Post your question

 

    Asked By: శివ

    Ans:

    కానిస్టేబుల్‌ పోస్టులకు డిప్లొమా చేసినవారికి అర్హత ఉంది. కానీ, ఐటీఐ వారికి అవకాశం లేదు.

    Asked By: రాజా రవికిరణ్

    Ans:

    మీరు చదివిన స్కూల్స్‌ ప్రభుత్వ గుర్తింపు పొందినవి అయితే సంబంధిత ప్రాంతాల్లోని ఎంఈఓ కార్యాలయాల నుంచి బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందని పాఠశాల అయితే ఓటీఆర్‌లో ప్రైవేట్‌ అని నింపి, తహసీల్దార్‌ నుంచి   ఆ కాలానికి సంబంధించి స్థానికతను తెలిపే సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు గ్రూప్‌-1 లేదా ఇతర స్టేట్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు నిస్సందేహంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

    Asked By: కె. ప్రియాంక

    Ans:

    మీ దగ్గర డిగ్రీ సర్టిఫికెట్‌ అందుబాటులో ఉంటే అప్‌లోడ్‌ చేయండి. లేదంటే పాస్‌ అయిన సంవత్సరం, తేదీని వేస్తే సరిపోతుంది. అయితే వెరిఫికేషన్‌ సమయంలో డిగ్రీ సర్టిఫికెట్‌ను  కచ్చితంగా సమర్పించాలి.

    Asked By: ప్రణయ్

    Ans:

    ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉంటే స్థానికతను పొందుతారు. కానీ, మీరు మహారాష్ట్రలోనే ఎక్కువ కాలం చదవడం వల్ల తెలంగాణ స్థానికత వర్తించదు.

    Asked By: సుబానా

    Ans:

    మీరు ఒకటి, రెండు తరగతులకు సంబంధించి ఎలాంటి స్టడీ సర్టిఫికెట్లు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ తరగతుల వివరాలను ఓటీఆర్‌లో ప్రైవేట్‌ అని నింపండి. అలాగే ఆ కాలానికి సంబంధించి తహసీల్దార్‌ సంతకం చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించండి. సరిపోతుంది.

    Asked By: శ్రీనివాస్

    Ans:

    ఒకటి, రెండు తరగతులకు సంబంధించి ఓటీఆర్‌లో ప్రైవేట్‌ అని నింపండి. తహసీల్దార్‌ నుంచి ఆ కాలానికి చెందిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోండి.

    Asked By: సతీష్

    Ans:

    మీరు క్రీమీలేయర్‌ పరిధిలో ఉన్నట్లయితే వయసుకు సంబంధించి ఎలాంటి సడలింపులు వర్తించవు. ఓసీ నిబంధనలే వర్తిస్తాయి.