Post your question

 

    Asked By: Ashok

    Ans:

    Click on the following link and go through the stories, you will get the required information.

    https://pratibha.eenadu.net/appsc

    Asked By: Charan

    Ans:

    ఆప్షన్ పెట్టుకోవచ్చు.

    Asked By: Divya

    Ans:

    If you fulfil eligibility rules then you can get job. Click on the following link to get complete information about SBI jobs.

    https://pratibha.eenadu.net/jobs/index/sbi/sbi-clerks/2-1-5-30

    Asked By: Dhana Lakshmi

    Ans:

    ఏదైనా డిగ్రీ అని అర్హత ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికీ మీరు అర్హులే.

    Asked By: గణేష్‌

    Ans:

    బయోటెక్నాలజీలో పీజీ కోర్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రైవేటు కళాశాలల్లో ఉంది. తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కాకినాడ/ అనంతపురం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సు చదివే అవకాశం ఉంది. బయోటెక్‌ పీజీ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. సీడ్, బయోటెక్‌ కంపెనీలు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, పుడ్‌ పరిశ్రమలు, బయో ప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్‌ కంపెనీలు, ఎన్విరాన్‌మెంటల్‌ రిసెర్చ్‌ సంస్థల్లో, బోధన రంగంలో ఉద్యోగావకాశాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: గణేష్‌

    Ans:

    బయోటెక్నాలజీలో పీజీ కోర్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రైవేటు కళాశాలల్లో ఉంది. తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కాకినాడ/ అనంతపురం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సు చదివే అవకాశం ఉంది. బయోటెక్‌ పీజీ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. సీడ్, బయోటెక్‌ కంపెనీలు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, పుడ్‌ పరిశ్రమలు, బయో ప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్‌ కంపెనీలు, ఎన్విరాన్‌మెంటల్‌ రిసెర్చ్‌ సంస్థల్లో, బోధన రంగంలో ఉద్యోగావకాశాలుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మనోజ్‌

    Ans:

    విదేశాల్లో క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌    సైన్స్‌లో పీజీ చేయాలనుకోవడం మంచి ఆలోచన. ఇటీవలికాలంలో చాలా విదేశీ యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. మనదేశం నుంచి విదేశాల్లో పీజీ చేస్తున్నవారిలో దాదాపు 90 శాతం మందికి పైగా స్కాలర్‌షిప్‌లు లేకుండానే అడ్మిషన్‌లు పొందుతున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత రెండో సెమిస్టర్‌ నుంచి ఏదో ఒకరకమైన ఆర్థిక సహాయాన్ని పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి సెమిస్టర్లో కనీసం 3 జీపీఏ సాధిస్తే స్కాలర్‌షిప్‌/ అసిస్టెన్స్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. విదేశీ యూనివర్సిటీల్లో, ప్రత్యేకించి భారతీయ విద్యార్ధులకంటూ స్కాలర్‌ షిప్‌లు అందుబాటులో ఉండవు. ప్రతిభ ఉన్న విదేశీ విద్యార్ధులకు స్కాలర్‌ షిప్‌లు లభిస్తాయి. అలాకాకుండా మనదేశం నుంచి ప్రముఖ విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఛారిటబుల్‌ ట్రస్ట్‌లు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. వాటిలో నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్, జేఎన్‌ టాటా ఎండోమెంట్, ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ ముఖ్యమైనవి.

    విదేశాల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ పీజీ కోర్సుల విషయానికొస్తే- జాన్‌ జేె కాలేజ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌ స్ప్రింగ్‌ ఫీల్డ్, సామ్‌ హోస్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, వెస్ట్‌ వర్జీనియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ హావెన్, యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా డేవిస్, యూనివర్సిటీ పిట్స్‌బర్గ్, సదరన్‌ ఇలినాయిస్‌ యూనివర్సిటీల్లో చదివేవారికి మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను సంబంధిత విశ్వవిద్యాలయాలు అందిస్తాయి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి.మధులిక

    Ans:

    బయోటెక్‌ కంపెనీలో మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారో చెప్పలేదు. ఒకవేళ పరిశోధన రంగంలో పనిచేస్తూ కనీసం రెండు నాణ్యతా పరిశోధన పత్రాలు ప్రచురించివుంటే పీహెచ్‌డీ చేసే విషయం గురించి ఆలోచించవచ్చు. అలా కాకపోతే ముందుగా మంచి విదేశీ విశ్వవిద్యాలయంలో పీజీ చేయడానికి ప్రయత్నించండి. ఇతర దేశాల్లో పరిశోధన చేయాలంటే ముందుగా పరిశోధనాంశాన్నీ, అందుకు తగ్గ యూనివర్సిటీనీ, సరైన గైడ్‌నూ ఎంచుకోవాలి. పీజీ చేస్తూనే ఆ పీజీ అడ్మిషన్‌ని పీహెచ్‌డీ అడ్మిషన్‌గా మార్చుకొనే అవకాశం ఉంది. మీరు ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ రంగంలో పీజీ/ పీహెచ్‌డీ చేయాలనుకొంటున్నారు కాబట్టి- విదేశాల్లో ఆ రంగంలో అత్యుత్తమ పరిశోధన ఉన్న యూనివర్సిటీని ఎంచుకొని, అక్కడి ప్రవేశ విధానం తెలుసుకోండి. అంతకంటే ముందు మనదేశంలో ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ రంగంలో పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్లను సంప్రదించి వారి మార్గదర్శకత్వంలో ఏదైనా పరిశోధన ప్రాజెక్టులో చేరటం మంచిది. పరిశోధనకు సంబంధించిన ప్రాధమిక మెలకువల్లో శిక్షణ పొంది విదేశాల్లో పీజీ/ పీహెచ్‌డీ ప్రవేశానికి ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె.ధనరాజు

    Ans:

    - మీరు బ్యాంకులో ప్రమోషన్‌కి అవసరమైన కోర్సులను ఇప్పటికే పూర్తిచేశారు కాబట్టి, రెగ్యులర్‌గా మీకొచ్చే పదోన్నతులు అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి వస్తాయి. అలా కాకుండా, మీ బ్యాంకులో కానీ, ఇతర బ్యాంకుల్లో కానీ మెరుగైన ఉద్యోగాలకోసం చార్టెడ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్, ఐఐబీఎఫ్‌ సర్టిఫై చేసిన సర్టిఫైడ్‌ క్రెడిట్‌ ప్రొఫెషనల్, ఎస్‌ఎంఈ ఫైనాన్స్, ట్రేడ్‌ ఫైనాన్స్, ఫారెక్స్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. ఐఐబీఎఫ్‌ నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఇన్వెస్ట్‌మెంట్, ట్రెజరీ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల గురించీ ఆలోచించవచ్చు. వీటితోపాటు డిజిటల్‌ బ్యాంకింగ్, రిటైల్‌ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు కూడా చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల్లో ఎంబీఏ/ పీజీ డిప్లొమాలను దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా చేయొచ్చు. భవిష్యత్తులో ఏ రంగంలో  స్థిరపడాలని అనుకుంటున్నారో, ఎందులో ఆసక్తి ఉందో అన్న విషయాలను ఆధారం చేసుకొని సరైన కోర్సును ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌