Post your question

 

    Asked By: అనిల్ యాదవ్

    Ans:

    డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే అర్హత ఉండదు. నోటిఫికేషన్‌ వచ్చిన నాటికి ఫలితాలు కూడా విడుదలైతే మీకు గ్రూప్‌-2 దరఖాస్తుకి అర్హత ఉంటుంది.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు కచ్చితంగా అర్హత ఉంటుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మీరు తెలంగాణలోనే చదివి ఉంటే ఇక్కడి స్థానికత కూడా వర్తిస్తుంది.

    Asked By: బాలరాజు

    Ans:

    ఎలాంటి సమస్యా ఉండదు. ఏ సందేహాలు లేకుండా గ్రూప్స్‌ పరీక్షలకు బాగా ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ఒకటో తరగతికి సంబంధించి రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఒకటో తరగతి చదివి ఉంటే ఆ స్కూల్‌ నుంచి స్టడీ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే ఏ సమస్యా ఉండదు.

    Asked By: జి. వాణీప్రియ

    Ans:

    ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ముందుగా క్వాలిఫయింగ్‌ పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు అవుతారు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణించరు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది జనరల్‌ ఇంగ్లిష్, రెండోది మేథమెటిక్స్‌ (10వ తరగతి స్థాయి). జనరల్‌ ఇంగ్ల్లిష్‌ కోసం ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (ఎస్‌ చాంద్‌), ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ జనరల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (పియర్‌సన్‌), ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (అరిహంత్‌), ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ చాంద్‌) లాంటి పుస్తకాలను చదవండి. మేథమెటిక్స్‌ కోసం హైస్కూల్‌ మేథమెటిక్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (ఎస్‌ చాంద్‌), టీచ్‌ యువర్‌ సెల్ఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (మెక్‌ గ్రాహిల్‌) లాంటి పుస్తకాలను చదవండి. రెండో దశలో జనరల్‌ స్టడీస్, ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో రెండు పరీక్షలుంటాయి. జనరల్‌ స్టడీస్‌ కోసం తెలుగు అకాడెమీ, అరిహంత్, లూసెంట్‌ లాంటి పబ్లిషర్లు ప్రచురించిన పుస్తకాలను చదవండి. ఆప్షనల్‌ పేపర్‌ విషయానికొస్తే, మీరు ఎంచుకొన్న ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ సిలబస్‌ను అనుసరించి ప్రామాణిక పుస్తకాలను చదివి సొంత నోట్స్‌ ఆధారంగా తయారవ్వండి. - ప్రొ. బెల్లకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్. పవన్

    Ans:

    వార్తా పత్రికల్లోని సమాచారం ఒకటే సరిపోదు. దాంతో పాటు గ్రూప్‌-2 సిలబస్‌ ఆధారంగా రూపొందిన ప్రామాణిక పుస్తకాలను కచ్చితంగా చదవాల్సి ఉంటుంది. కరెంట్‌ అఫైర్స్‌కి వార్తాపత్రిల్లోని సమాచారం ఉపయోగపడుతుంది.

    Asked By: దినేష్ గౌడ్

    Ans:

    గ్రూప్‌-4, కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలు అంటే ఇంటర్‌ అర్హతతో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం  లింక్‌ క్లిక్‌ చేయండి.

    https://pratibha.eenadu.net/jobs/index/police-jobs/police-jobs---telangana/2-1-10-427

    Asked By: శరత్

    Ans:

    డిగ్రీ నాగార్జున యూనివర్సిటీ నుంచి పూర్తి చేసినప్పటికీ   మీరు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉంటే టీఎస్‌పీఎస్సీ, గురుకుల ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.

    Asked By: రాజేష్

    Ans:

    ఇప్పటివరకు ఎలాంటి శిక్ష పడలేదు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. అయితే కేసుకి సంబంధించిన వివరాలను దరఖాస్తులో తెలియజేయండి.