Post your question

 

    Asked By: మనోజ్‌

    Ans:

    సాధారణంగా నేర పరిశోధనను పోలీసు వ్యవస్థ చేస్తుంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివినవారు నేరపరిశోధనలో సహకారం మాత్రమే అందిస్తారు. ఒక నేరంలో అందుబాటులో ఉన్న సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ నిపుణులు శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి నివేదికను న్యాయస్థానాల్లో సమర్పిస్తారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌లో వివిధ విభాగాలుంటాయి. వాటిలో ఫోరెన్సిక్‌ ఆంత్రొపాలజీ, కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ, ఫింగర్‌ ప్రింట్, డీఎన్‌ఏ ప్రొఫైలింగ్, ఫోరెన్సిక్‌ బాలిస్టిక్స్, ఫోరెన్సిక్‌ పాథాలజీ, ఫోరెన్సిక్‌ సైకాలజీ, ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ముఖ్యమైనవి. మీ ఆసక్తిని బట్టి సరైన స్పెషలైజేషన్‌ ఎంచుకోండి. స్పెషలైజేషన్‌లు డిగ్రీ చివరి సంవత్సరంలో కానీ, పీజీలో కానీ ఉంటాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు ఫోరెన్సిక్‌ కోర్సును డిగ్రీ, పీజీ స్థాయిలో  అందిస్తున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ కోసం ప్రత్యేకించి నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ ఉంది. మద్రాసు యూనివర్సిటీ బీఏ స్థాయిలో పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ క్రిమినాలజీ కోర్సును అందిస్తోంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సు చదివినవారికి పోలీస్‌ శాఖ, డిఫెన్స్, కేంద్ర/రాష్ట్ర ప్రైవేటు ఫోరెన్సిక్‌ పరిశోధన సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రోహిత్‌

    Ans:

    మధ్యలోనే మానేసి నాకిష్టమైనది చదవాలా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. - రోహిత్‌
    ప్రస్తుతం మీ సమస్య చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్నదే. మనదేశంలో సరైన కెరియర్‌ నిర్ణయాలను తీసుకోవడంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ చాలాసార్లు విఫలమవుతున్నారు. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు సామాజిక హోదా కోసం వారిని బలవంతంగా ఇంజినీరింగ్‌/ ఇతర కోర్సులు చదివిస్తున్నారు.
    ఇంజినీరింగ్‌లో చాలా బ్రాంచ్‌లు ఉన్నప్పటికీ త్వరగా ఉద్యోగం వస్తుందన్న ఆశతో కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, ఐటీ, ఏఐ లాంటి బ్రాంచీల్లో మూకుమ్మడిగా చేర్పిస్తున్నారు. నాలుగు, ఐదు సంవత్సరాల తరువాత ఒకవేళ పరిస్థితులు మారితే మనదేశంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన నిరుద్యోగులు చాలామంది ఉండొచ్చు. ఈ మొత్తం ప్రక్రియలో విద్యార్థులు చాలా సందర్భాల్లో వారికి నచ్చని కోర్సులు చదవలేక, వదిలి రాలేక సతమతమవుతున్నారు.
    మీ విషయానికొస్తే ఆసక్తి లేని కోర్సును చదవడం అనవసరం. ఇంజినీరింగ్‌ కోర్సును మధ్యలో వదిలివేయడం కంటే మీరు ఏ కోర్సు, ఎక్కడ చదవాలని అనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ‘సోషల్‌ వెల్ఫేర్‌’ అనే కోర్సు ప్రత్యేకంగా ఉండదు. రూరల్‌ డెవలప్‌మెంట్, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ లాంటి సోషల్‌ సైన్స్‌ కోర్సుల్లో నచ్చిన కోర్సును ఎంచుకోండి. సామాజిక సేవ, సంక్షేమం, అభివృద్ధి లాంటి రంగాల్లో పనిచేసేవారికి ఆత్మసంతృప్తి ఉంటుంది. అయితే సాప్ట్‌వేర్‌ రంగంలో ఉన్నంత పెద్ద వేతనాలు దక్కవు. 
    ప్రస్తుతం మీరు అనుకొంటున్న కెరియర్‌తో జీవితకాలం ప్రయాణించగలరా లేదా అనేది ఆలోచించండి. అసలు ‘సోషల్‌ వెల్ఫేర్‌’ అంటే మీ ఉద్దేశం ఎంటి? స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజాభివృద్ధి చేయడమా, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా చేయడమా? దీనిపై స్పష్టత పొందండి.
    ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజాభివృద్ధి చేయాలనుకుంటే మీముందు మూడు అవకాశాలున్నాయి. 1) ఇంజినీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి సివిల్‌ సర్వీసెస్‌/ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించడం. 2) ఇంజినీరింగ్‌ కోర్సును మధ్యలోనే వదిలేసి, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవడం. 3) డిగ్రీ పూర్తయ్యాక, విదేశాల్లో సోషల్‌ సైన్స్‌ సంబంధిత కోర్సులు చదివి, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగం చేస్తూ మీ ఆశయాన్ని నెరవేర్చుకోవడం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, దాని పర్యవసానాలు మీరే అనుభవించాలి కాబట్టి, అన్ని కోణాల్లో ఆలోచించుకోండి. మీ మనసుకూ, జీవితానికీ సరిపడే సరైన నిర్ణయాన్ని తీసుకోండి! -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Saikumar

    Ans:

    According to Air quality index (AQI) latest update (July 12, 2023) Highest air polluted cities in India are..

     

    1 Ganganagar, Rajasthan

    2 Banswara, Rajasthan

    3 Ghandinagar, Gujarat

    4 Tonk, Rajasthan

    5 Dhanbad, Jharkhand

    6 Rajsamand, Rajasthan

    7 Sawai Madhopur, Rajasthan

    8 Dausa, Rajasthan

    9 Secunderabad, Telangana

    10 Adalaj, Gujarat

    Asked By: manda

    Ans:

    You can get the MLSC and BLSC books from Ambedkar open university and Osmania university. Their are no special material available in websites. You can follow any youtube channel which is providing good information

    Asked By: రమ్యకృష్ణ

    Ans:

    - నచ్చింది చదవడానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. కానీ, విదేశీ విద్య విషయానికి వచ్చేసరికి వీసా నిబంధనలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ముందుగా.. మీరు ఏ దేశంలో ఉన్నత విద్యను చదవాలని అనుకుంటున్నారో.. ఆ దేశ వీసా నిబంధనలను తెలుసుకోండి. సాధారణంగా అమెరికా, కెనడా లాంటి దేశాల్లో 30 సంవత్సరాలు దాటిన వారికి స్టూడెంట్‌ వీసా, స్కాలర్‌షిప్‌ పొందడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీ చదువుకి అయ్యే మొత్తం ఖర్చు మీరే భరిస్తే ప్రోగ్రామింగ్‌ కోర్సు చేసే అవకాశం ఉంది. మీ విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటే మీరు స్టూడెంట్‌గా కాకుండా స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్‌) ప్రొఫెషనల్‌ కేటగిరీలో నేరుగా పర్మినెంట్‌ రెసిడెంట్‌ వీసా కోసం ప్రయత్నం చేసుకుని.. అక్కడ ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది. ఈ వయసులో ఈ నిర్ణయం సరైనదేనా, కాదా అనేది మీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది. ఈ నిర్ణయం మీతోపాటు మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తుని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి అందరితో చర్చించి.. లాభనష్టాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లండి.

    Asked By: సౌమ్య

    Ans:

    గత మూడు నాలుగు సంవత్సరాల క్యూఎస్‌ ర్యాంకింగ్‌ను బట్టి ఏదైనా విదేశీ యూనివర్సిటీ నాణ్యతపై ఒక నిర్థరణకు రావొచ్చు. మొత్తం యూనివర్సిటీ ర్యాంకింగ్‌తో పాటు, సబ్జెక్టుల వారీగా కూడా క్యూఎస్‌ ర్యాంకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇటీవల విడుదలయిన ర్యాంకింగ్‌లను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌లో పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీల జాబితా తయారు చేసుకోండి. ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను సందర్శించి, అడ్మిషన్‌ వివరాలను తెలుసుకోండి. క్యూఎస్‌తో పాటు టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్‌లను కూడా పరిగణనలోకి తీసుకోండి.
    క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ప్రకారం- ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌లో మొదటి పది స్థానాల్లో ఉన్న యూనివర్సిటీలు- 1. ఆక్స్‌ఫర్డ్‌ 2. కేంబ్రిడ్జ్‌ 3. హార్వర్డ్‌ 4. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా- బర్కిలీ 5. యేల్‌ 6. కొలంబియా 7. స్టాన్‌ఫోర్డ్‌ 8. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా- లాస్‌ ఏంజిల్స్‌ 9. ఎడిన్‌బరో 10. ప్రిన్స్‌టన్‌. సాధారణంగా విదేశాల్లో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేయడానికి ఐఈఎల్‌టీఎస్‌ కానీ, టోఫెల్‌ కానీ రాయవలసివుంటుంది. జీఆర్‌ఈ అవసరం అరుదుగా ఉండొచ్చు. విదేశాల్లో పీహెచ్‌డీ చేయాలంటే,  ఆంగ్ల ప్రావీణ్యత పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, కనీసం రెండు నాణ్యత కల అంతర్జాతీయ పరిశోధనపత్రాలు కూడా అవసరం అవుతాయి. వీలుంటే విదేశాల్లో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌లో మరో పీజీ చేస్తే, మీరు పీహెచ్‌డీలో ప్రవేశం పొందడానికి మెరుగైన అవకాశాలుంటాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌