Post your question

 

    Asked By: వి.పవన్

    Ans:

    - బీఎస్సీ ఎనస్తీషియా చదివాక ఎంఎస్సీ ఎనస్తీషియా కానీ, ఎనస్తీషియాలో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు కానీ చేసే అవకాశం ఉంది. మీరు ఉన్నతవిద్యను విదేశాల్లో చేయాలనుకొంటే కనీసం రెండు సంవత్సరాల ఉద్యోగానుభవం పొందాకే, ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఎనస్తీషియా లాంటి ప్రొఫెషనల్‌ రంగాల్లో నైపుణ్యాలు చాలా అవసరం. వీటిని కోర్సు చదివే సమయంలో కంటే ఉద్యోగంలోనే ఎక్కువగా నేర్చుకొనే అవకాశం ఉంది. ఎనస్తీషియాలో పీజీ కోర్సులు యూకే, అమెరికా, కెనడా లాంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా కార్డిఫ్‌ యూనివర్సిటీ, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్, యూనివర్సిటీ ఆఫ్‌ గాల్వే, ది కాలేజ్‌ ఆఫ్‌ అనస్తీయాలజిస్ట్స్‌ ఆఫ్‌ ఐర్లాండ్, బ్రైటన్‌ అండ్‌ ససెక్స్‌ మెడికల్‌ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌ హామ్,  యూనివర్సిటీ ఆఫ్‌ ఆల్బెట్రా, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ లా క్రోసెల్లో ఎనస్తీషియా కోర్సులున్నాయి. ఈ కోర్సు చేసినవారికి దేశ విదేశాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    డేటా సైన్స్‌ కోర్సును యూనివర్సిటీల్లో, కళాశాలల్లో రెగ్యులర్‌ డిగ్రీ/డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సుగా అందించడం ఈమధ్య కాలంలోనే మొదలైంది. చాలా విద్యాసంస్థల్లో ఈ కోర్సును బోధించడానికి అవసరమైన అధ్యాపకుల కొరత ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం చాలామంది ఈ కోర్సును ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నేర్చుకొంటున్నారు. ప్రముఖ విద్యాసంస్థలనుంచి ఆన్‌   లైన్‌లో పొందే సర్టిఫికెట్‌లకు విలువ ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్‌గా చదివినా, ఆన్‌లైన్‌లో చదివినా విషయపరిజ్ఞానం, సరైన నైపుణ్యాలు లేనట్లయితే ఆ సర్టిఫికెట్‌కు విలువ ఉండదు. మీకు అవకాశం ఉంటే అత్యుత్తమ విదేశీ యూనివర్సిటీలు, ఐఎస్‌బీ, ఐఐఎంలు, ఐఐటీల్లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో డేటా సైన్స్‌/ఎనలిటిక్స్‌ కోర్సును ఆఫ్‌లైన్‌/ ఆన్‌లై న్‌లో చేసే ప్రయత్నం చేయండి. డేటా సైన్స్‌/ ఎనలిటిక్స్‌ రంగాల్లో మెరుగైన ఉద్యోగం పొందాలంటే సర్టిఫికెట్‌తోపాటు అనుభవం కూడా ప్రధానం. మీరు కోర్సు నేర్చుకొంటూనే డేటా సైన్స్‌/ ఎనలిటిక్స్‌లో రకరకాల ప్రాజెక్టులు చేస్తూ అనుభవం, మెలకువలూ, నైపుణ్యాలను పొందండి: నచ్చిన సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఎపిగ్రఫీ అంటే కఠినమైన లేదా మన్నికైన పదార్థంపై నమోదైన రాతల అధ్యయనం. దీన్నో ప్రత్యేకమైన కోర్సుగా కాకుండా హిస్టరీ/ ఆర్కియాలజీల్లో స్పెషలైజేషన్‌గా చదవొచ్చు. ఈ కోర్సు చదివిన తరువాత మీరు ఏ రంగంలో, ఏ విధంగా స్థిరపడాలనుకొంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. సాధారణంగా యూకేలో పీజీ కోర్సుల కాలవ్యవధి ఏడాది. ప్రత్యేకంగా ఎపిగ్రఫీలో పీజీ కోర్సులు అందుబాటులో లేవు. యూకేలో చాలా ప్రముఖ యూనివర్సిటీల్లో హిస్టరీ/ ఆర్కియాలజీలో పీజీ కోర్సులు ఉన్నాయి. వార్విక్‌ యూనివర్సిటీలో ఏన్షియంట్‌ విజువల్‌ అండ్‌ మెటీరియల్‌ కల్చర్‌లో పీజీ, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లో ఏన్షియంట్‌ హిస్టరీ పీజీ కోర్సుల్లో ఎపిగ్రఫీ సంబంధ విషయాలను బోధిస్తారు. ఇవేకాకుండా యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్, కింగ్స్‌ కాలేజ్‌ లండన్, యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో లాంటి విద్యాసంస్థల్లో కూడా హిస్టరీ/ ఆర్కియాలజీ పీజీ కోర్సుల్లో ఎపిగ్రఫీకి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. మీకు ఆసక్తి ఉంటే హిస్టరీ/ఆర్కియాలజీలో పీజీ చేశాక, ఎపిగ్రఫీలో పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాగర్‌

    Ans:

    - విదేశాల్లో విద్యను అభ్యసించడం శ్రేయస్కరమే కానీ, ఆ విదేశీ డిగ్రీలతో మంచి వేతనంతో మనదేశంలో ఉద్యోగం పొందటం అనేది ఒక సవాలే! యూఎస్‌ లాంటి పాశ్చాత్య దేశాల్లో బిజినెస్‌ ఎకనామిక్స్‌ కోర్సు చదివినవారికి ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ చదివినవారితో సమాన ఉద్యోగావకాశాలూ, వేతనాలూ, హోదా ఉంటాయి. మనదేశంలో కూడా ఇటీవలికాలంలో బిజినెస్‌ ఎకనామిక్స్‌కు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. కానీ ఈ ఉద్యోగావకాశాలన్నీ ప్రైవేటు వ్యాపార సంస్థల్లో, మల్టీనేషనల్‌ కంపెనీల్లో, అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉంటున్నాయి. మీరు బిజినెస్‌ ఎకనామిక్స్‌ డిగ్రీతో పాటు బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్‌ లాంటి కోర్సులను కూడా చేసినట్లయితే మనదేశంలో మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. మీరు కాలిఫోర్నియా యూనివర్సిటీలోనే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మల్టీనేషనల్‌ కంపెనీల్లో/ అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగం పొంది, బదిలీపై మనదేశానికి వచ్చినట్లయితే మంచి వేతనం లభిస్తుంది. చదువు పూర్తయ్యాక రెండు/ మూడేళ్లు యూఎస్‌లోనే ఉద్యోగం చేసి, ఆ ఉద్యోగానుభవంతో మనదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. బిజినెస్‌ ఎకనామిక్స్‌ డిగ్రీతో మనదేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నీతి ఆయోగ్‌ లాంటి ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే యూఎస్‌లోనే పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే మనదేశంలో ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో, ప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీల్లో అధ్యాపక ఉద్యోగాలు పొందే అవకాశముంది.

    Asked By: cnu

    Ans:

    The examination is scheduled to take place in the month of December 2022, according to the expectations.  

    Asked By: ఎస్.కె.నాగుర్బాషా

    Ans:

    - సాధారణంగా పదో తరగతి తరువాత చదివే మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులను ఇంటర్‌తో సమానంగానే పరిగణిస్తారు. ఈ మేరకు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలను కూడా జారీ చేశాయి. డిప్లొమా పూర్తయిన తరువాత మీరు నిరభ్యంతరంగా డిగ్రీ లో చేరవచ్చు. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడవచ్చు. కొన్ని ప్రత్యేక విద్యా/ ఉద్యోగ నోటిఫికేషన్లలో మాత్రమే ఇంటర్‌ కచ్చితంగా చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నారు. మరికొన్ని ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్లలో ఇంటర్‌ రెగ్యులర్‌గా చదివివుండాలన్న నిబంధన కూడా ఉంటుంది. అలాంటి అతికొద్ది ఉద్యోగాలకు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివే ఇంటర్మీడియట్‌ను రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌కు సమానంగా పరిగణిస్తారు. ఇటీవల యూజీసీ జారీ చేసిన నిబంధనల్లో ఏకకాలంలో రెండు డిగ్రీలు చేయవచ్చని మాత్రమే ప్రస్తావించారు. ఇంటర్, డిప్లొమాలు ఒకేసారి చదవడం గురించి ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డిప్లొమా చదువుతూనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌లో ఇంటర్‌ చదివితే, రెండు సర్టిఫికెట్‌లను ఒకేసారి ఉపయోగించుకోలేరు. మూడు సంవత్సరాల తరువాత ఇంటర్‌ విద్యార్హతతో రాయబోయే పోటీ పరీక్షలకంటే ముందు, ప్రస్తుతం చదువుతున్న డిప్లొమా కోర్సుపై శ్రధ్ధ పెట్టండి. విషయపరిజ్ఞానం పెంపొందించుకొని, మెరుగైన ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.

    Asked By: VENKATA KRISHNA

    Ans:

    * Visit the official website.

    * Go to the result section which appears on the homepage.

    *  After clicking, a new page will open where students will have to enter their hall ticket number

    * After submitting the hall ticket details, then click on get memo.

    * Within a few seconds, the memo will appear on the screen. Candidates can check the details properly and download the TS Inter marks memo.

    Asked By: VENKATA KRISHNA

    Ans:

    * Visit the official website.

    * Go to the result section which appears on the homepage.

    *  After clicking, a new page will open where students will have to enter their hall ticket number

    * After submitting the hall ticket details, then click on get memo.

    * Within a few seconds, the memo will appear on the screen. Candidates can check the details properly and download the TS Inter marks memo.