Post your question

    Asked By: Sai

    Ans:

    Current years budget and surveys material is enough. No need to go for previous year budget and surveys.

    Asked By: hc

    Ans:

    You can get your 2nd class bonafide from the school or you can take residensial certificate from MRO office for that particular period of time.

    Asked By: Jadhav

    Ans:

    Exam is completed.

    Asked By: రాజేష్‌ సెహ్వాగ్‌

    Ans:

    ఏ రాష్ట్రంలో డిగ్రీ చదువుకున్నా హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సు నిరభ్యంతరంగా చేయవచ్చు. కాకపోతే మీరు డిగ్రీ పొందిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉండాలి. మీరు డిగ్రీలో ఏం చదివారో, ఇప్పుడు ఏ కోర్సు, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో చెప్పలేదు. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీలు పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఒక్కో యూనివర్సిటీ, ఒక్కో సమయంలో ప్రకటనలు విడుదలచేస్తుంది. మీరు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి, అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వివరాలు చూసి, నచ్చిన కోర్సుకు మీ విద్యార్హతలు సరిపోతాయో లేదో పరిశీలించి పీజీ డిప్లొమా కోర్సు చేయండి.- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఇ. తరుణి

    Ans:

    ఇంటర్‌ (ఎంపీసీ) పాసై సీఏలో చేరాను అన్నారు. ఆ ఆలోచన మార్చుకొని మళ్ళీ ఇంజినీరింగ్‌ వైపునకు ఎందుకు వెళ్లాలనుకొంటున్నారో కనీసం మూడు కారణాలు రాసుకోండి. ఆ కారణాలను మీ కుటుంబ సభ్యులతో, మీ శ్రేయోభిలాషులతో పంచుకొని, అవి సహేతుకమైనవో కావో నిర్ధారించుకోండి. ఆపైనే నిర్ణయం తీసుకోండి. సీఏ కోర్సు, ఇంజినీరింగ్‌ కంటే తక్కువేమీ కాదు. ప్రతి సంవత్సరం ఇంజినీర్లు లక్షల్లో మార్కెట్‌లోకి వస్తూ ఉంటే, సీ‡ఏలు మాత్రం కొన్ని వేలమంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. ఇంజినీరింగ్‌ చదివినవారిలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. కానీ, సీఏ కోర్సు చేసినవారికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒకవేళ సీఏ చదవడం కష్టమనిపిస్తే, మీ సీనియర్‌ల సలహాలు తీసుకొని ముందుకెళ్లండి. ముందుగా మీ జీవితం, భవిష్యత్తుపై మీకో స్పష్టత అవసరం. మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది, జీవితంలో ఎలా స్థిరపడాలనుకొంటున్నారు అనేవి దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎస్‌. రవిశంకర్‌

    Ans:

    ఉద్యోగ ప్రపంచంలో వేగంగా వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ఉద్యోగులకు ఎంతో అవసరం. సిక్స్‌ సిగ్మా బ్లాక్‌ బెల్ట్‌ ఒక సంస్థ ఆదాయం పెంచడంలో, ఖర్చు తగ్గించడంలో, నాణ్యతను పెంపొందించడంలో, తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత పెంచడంలో, వినియోగదారులను సంతృప్తిపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని చేసినవారికి నాయకత్వం, క్వాలిటీ మేనేజ్‌మెంట్, సమస్యా పరిష్కారాల్లో మంచి నైపుణ్యాలు ఉంటాయి. ఈ కోర్సు చేసినవారు ఆపరేషన్స్‌ డైరెక్టర్, సీనియర్‌ బిజినెస్‌ ప్రాసెస్‌ అనలిస్ట్, సీనియర్‌ కంటిన్యువస్‌ ఇంప్రూవ్‌మెంట్‌ లీడర్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్, కన్సల్టెంట్, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హులు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్‌ కేర్, మాన్యుఫాక్చరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: స్వరూప్

    Ans:

    - పైలట్‌ అవ్వడానికి ఇంటర్మీడియట్‌ స్థాయిలో మేథమెటిక్స్, ఫిజిక్స్‌లు కచ్చితంగా చదివివుండాలి. కమర్షియల్‌ పైలట్‌ అవ్వాలంటే మెడికల్‌ సర్టిఫికెట్, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్, ఇంగ్లిష్‌ ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్, రేడియో టెలిఫోనీ రెస్ట్రిక్టెడ్‌ సర్టిఫికెట్, ఫ్లైట్‌ రేడియో టెలిఫోనీ ఆపరేటర్స్‌ లైసెన్స్‌ కూడా ఉండాలి. డీజీసీఏ ఫ్లైట్‌ క్రూ లైసెన్స్‌ పరీక్ష కోసం ఎయిర్‌ రెగ్యులేషన్స్, ఎయిర్‌ నావిగేషన్, ఏవియేషన్‌ మెటిరాలజీ, టెక్నికల్‌ జనరల్, టెక్నికల్‌ స్పెసిఫిక్, రేడియో టెలిఫోనీ లాంటి ఆరు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరువాత డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లైట్‌ స్కూల్‌లో కమర్షియల్‌ పైలట్‌ శిక్షణలో చేరి కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందాలి.

    కమర్షియల్‌ పైలట్‌కు ప్రత్యేకమైన పీజీ కోర్సులు అవసరం లేదు. మీకు ఆసక్తి ఉంటే ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్, ఏవియేషన్, ఏరోనాటికల్‌ సైన్స్‌ల్లో ఎంఎస్సీ/ ఎంటెక్‌ కోర్సులు చేయవచ్చు. పైలట్‌ అవ్వాలంటే బలమైన సాంకేతిక నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, సరైన నిర్ణయం తీసుకోగలగడం, పరిస్థితుల, పర్యావరణ అవగాహన, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సునిశిత దృష్టి, క్రమశిక్షణ, మానసిక స్థిరత్వం, శారీరక దృఢత్వం, బృందంలో సమష్టిగా పనిచేయగల సామర్ధ్యం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం.    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: స్వరూప్

    Ans:

    You can take the study certificates from DEO or MEO office. Or else you can take residensial certificate from your MRO office.