• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌తో పాటు.. ఇవి నేర్చుకోవాలి!

తొలి అడుగుల్లో తెలుసుకోండివి

ఇంజినీరింగ్‌లో కొత్తగా చేరినవారు కోర్సు పరిధికే పరిమితం కాకూడదు. తరగతి గదిలో బోధించని కొన్ని కీలక అంశాలను నేర్చుకోవాలి. అప్పుడే నాలుగేళ్ల వ్యవధిని గరిష్ఠస్థాయిలో సద్వినియోగమవుతుంది. కెరియర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవటం సాధ్యమవుతుంది! 

మనీ మేనేజ్‌మెంట్‌

ఇంజినీరింగ్‌ విద్యార్థి వసతి గృహంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును సక్రమంగా ఎలా వాడతారనేది ముఖ్యం. కొన్ని కంపెనీలు 3, 4వ సంవత్సరాల్లో ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఉపకార వేతనాలను అందిస్తుంటాయి. వాటిని ఎలా వాడతారు? ఆర్థిక సంస్థలు, పెట్టుబడులు, మ్యూచ్యువల్‌ ఫండ్స్, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌ అంచనాలు, బ్యాలెన్స్‌షీట్‌ లాంటి వాటి గురించి అవకాశం దొరికినప్పుడు తెలుసుకోవాలి. భవిష్యత్తులో వీటికి ప్రాధాన్యం ఉంటుంది. 

కోడింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ 

ప్రతి బ్రాంచిలో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, టెక్నాలజీలు ఉంటాయి. వీటిలో రోజురోజుకీ మార్పులు వస్తుంటాయి. వీటి మీద అవగాహన ఏర్పరుచుకోవాలి. కనీసం ఒకటి లేదా రెండు సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌పై పట్టు సాధించాలి.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

భావాలను భాష రూపంగానే కాకుండా హావభావాలపరంగా కూడా ఎలా ఇతరులకు చెప్పాలో, మెప్పించాలో గ్రహించడమే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌. అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లంపై తగినంత పట్టు సాధించాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థులు మొదటి సంవత్సరం నుంచే ఈ కృషిని ప్రారంభించాలి. ప్రపంచ ప్రఖ్యాత వక్తలు మాట్లాడే తీరు, వ్యవహరించే తీరు నిశితంగా గమనించి గ్రహించాలి. అనేక సందర్భాల్లో మాటలు నీటి మూటలు కావు. విలువైన పెట్టుబడులు!

మార్కెటింగ్‌ 

‘ఏది కనిపిస్తుందో అదే అమ్ముడవుతుంది’ అనేది ప్రముఖ సామెత. ఈరోజు ఉన్నది మార్కెటింగ్‌ వ్యవస్థ.. క్రయవిక్రయాలు. భవిష్యత్తులో విద్యార్థి ఓ కంపెనీ అధినేత కావచ్చు. ఓ ఆవిష్కర్త కావచ్చు. కానీ, తన ఆవిష్కరణను బహిరంగ మార్కెట్‌లో సరిగా ప్రదర్శించలేనప్పుడు వెనకబడిపోతాడు. కాబట్టి మార్కెటింగ్‌కు సంబంధించిన అనేక పద్ధతులు, డిజిటల్‌ మార్కెటింగ్‌ మొదలైనవాటి మీద కొంత అవగాహన ఏర్పరుచుకోవాలి. 

కంటెంట్‌ రైటింగ్‌ 

నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో విద్యార్థి కొన్ని వర్క్‌షాపులకు హాజరై ఉండొచ్చు. కొన్ని ప్రాజెక్టులు చేసివుండవచ్చు. వీటిని మొదటి నుంచి చివరి వరకూ ఇతరులకు అర్థమయ్యేలా, మంత్రముగ్ధులయ్యేలా విశదీకరించడమే కంటెంట్‌ రైటింగ్‌. విద్యార్థి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగి ఇతర సంస్థలతో ఓ ఒడంబడిక చేసుకోవచ్చు. ఆర్థిక సంస్థలకు తన ప్రాజెక్టుకు సంబంధించిన వనరులనూ, అవసరాలనూ వివరించాల్సి రావచ్చు. ఇలాటి సందర్భాల్లో ఈ నైపుణ్యం ఎంతో మేలు చేస్తుంది.


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రిపరేషన్‌కు కొన్ని పద్ధతులు!

‣ ఏ సంవత్సరంలో ఏం చేయాలి?

Posted Date : 15-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌