, సాఫ్ట్‌వేర్, డేటా మైనింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ల గురించి చదువుతారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మూలాలు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, గణితం, ఎలక్ట్రానిక్స్, భాషాశాస్త్రంలో ఉన్నాయి. వివిధ పరిశ్రమల కోసం సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను రూపొందించి అభివృద్ధి చేయడం, సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్క్‌లను నిర్వహించడంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. పర్సనల్‌ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, స్కానర్‌ లాంటి కంప్యూటింగ్‌ పరికరాల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల కోసం కోడ్, సెక్యూరిటీ, అల్గారిద]మ్‌లను తయారుచేస్తారు. ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, అభివృద్ధి, టెస్టింగ్, నెట్‌వర్కింగ్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగావకాశం ఉంది.

    ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన కృత్రిమ మేధ, మెషిన్‌ లర్నింగ్, డేటా సైన్స్‌ లాంటి వినూత్న రంగాల్లో కూడా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లకు మెరుగైన ఉపాధి అవకాశాలున్నాయి.