Post your question

 

    Asked By: R

    Ans:

    Detailed Notification with breakup of vacancies, age, scale of pay, Community, Educational qualifications and other detailed instructions will be available at Commission’s Website (https://www.tspsc.gov.in) from 23/12/2022. The examination (objective type) is likely to be held in the month of April/May-2023.

    Asked By: Rakesh

    Ans:

    ఎకానమీ విష‌యంలో సరైన ప్రణాళిక ఉంటే ఈ సబ్జెక్టు చదవడం అంత కష్టమేమీ కాదు. ఏది, ఎంతవరకు, ఎలా చదవాలనే విషయం తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సులువుగా సాగిపోతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లు, జాతీయాదాయం, జీడీపీ లెక్కింపు, తలసరి ఆదాయం, తలసరి వినియోగం, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలు, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి త‌దిత‌ర విష‌యాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పాఠ్యపుస్తకాలు చదవడం తప్పనిసరి. మొత్తం అన్ని టాపిక్స్‌ పూర్తిగా నేర్చుకున్నాక వీలైనన్ని మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు సాధన చేయాలి.

    పూర్తి వివ‌రాల కోసం కింది లింక్ చూడండి.. https://pratibha.eenadu.net/appsc/article/specialstories/indian-economy-preparation/2-1015-251-0-22040000840.

    Asked By: R

    Ans:

    గ్రూప్‌-4 కి సంబంధించి ప్ర‌స్తుతం వెబ్‌నోట్ మాత్ర‌మే విడుద‌లైంది. ఖాళీల విభజన, వయస్సు, వేతన స్కేల్, సంఘం, విద్యా అర్హతలతో కూడిన వివ‌ర‌ణాత్మ‌క నోటిఫికేష‌న్ డిసెంబ‌రు 23 నుంచి టీఎస్‌పీఎస్సీ కమిషన్ వెబ్‌సైట్‌లో (https://www.tspsc.gov.in) అందుబాటులో ఉంటుంది.

    Asked By: Sajarath

    Ans:

    The first and foremost important thing is you must understand the exam pattern and syllabus. Then make a study plan. According to that finish the syllabus and revise regularly. Solve previous year's papers. Always stay focused and motivated. If you have doubts regarding any subject take help from experts or online resources or it's better to take coaching for that particular subject. Be confident about yourself and attend the exam well.

    Asked By: LakkiReddy

    Ans:

    త్వరలో 2022 క‌రెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అన్ని నెల‌ల‌ పుస్త‌కాల‌ను PDF ఫార్మాట్‌లో అందించడానికి ప్రయత్నిస్తాం.

    Asked By: lakkireddy

    Ans:

    Sure, very soon will try to provide current affairs of all months of 2022 in PDF format.

    Asked By: Harshika

    Ans:

    Group -4 Detailed Notification with breakup of vacancies, age, scale of pay, Community, Educational qualifications and other detailed instructions will be available at Commission’s Website (https://www.tspsc.gov.in) from 23/12/2022.

    Asked By: రిషిత

    Ans:

    మీకు ఏ లిటరేచర్‌ అంటే ఇష్టమో చెప్పలేదు. మీకు తెలుగు/ హిందీ లిటరేచర్‌లో ఆసక్తి ఉంటే బీఏ డిగ్రీలో తెలుగు/ హిందీ లిటరేచర్‌ని కానీ, బీఏలో తెలుగు/ హిందీని ఒక మెయిన్‌ ఆప్షనల్‌గా కానీ ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంగ్ల్లిష్‌ లిటరేచర్‌పై ఆసక్తి ఉంటే బీఏ ఇంగ్లిష్‌ ఆనర్స్‌ కోర్సు కానీ, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సును కానీ ఎంచుకోండి. బీఏ లిబరల్‌ ఆర్ట్స్‌ కోర్సులో కూడా ఇంగ్లిష్‌ ఒక మెయిన్‌ కోర్సుగా అందుబాటులో ఉంది. అదేవిధంగా బీఏలో ఇంగ్లిష్‌తో పాటు జర్నలిజం/ సైకాలజీ/ ఎకనామిక్స్‌ లాంటి కోర్సులను కూడా చదివే అవకాశం ఉంది. మీ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక అభిరుచి, ఆశయాలను దృష్టిలో పెట్టుకొని మీకు తగిన కోర్సును ఎంచుకోండి.   - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి.మహేష్‌

    Ans:

    దేశవ్యాప్తంగా ఫొటోగ్రఫీలో డిగ్రీ, పీజీ కోర్సులు అతితక్కువ కాలేజీల్లో ఉన్నాయి. ఫొటోగ్రఫీని బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) డిగ్రీగా చదివే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఫొటోగ్రఫీ కోర్సు జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ) హైదరాబాద్, శ్రీ వేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ నాలుగేళ్ల బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌), రెండు సంవత్సరాల మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌) కోర్సులను అందిస్తోంది. జేెఎన్‌ఏఎఫ్‌ఏయూ బీఎఫ్‌ఏ కోర్సులో ఫొటోగ్రఫీ యాజ్‌ ఫైన్‌ ఆర్ట్స్, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రఫీ, ఫోటో జర్నలిజం, ఆడియో విజువల్‌ కమ్యూనికేషన్, డిజిటల్‌ ఫొటోగ్రఫీ, కంప్యూటర్‌ గ్రాఫిక్స్, మల్టీమీడియా, ప్రొఫెషనల్‌ వీడియోగ్రఫీ లాంటి సబ్జెక్టులుంటాయి.
    శ్రీ వేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో మూడేళ్ల వ్యవధితో బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ అండ్‌ డిజిటల్‌ ఆర్ట్‌) కోర్సు ఉంది. ఫొటోగ్రఫీ చదివినవారికి ఈకామర్స్‌ సంస్థలు, న్యూస్‌ ఏజెన్సీలు, స్టూడియోలు, మ్యాగజైన్‌లు, అడ్వర్టైజింగ్, పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. ఇంకా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్, ఆర్కిటెక్చర్‌ సంస్థలు, టూరిజం, క్రీడా శిక్షణ సంస్థలు, ఫుడ్‌ ఇండస్ట్రీలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఫొటోగ్రఫీ పీజీలో రకరకాల స్పెషలైజేషన్లు కూడా ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న స్పెషలైజేషన్‌ ఎంచుకొని, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవచ్చు.

    Asked By: కరుణాకర్‌

    Ans:

    గత కొన్ని సంవత్సరాలుగా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ చేసినవారికి ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మనదేశంలో ఫిట్‌నెస్‌ పరిశ్రమ, క్రీడా రంగాల్లో నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. విదేశాల్లో స్పోర్ట్స్‌కు సంబంధించిన చాలా ప్రత్యేకమైన కోర్సులున్నాయి. ఆస్ట్రేలియాలో ఫార్మల్‌ స్పోర్ట్స్‌ ట్రైనర్‌ కోర్సుల్ని డీకేన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ, గ్రిఫిత్‌ యూనివర్సిటీ, లా ట్రోబే యూనివర్సిటీ, వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ లాండ్‌ లాంటి ప్రముఖ విద్యా సంస్థలు అందిస్తున్నాయి. కెరియర్‌ విషయానికొస్తే స్పోర్ట్స్‌ కోర్సుల్లో శిక్షణ పొందినవారికి ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్, పర్సనల్‌ ట్రైనర్, స్పోర్ట్స్‌ కోచ్, అవుట్‌డోర్‌ రిక్రియేషన్‌ గైడ్, స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, రిక్రియేషన్‌ ఆఫీసర్, లీజర్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌ లాంటి హోదాలతో కొలువులు లభిస్తాయి. ఈ రంగంలో కొంత అనుభవం గడించాక అంతర్జాతీయ ప్రమాణాలతో సొంతంగా ఫిట్‌నెస్‌ సంస్థనూ ప్రారంభించవచ్చు.