Post your question

 

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీరు గురుకులాల్లోని ఎస్‌జీటీ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఎంకామ్‌ విద్యార్హతతో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకూ ప్రయత్నించవచ్చు.

    Asked By: సురేష్

    Ans:

    టీఎస్‌పీఎస్సీలో ఎంబీఏ స్పెషలైజేషన్‌ చేసిన వారికి ప్రత్యేకించి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉండవు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ 1, 2, 3, 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: జి. వాణీప్రియ

    Ans:

    ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగానికి ముందుగా క్వాలిఫయింగ్‌ పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే రెండో దశ పరీక్షకు అర్హులు అవుతారు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కులు తుది ఎంపికలో పరిగణించరు. క్వాలిఫయింగ్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. అందులో మొదటిది జనరల్‌ ఇంగ్లిష్, రెండోది మేథమెటిక్స్‌ (10వ తరగతి స్థాయి). జనరల్‌ ఇంగ్ల్లిష్‌ కోసం ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (ఎస్‌ చాంద్‌), ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ జనరల్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (పియర్‌సన్‌), ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (అరిహంత్‌), ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామినేషన్స్‌ (ఎస్‌ చాంద్‌) లాంటి పుస్తకాలను చదవండి. మేథమెటిక్స్‌ కోసం హైస్కూల్‌ మేథమెటిక్స్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (ఎస్‌ చాంద్‌), టీచ్‌ యువర్‌ సెల్ఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (మెక్‌ గ్రాహిల్‌) లాంటి పుస్తకాలను చదవండి. రెండో దశలో జనరల్‌ స్టడీస్, ఒక ఆప్షనల్‌ సబ్జెక్ట్‌లో రెండు పరీక్షలుంటాయి. జనరల్‌ స్టడీస్‌ కోసం తెలుగు అకాడెమీ, అరిహంత్, లూసెంట్‌ లాంటి పబ్లిషర్లు ప్రచురించిన పుస్తకాలను చదవండి. ఆప్షనల్‌ పేపర్‌ విషయానికొస్తే, మీరు ఎంచుకొన్న ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ సిలబస్‌ను అనుసరించి ప్రామాణిక పుస్తకాలను చదివి సొంత నోట్స్‌ ఆధారంగా తయారవ్వండి. - ప్రొ. బెల్లకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సోమనాథ్

    Ans:

    అవును. రెండు భాషల్లోనూ పరీక్ష పత్రం ఇస్తారు.

    Asked By: చెన్నా

    Ans:

    ఇలాంటి అంశాలకు సంబంధించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను జత చేసి, కొవిడ్‌-19 పత్రాన్ని సమర్పిస్తే పరిగణించే అవకాశం ఉంది. ప్రయత్నించి చూడండి.

    Asked By: సాయి

    Ans:

    మీకు గ్రూప్‌-4 రాసుకోవడానికి అర్హత ఉంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులకు అవకాశం లేదు.