Post your question

 

  Asked By: బి.పార్థసారథి

  Ans:

  - అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ కన్జర్వేటివ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం అడవులను పరిరక్షించడానికి అవసరమైన ఒక పరిపాలనా ఉద్యోగం. దీనికి అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అర్హులే. ఈ ఉద్యోగంలో అమ్మాయిలు మాత్రమే ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్లేమీ లేవు. ఫీల్డ్‌ వర్క్‌తోపాటు పరిపాలనా సంబంధిత బాధ్యతలనూ నిర్వహించవలసి ఉంటుంది. అటవీ పరిరక్షణ, ఆధునిక టెక్నాలజీని వాడటం, అపాయాలను ముందే పసిగట్టడం, ఉద్యోగుల పర్యవేక్షణ, అటవీ ప్రమాదాలను అంచనా వేయడం లాంటి బాధ్యతలు ఉంటాయి. ఈ ఉద్యోగానికి ఏం అవసరమంటే.. శారీరక దృఢత్వం, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం, శ్రద్ధగా వినగలగటం, విశ్లేషణాత్మక శక్తి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోగల సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యాలు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో అమ్మాయిలు చేయలేని, చేయకూడని ఉద్యోగాలంటూ ఏమీ లేవు. అడవులను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలన్న ఆసక్తి ఉంటే, అమ్మాయిలు కూడా నిరభ్యంతరంగా ఈ ఉద్యోగానికి సన్నద్ధం కావొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: కె. వంశీరెడ్డి

  Ans:

  సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నియామక ప్రకటనల్లో యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి విద్యార్హతలు ఉండాలని అడుగుతారు. మీరు ఏపీకి సంబంధించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తెలంగాణలో ఉన్న కోదాడ స్టడీ సెంటర్‌లో డిగ్రీ చేశానని చెప్పారు. ఏ యూనివర్సిటీ అయినా యూజీసీ నియమనిబంధనల ప్రకారం స్టడీ సెంటర్‌ల ద్వారా డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించడానికి కావాల్సిన అనుమతులు పొందివుంటే, ఆ డిగ్రీలు ఏ ఉద్యోగానికి అయినా చెల్లుబాటు అవుతాయి. మీరు తెలంగాణా రాష్ట్రానికి లోకల్‌ అయితే, తెలంగాణలో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రానికి నాన్‌ లోకల్‌ అయితే 5 శాతం ఓపెన్‌ కోటా కోసం పోటీపడాలి.  ఓపెన్‌ కోటాకు లోకల్, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు అందరూ అర్హులే! టీఎస్‌పీ‡ఎస్సీ ఉద్యోగాలతో పాటు, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ లోకల్‌/ ఓపెన్‌ కోటాలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: swetha

  Ans:

  మీరు గ‌వ‌ర్నెన్స్ సబ్జెక్టుకు సంబంధించి తెలుగు అకాడ‌మీ పుస్త‌కాల‌ను చ‌ద‌వండి.

  Asked By: Guguloth

  Ans:

  మీకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 55 నుంచి 60 మార్కులు వ‌స్తున్నాయ‌న్నారు కాబ‌ట్టి మీకు మెయిన్స్‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్‌.

  Asked By: sales.

  Ans:

  ప‌రీక్ష తేదీకి ముందు సంవ‌త్స‌రకాలానికి సంబంధించిన క‌రెంట్ అఫైర్స్ అంశాల‌ను త‌ప్ప‌నిస‌రిగా చద‌వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప‌రీక్ష తేదీకి ముందు నాలుగు నెల‌ల క‌రెంట్ అఫైర్స్‌ను బాగా చ‌ద‌వాలి.

  Asked By: సీహెచ్‌. సిరి

  Ans:

  మీరు పీజీలో డిజిటల్‌ మార్కెటింగ్, ఈ కామర్స్‌ స్పెషలైజేషన్‌ సంబంధిత కోర్సులు చదవడం శ్రేయస్కరం. బీబీఏ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఈ రంగాల్లో ఏదైనా ఉద్యోగం చేసి CAT, XAT, NMAT, SNAP, MAT, CMAT, IIFT టెస్ట్‌ లాంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఎంబీఏ కళాశాలల్లో డిజిటల్‌ మార్కెటింగ్, ఈ కామర్స్‌ లాంటి స్పెషలైజేషన్‌లు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ మార్కెటింగ్, ఆపరేషన్స్‌ లాంటి స్పెషలైజేషన్లలో ఇవి కోర్సులుగా ఉంటాయి. ఒకవేళ కోర్సులుగా అందుబాటులో   లేనప్పటికీ మీరు సమ్మర్‌ ప్రాజెక్ట్, ఫైనల్‌ ప్రాజెక్ట్‌లను ఈ రంగాల్లో చేస్తే గత అనుభవం ఆధారంగా మెరుగైన ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: డి.సతీష్

  Ans:

  ఎంబీఎ మార్కెటింగ్‌ చేశాక మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, కంటెంట్‌ మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్, కస్టమర్‌ సెంట్రిక్‌ మార్కెటింగ్, డేటా మైనింగ్, మార్కెటింగ్‌ అనలిటిక్స్, వెబ్‌ అనలిటిక్స్, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ రీసెర్చ్‌ లాంటి కోర్సుల్లో మీకు ఆసక్తి ఉన్నవి చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా ఎంబీఏ మంచి కళాశాలలో చేస్తే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లోనే ఉద్యోగం వస్తుంది. అలా రానిపక్షంలో, పైన చెప్పిన కోర్సుల్లో కనీసం రెండు చేసే ప్రయత్నం చేయండి. వీటిని ఐఐఎం, మైకా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తే మెరుగైన  ఉద్యోగాలు లభిస్తాయి. అవకాశం ఉంటే, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నించండి. మీ పనితీరు నచ్చితే, అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌