• facebook
  • whatsapp
  • telegram

రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు

* జూనియర్‌ కళాశాలలు కూడా
* సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి అనుమతి
* 1-8 తరగతుల వారు ఇంటి వద్దనే

ఈనాడు, అమరావతి: కంటెయిన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలను సెప్టెంబ‌రు 21 నుంచి తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 22 నుంచి ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సెలింగ్‌, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు వెళ్లొచ్చు. 1-8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు. రెసిడెన్షియల్‌, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సప్‌ గ్రూపు ద్వారా ఆన్‌లైన్‌లో మార్గనిర్దేశం చేస్తారు. కావాలనుకుంటే వీరు సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయుల సూచనలు, మార్గదర్శకాలు తీసుకోవచ్చు. విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాలు అక్టోబరు 5వరకు కొనసాగుతాయి.
ఆరడుగుల దూరం..
* 1-8 తరగతుల విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారానే మార్గదర్శనం చేయాల్సి ఉంటుంది. వీరికి ఆన్‌లైన్‌, వీడియో పాఠాలే కొనసాగుతాయి. * వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని అభ్యాసనం కొనసాగించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలి.
* 9-12 తరగతుల విద్యార్థులను మాత్రమే సందేహాల నివృత్తికి పాఠశాలకు అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాలి.
* విద్యార్థులు కూర్చునే సీట్ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలి.
* విద్యార్థులు నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, తాగునీటి సీసాలను పరస్పరం మార్చుకోకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలి.
రోజుకు సగం మంది ఉపాధ్యాయులు
* ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన, విద్యా వారధి కార్యక్రమం కోసం 22-50శాతం ఉపాధ్యాయులు హాజరు కావాలి.
* మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. చేతులను తరుచూ సబ్బుతో కడుక్కోవాలి. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
* ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. * ఉమ్మివేయడం నిషేధం.
* అవకాశం ఉన్న వారు ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
* పంచాయతీరాజ్‌, పురపాలక విభాగాలను సంప్రదించి ప్రధానోపాధ్యాయులు పాఠశాల పరిసరాలను శానిటైజ్‌ చేయించాలి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.