Post your question

    Asked By: కె.ధనరాజు

    Ans:

    - మీరు బ్యాంకులో ప్రమోషన్‌కి అవసరమైన కోర్సులను ఇప్పటికే పూర్తిచేశారు కాబట్టి, రెగ్యులర్‌గా మీకొచ్చే పదోన్నతులు అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి వస్తాయి. అలా కాకుండా, మీ బ్యాంకులో కానీ, ఇతర బ్యాంకుల్లో కానీ మెరుగైన ఉద్యోగాలకోసం చార్టెడ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్, ఐఐబీఎఫ్‌ సర్టిఫై చేసిన సర్టిఫైడ్‌ క్రెడిట్‌ ప్రొఫెషనల్, ఎస్‌ఎంఈ ఫైనాన్స్, ట్రేడ్‌ ఫైనాన్స్, ఫారెక్స్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. ఐఐబీఎఫ్‌ నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఇన్వెస్ట్‌మెంట్, ట్రెజరీ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల గురించీ ఆలోచించవచ్చు. వీటితోపాటు డిజిటల్‌ బ్యాంకింగ్, రిటైల్‌ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు కూడా చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల్లో ఎంబీఏ/ పీజీ డిప్లొమాలను దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా చేయొచ్చు. భవిష్యత్తులో ఏ రంగంలో  స్థిరపడాలని అనుకుంటున్నారో, ఎందులో ఆసక్తి ఉందో అన్న విషయాలను ఆధారం చేసుకొని సరైన కోర్సును ఎంచుకోండి.        - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రాథోడ్‌ నవీన్‌

    Ans:

    గణితంపై ఆసక్తి ఉంది కాబట్టి గణితాన్ని కొనసాగించే కోర్సులగురించి ఆలోచించండి. పదో తరగతి తరువాత డిప్లొమా చేయడం వల్ల మ్యాథ్స్‌ సబ్జెక్టును అంతగా నేర్చుకొనే అవకాశం ఉండదు. ఇంటర్‌ (ఎంపీసీ) చదివిస్తూ ఎన్‌ఐటీ/ఐఐటీలో ఇంజినీరింగ్‌ కోసం జేఈఈ మెయిన్స్‌/అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాయించండి. అలా కానీ పక్షంలో ఎంసెట్‌లో మంచి ర్యాంకు ద్వారా ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీటు కోసం ప్రయత్నించండి. ఒకవేళ తనకు ఇంజినీరింగ్‌ మీద ఆసక్తి లేకపోతే ఇంటర్‌ ఎంపీసీ తర్వాత బీఎస్సీలో మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ / జియాలజీ/ డేటా సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంచుకొని డిగ్రీ చేయొచ్చు. ఆపై మ్యాథ్స్‌లో పీజీ చేయటం మంచిది. బీఎస్సీపై ఆసక్తి లేకపోతే బీఏలో మ్యాథ్స్‌తో పాట ఎకనామిక్స్‌ /స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టులతోనూ డిగ్రీ చేయొచ్చు. అప్పుడు కూడా మ్యాథ్స్‌లో పీజీ చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే ఆ తరువాత మ్యాథ్స్‌లో పీహెచ్‌డీ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా సీఏ లాంటి కోర్సుల్లో ఆసక్తి ఉంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌ చదివి.. బీకాం చేస్తూ సీఏ కూడా చేసే వీలుంటుంది. ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన జాతీయ విద్యావిధానం-2020 ద్వారా మ్యాథ్స్‌లో నాలుగు సంవత్సరాల ఆనర్స్‌ డిగ్రీని చేయొచ్చు. ఇంటర్‌ తరువాత చాలామంది ఇంజినీరింగ్‌ కోర్సులకు వెళ్ళడం వల్ల మ్యాథ్స్‌ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉన్నవారి సంఖ్య తక్కువగా ఉంది. మీ సోదరికి మ్యాథ్స్‌ ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఉంటే బీఎస్సీ/ బీటెక్‌ తరువాత బీఈడీ చేసి, ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్‌.నరసయ్య

    Ans:

    - యూఎస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్‌ చేయడానికి చాలా యూనివర్సిటీల్లో అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనవి.. స్టాన్‌ఫోర్డ్, కొలంబియా, నార్త్‌ ఈస్టర్న్, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనా, యూనివర్సిటీ ఆఫ్‌ మియామి, యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటి, లారెన్స్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీ, కార్నెగి మెలన్‌ యూనివర్సిటీ, కార్నెల్‌ యూనివర్సిటీ, డ్యూక్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిడ్జ్‌ పోర్ట్, స్టీవెన్స్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. ఈ  విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్‌లకు వెళ్లి కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. కోర్సు ఫీజు, ఉద్యోగావకాశాలు లాంటి విషయాలను ఆధారంగా చేసుకొని సరైన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోండి. దానికి ముందు అక్కడ చదివిన, చదువుతున్నవారితో మాట్లాడి పూర్తి అవగాహన ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోండి.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి.నాగలక్ష్మి

    Ans:

    విదేశాల్లో పరిశోధన చేయాలంటే.. అక్కడి యూనివర్సిటీల్లో పీజీ చేసి ఉండటం శ్రేయస్కరం. ముందుగా పరిశోధనా అంశాన్ని, అందుకు తగిన యూనివర్సిటీని, సరైన గైడ్‌ని ఎంచుకోవాలి. విదేశాల్లో అడ్మిషన్‌ విధానం, పరిశోధన పద్ధతులు మనకంటే భిన్నంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పర్చుకోవాలి. కనీసం రెండు పరిశోధనా పత్రాలు మంచి జర్నల్స్‌లో ప్రచురించి ఉంటే, మీ అబ్బాయి పీహెచ్‌డీ అడ్మిషన్‌ సులువు అవుతుంది. చాలామంది విదేశాల్లో పీజీలో చేరి, రెండో సంవత్సరంలో ఆ పీజీ అడ్మిషన్‌ని పీహెచ్‌డీ అడ్మిషన్‌గా మార్చుకుంటారు. పరిశోధనలో ముఖ్యమైన విషయం - మనం పరిశోధన చేయాలనుకుంటున్నవారి నమ్మకం పొందటం. ఆ నమ్మకం వ్యక్తిగత పరిచయం, ప్రచురించిన పరిశోధనపత్రాల నాణ్యత, పీజీ చదివిన విశ్వవిద్యాలయ అంతర్జాతీయ ర్యాంకింగ్, ఇక్కడి ప్రొఫెసర్లు ఇచ్చే రికమెండేషన్‌ లెటర్స్‌ వల్ల వస్తుంది. అవకాశం ఉంటే మీ అబ్బాయిని మనదేశంలోనే ఏదైనా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో మంచి పరిశోధన నేపథ్యం ఉన్న ప్రొఫెసర్‌ దగ్గర ప్రాజెక్ట్‌లో చేరి, పరిశోధన మెలకువలను నేర్చుకోమని చెప్పండి. నాణ్యమైన పరిశోధనపత్రాలను ప్రచురించి, విదేశాల్లో మంచి యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశం పొందేలా ప్రోత్సహించండి. అలా కుదరని పక్షంలో ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో పీజీ చేయమని చెప్పండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌.ప్రసాద్‌

    Ans:

    ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాల్లో, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులుగా ఉద్యోగం చేయవచ్చు. నెట్‌/ సెట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొలువుల కోసం ప్రయత్నించవచ్చు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ… చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి అర్హత ఉంటుంది. మనదేశంలో పీహెచ్‌డీ, విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసి బోధన/ పరిశోధన/ పారిశ్రామిక రంగాల్లో అక్కడే స్థిరపడవచ్చు. ఆసక్తి, అవకాశం ఉంటే విదేశాల్లో పీహెచ్‌డీ చేసి మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాల్లో, మనదేశంలో ప్రయత్నించవచ్చు. ఎమ్మెస్సీతో విదేశాల్లో పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండవు. ఏవైనా సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేసి ఆ రంగంలో విదేశాల్లో/ మనదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో ఫార్మా, బయోటెక్‌ రంగంలో, కేంద్ర పరిశోధన సంస్థల్లో, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఎమ్మెస్సీ తరువాత బీఈడీ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కూడా పోటీపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌