Post your question

 

    Asked By: రీటా

    Ans:

    సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేయడానికి ఇతర దేశాల్లో వివిధ అత్యుత్తమ యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి - ఎంఐటీ యూనివర్సిటీ (యూఎస్‌ఏ), మిషిగాన్‌ యూనివర్సిటీ- రాస్‌ (యూఎస్‌ఏ), డబ్ల్యూయూ వియన్నా యూనివర్సిటీ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ బిజినెస్‌ (ఆస్ట్రియా), ఎరాస్‌మస్‌ యూనివర్సిటీ (నెదర్లాండ్స్‌), సదరన్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ- మార్షల్‌ (యూఎస్‌ఏ), ట్రినిటీ కాలేజ్‌- డబ్లిన్‌ (ఐర్లండ్‌), మాంచెస్టర్‌- అలియన్స్‌ (యూకే, పోలిటేస్నికో డి మిలానో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌- మిలాన్‌ (ఇటలీ), పర్‌డ్యూ యూనివర్సిటీ- క్రానర్ట్‌ (యూఎస్‌ఏ), వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సియాటిల్‌ (యూఎస్‌ఏ). ఇవే కాకుండా మరికొన్ని విశ్వవిద్యాలయాలు కూడా సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను అందిస్తున్నాయి. వాటి వివరాల కోసం క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌ వెబ్‌సైట్‌ చూడండి. మరిన్ని అడ్మిషన్‌ వివరాలకోసం ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లను కూడా సందర్శించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.రాజు, మచిలీపట్నం

    Ans:

    ఐటీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఉద్యోగ విప్లవాల తరువాత సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ లాంటి కోర్సులు చదివినవారికి ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటి సంప్రదాయ కోర్సులు చదివినవారు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం పొందలేకపోతే, కాలేజ్‌ నుంచి బయటకి వచ్చాక సొంతంగా ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టంగా ఉంది. ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందాలంటే నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. ఆసక్తి ఉంటే ఏవైనా స్వల్పకాలిక ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకొని ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించండి. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి ఎంబీఏ చేసే అవకాశం కూడా ఉంది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లోనే స్వల్పకాలిక కోర్సుల విషయానికొస్తే- ఆటో క్యాడ్, త్రీడీ ప్రింటింగ్, మెకట్రానిక్స్, ప్రొడక్ట్‌ డిజైన్, ప్రెడిక్టివ్‌ మెయింటెనెన్స్, డీప్‌ లెర్నింగ్, మెషిన్‌ లెర్నింగ్‌ విత్‌ పైతాన్, రోబోటిక్‌ ఆపరేటింగ్‌ సిస్టం, మ్యాట్‌ ల్యాబ్, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, డిజైన్‌ ఆఫ్‌ మౌల్డ్స్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. మరిన్ని స్వల్పకాలిక కోర్సుల వివరాల కోసం సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ వెబ్‌సైట్‌ సందర్శించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.అశోక్, గోదూర్, జగిత్యాల జిల్లా

    Ans:

    బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్‌గానే చదవాలి. దూరవిద్య ద్వారా చదవడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు లాసెట్‌ రాసి ఏదైనా న్యాయ కళాశాలల్లో ప్రవేశం పొందినా, మీరు రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాలి. మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందున కళాశాలకు ప్రతిరోజూ వెళ్ళడం సాధ్యం కాదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత చదువులు చదవాలంటే ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలి. కాబట్టి మీరు ఉద్యోగం చేస్తూ ఈ కోర్సు చదవడం కష్టమే. అవకాశం ఉంటే మూడేళ్లు సెలవుపై వెళ్లడానికి మీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఎల్‌ఎల్‌బీ చదవవచ్చు. అలా కుదరకపోతే పదవీ విరమణ తరువాత మీ కల నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె.నవీన్‌కుమార్‌

    Ans:

    విదేశాల్లో పీజీ చేయాలంటే ముందుగా ఏ దేశంలో, ఏ సబ్జెక్ట్‌లో, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత, ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి, అక్కడ పీజీ చదవడానికి అవసరమైన ప్రవేశ పరీక్షలు, కావాల్సిన స్కోర్లు లాంటి వాటిని తెలుసుకోవడం శ్రేయస్కరం. ఈ క్రమంలో, విదేశాల్లో చదువుతున్న మీ సీనియర్‌ల సలహాలు, సూచనలు సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడతాయి. విదేశాల్లో పీజీ చేయడం ఖర్చుతో కూడుకొన్న విషయం కాబట్టి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం చాలా ముఖ్యం. మీ కుటుంబానికి అంత స్థోమత లేకపోతే బ్యాంకు రుణం కోసం ప్రయత్నించండి. భారత ప్రభుత్వ విదేశీ విద్యా సహకార స్కాలర్‌షిప్‌ల గురించి, విదేశీ యూనివర్శిటీల్లో చదువుతూ, సంపాదించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేయండి.
    యూఎస్‌లో పీజీ చేయాలంటే ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్యం తెలుసుకొనే ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ లాంటి పరీక్షల్లో మంచి స్కోరు పొందాలి. కొన్ని యూనివర్సిటీలు ఈ పరీక్షలతో పాటు జీఆర్‌ఈ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును బట్టి ప్రవేశాలు/ ఫెలోషిప్‌లు ఇస్తున్నాయి. వివిధ విదేశీ యూనివర్సిటీలు రకరకాల నిబంధనలను ఆధారంగా చేసుకొని పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తాయి. విదేశీ యూనివర్శిటిల్లో ప్రవేశానికి, పైన పేర్కొన్న అంశాలతో పాటు, మీ కళాశాల అధ్యాపకులు రాసే రిఫరెన్స్‌ లెటర్స్, మీరు రాసే స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేయాలంటే కూడా పైన పేర్కొన్న చాలా అంశాలు మీకు వర్తిస్తాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: వి.సాయికృష్ణ

    Ans:

    ఇటీవలి కాలంలో చాలామంది విద్యార్ధులు ఇంటర్‌ తరువాత బీకాం డిగ్రీపై ఆసక్తి చూపుతున్నారు. దానికి ముఖ్య కారణం- కామర్స్‌ చదివినవారికి పెరుగుతున్న ఉద్యోగావకాశాలే! ముందుగా ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే, బీకాం చదివినవారు ఎంకాం, ఎంబీఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ అకౌంటింగ్, చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్, మాస్టర్స్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ స్టడీస్, మాస్టర్స్‌ ఇన్‌ ఇన్సూరెన్స్‌ స్టడీస్, మాస్టర్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ లాంటి చాలా ప్రోగ్రామ్‌లు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు లా, పబ్లిక్‌ పాలసీ, టూరిజం, రిటైలింగ్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, జర్నలిజం, సైకాలజీ, ఫైనాన్సియల్‌ ఎకనామిక్స్, ఇంగ్లిష్‌/ తెలుగు లిటరేచర్, బిజినెస్‌ అనలిటిక్స్, ఎడ్యుకేషన్‌ లాంటి సబ్జెక్టుల్లో డిగ్రీ/ పీజీ కూడా చేయవచ్చు.
    బీకాం చదివినవారు అకౌంటెంట్, ట్యాక్స్‌ కన్సల్టెంట్, అకౌంట్స్‌ అనలిస్ట్, బిజినెస్‌ అనలిస్ట్, రిస్క్‌ మేనేజర్‌ లాంటి చాలా ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రభుత్వ/ ప్రైవేటు బ్యాంకుల్లో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ రిటైలింగ్‌ సంస్థల్లో, ఫైనాన్స్‌ సంబంధిత ఐటీ కంపెనీల్లో, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో, ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు బీకాం చదివినవారికి అవకాశాలుంటాయి. కామర్స్‌లో పీజీ చేసి, జూనియర్‌/డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా, పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా స్థిర పడవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె.రామకృష్ణ

    Ans:

    ఎంఎల్‌ఐఎస్‌సీ చదివినవారికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో వివిధ రకాలైన లైబ్రేరియన్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. యూనివర్సిటీల్లో అయితే.. ప్రొఫెషనల్‌ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్‌ లైబ్రేరియన్, అసిస్టెంట్‌ లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, లైబ్రేరియన్‌ లాంటి  చాలా ఉద్యోగాలకు మీరు అర్హులవుతారు. వీటితో పాటుగా ఆర్కైవిస్ట్, ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ డైరెక్టర్, రికార్డ్‌ మేనేజర్, డాక్యుమెంటేషన్‌ ఆఫీసర్‌ లాంటి ఉద్యోగాల గురించి కూడా ఆలోచించవచ్చు. బ్యాంకుల్లో, మ్యూజియాల్లో కూడా లైబ్రరీ సైన్స్‌ చదివినవారికి పరిమిత సంఖ్యలో అవకాశాలుంటాయి.
    బోధన రంగంపై ఆసక్తి ఉంటే లైబ్రరీ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి, అధ్యాపక ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. విదేశాల్లో కూడా దాదాపుగా పైన పేర్కొన్న ఉద్యోగాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు రంగానికొస్తే - యూనివర్సిటీల్లో, కళాశాలల్లో లైబ్రేరియన్‌ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీ సైన్స్‌ చదివినవారికి మీడియా రంగంలోనూ ఉపాధికి వీలుంటుంది. లైబ్రరీ సైన్స్‌ పరిజ్ఞానంతో పాటు, కొంత ఐటీ పరిజ్ఞానం కూడా పెంపొందించుకొంటే ఇన్ఫర్మేషన్‌ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్‌ ఆర్కిటెక్ట్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులవుతారు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం. రాజేష్‌

    Ans:

    ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేసినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. కంప్యూటర్‌ ప్రోగ్రామర్, సిస్టమ్స్‌ అనలిస్ట్, సిస్టమ్స్‌ మేనేజర్, సిస్టమ్స్‌ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్‌ ఇంజినీర్, కంప్యూటర్‌ సైంటిస్ట్, టెక్నికల్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్, ఐటీ ఆఫీసర్, ఐటీ కన్సల్టెంట్, కంప్యూటర్‌ అసోసియేట్‌..ఇలాంటివి. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎన్‌ఎండిసీ‡, కోల్‌ ఇండియా, ఎన్టీపీసీ, భారత్‌ పెట్రోలియం, సెయిల్, గెయిల్‌ లాంటి మరెన్నో సంస్థల్లో పైన పేర్కొన్న ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా ఐటీ కొలువులు ఉంటాయి. ఈ సంస్థలన్నీ ప్రత్యేకమైన ఉద్యోగ నోటిఫికేషన్‌ల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి.
    మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే జవహర్‌ నవోదయ/ కేంద్రీయ విద్యాలయ లాంటి సంస్థల్లో కంప్యూటర్‌ టీచర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లను తరచుగా సందర్శిస్తూ ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు, దరఖాస్తు చేసుకోండి.  అవసరమైన పరీక్ష రాసి ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ప్రయత్నించండి. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కంప్యూటర్‌/ఐటీ ఉద్యోగాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆ తక్కువ ఉద్యోగాలకు ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చేసినవారితో పాటు, ఎంసీఏ, బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారూ దరఖాస్తు చేస్తుండటం వల్ల పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలోపు ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించి ఉద్యోగానుభవాన్ని పొందండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: లావణ్య

    Ans:

    మీరు మహారాష్ట్రలో ఏ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారో చెప్పలేదు. అది ప్రభుత్వ యూనివర్సిటీనా, డీమ్డ్‌ టుబీ వర్సిటీనా, ప్రైవేటు యూనివర్సిటీనా, ఆ విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు ఉందా అనే విషయాలు తెలిపివుండాల్సింది. డిగ్రీ కోర్సుకు సంబంధించిన కాలవ్యవధి, రకరకాల డిగ్రీలు, డిగ్రీ ప్రోగ్రామ్‌కు అవసరమైన నిర్దిష్ట క్రెడిట్‌ల సంఖ్యను యూజీసీ గెజెట్‌ రూపంలో తెలియచేసింది. ఒకవేళ మీరు డిగ్రీ పొందిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉండి, దాని మార్గదర్శకాలకు లోబడి మీ డిగ్రీ కోర్సు నిర్వహించివుంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈక్వివలెన్స్‌ సర్టిఫికెట్‌ పొందడం కష్టమేమీ కాదు. ఈ సర్టిఫికెట్‌ భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీలో విద్య, ఉద్యోగావసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈక్వివలెన్స్‌ సర్టిఫికెట్‌ను ఇతర ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఇ. మాధురి

    Ans:

    - ఫార్మా కంపెనీల్లో దాదాపు 9 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి, ఆ అనుభవంతోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఈ క్రమంలో మీరు అంతకుముందు పొందిన వేతనం కంటే తక్కువకైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ కొంత ఇబ్బందికరంగా ఉన్నందున నచ్చిన ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న ఉద్యోగంలో చేరండి. ఆపై మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయండి. ఆర్‌ అండ్‌ డీలోనూ పనిచేశారు కాబట్టి ఫార్మసీలో పీహెచ్‌డీ    చేసే ప్రయత్నం చేసి పరిశోధన/ బోధన రంగంలో స్థిరపడొచ్చు. ఫార్మకో విజిలెన్స్‌లో చాలాకాలం పనిచేశారు కాబట్టి దీనిలోనే పీజీ డిప్లొమా చేయొచ్చు. ఆసక్తి ఉంటే మెడికల్‌ రైటింగ్, క్లినికల్‌ రీసెర్చ్, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్,  క్లినికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫార్మకాలజీల్లో పీజీ డిప్లొమా చేసే అవకాశమూ ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌ కీర్తి

    Ans:

    - దూరవిద్యలో ఎక్కువగా ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు సబ్జెక్ట్‌పై అవగాహన కల్పించడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ, ఉద్యోగాలు పొందడానికి అంతగా ఉపయోగపడవు. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు రెగ్యులర్‌గానే చదివితేనే విషయ పరిజ్ఞానం పెరిగి విద్యా/ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిష  న్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా/డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సులు ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ-న్యూదిల్లీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ-తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీ- తెలంగాణ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-ఆంధ్రప్రదేశ్, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ- గుజరాత్, అన్నామలై యూనివర్సిటీ-తమిళనాడు, సెంటర్‌ ఫర్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌-డిల్లీ, సింబయాసిస్‌ యూనివర్సిటీ- మహారాష్ట్రల్లో అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,