Post your question

 

    Asked By: L.NANAVATHEE

    Ans:

    మీరు తెలుగు అకాడ‌మీ ముద్రించిన ప్రామాణిక పుస్త‌కాల‌ను చ‌ద‌వండి. రోజూ వార్తా పత్రిక‌లు చ‌దివి క‌రెంట్ అఫైర్స్‌నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.

    Asked By: Ahmad

    Ans:

    మీరు ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గతి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌దివి ఉంటే టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌లు రాసుకోవ‌డానికి స్థానిక‌త వ‌ర్తిస్తుంది. లేదా నాన్‌లోక్ కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    Asked By: Chandu

    Ans:

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20న పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం ప్రస్తుతం కానిస్టేబుల్‌ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయోపరిమితి సాధారణ కేటగిరీలో 27 సంవత్సరాలు. ఏదైనా రిజర్వేషన్‌ఉంటే మరొక అయిదేళ్లు సడలింపు ఉంటుంది. ఎస్సై ఉద్యోగాల ఎంపికకు గరిష్ఠ వయోపరిమితి సాధారణ కేటగిరీలో 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌రిజర్వుడ్‌అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు.

    Asked By: Abhi

    Ans:

    a floor of a ship, especially the upper, open level extending for the full length of the vessel.

    Asked By: Sontekka

    Ans:

    మీరు పాసైన సంవ‌త్స‌రాన్ని నింపండి. మ‌ధ్య‌లో చ‌ద‌వ‌ని సంవ‌త్స‌రాన్ని వ‌దిలివేయండి.  లేదా స్ట‌డీ స‌ర్టిఫికెట్‌లో సంవ‌త్స‌రాలు తప్పుగా ఉంటే మీ పాఠ‌శాల నుంచి మ‌రొక‌సారి స‌రిచేసిన సంవ‌త్సరాల‌తో స్ట‌డీ స‌ర్టిఫికెట్లు తీసుకోండి.

    Asked By: A.MUTHYALAPPA

    Ans:

    గ్రూప్ 1 మెంట‌ల్ ఎబిలిటీ విభాగంలో సాధ‌న చాలా ముఖ్యం. అర్థ‌మైన అంశాల‌ను విడిచిపెట్ట‌కుండా ప్ర‌తిరోజూ ప్రాక్టీసు చేయండి. అలాగే వీలైన్ని పాత‌ప్ర‌శ్న‌ప‌త్రాలు, మొడ‌ల్ పేప‌ర్ల‌ను సాధ‌న చేయండి.

    Asked By: prasanth

    Ans:

    కొత్త భాష నేర్చుకోవాలంటే పదజాలాన్ని పెంచుకోవడం చాలా అవసరం.  సరైన వ్యాకరణ నియమాలు ఎంత అవసరమో, పద సంపద కూడా అంతే ముఖ్యం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది విద్యార్థులు ఈ  విషయంలో వెనకబడుతున్నారు. ఈ  సమస్యను అధిగమించడానికి ఇటీవలికాలంలో చాలా పుస్తకాలు, యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మెక్‌ గ్రాహిల్‌ ఎసెన్షియల్‌ ఈఎస్‌ఎల్‌ డిక్షనరీ, ఇంగ్లిష్‌ ఒకాబ్యులరీ ఇన్‌ యూజ్‌ సిరీస్, ఆక్స్‌ఫర్డ్‌ పిక్చర్‌ డిక్షనరీ, 504 ఆబ్సల్యూట్లీ ఎసెన్షియల్‌ వర్డ్స్, ఎన్‌టీసీ ఒకాబ్యులరీ బిల్డర్స్, వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ లాంటి పుస్తకాలను చదివి సాధన చేయండి. యాప్‌ల విషయానికొస్తే, BUSUU, MEMRISE, LinGo Play, Quizlet, Alpha bear 2, WordReference, Word of the day  లాంటి వాటిని అనుసరించవచ్చు. వీటితోపాటు memorise.com, Ffluentu.com, ఇఫ్లూ యూనివర్సిటీ వారి English Pro app ల ద్వారా కూడా మీ ఆంగ్ల పదజాలాన్నీ, భాష ఉచ్చారణనూ పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌