• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తీరదళంలో కమాండెంట్‌ కొలువులు

ఎంపికైతే గ్రూప్‌-ఏ గెజిటెడ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం

ఔత్సాహిక గ్రాడ్యుయేట్ల కోసం భారతీయ తీరదళం ఎదురుచూస్తోంది. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌/ డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌  స్థాయులకు సమాన హోదాలో ఉండే అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారు నేరుగా గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టు సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం, బాధ్యతలు, వేతనం... అన్నీ ఉన్నతస్థాయిలో ఉంటాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా ఈ నియామకాలు చేపడతారు! 

వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మదింపు చేస్తారు. దరఖాస్తుదారులకు స్టేజ్‌-1 పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ఎంపికలో భాగంగా మెంటల్‌ ఎబిలిటీ టెస్టు/ కాగ్నిటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, పిక్చర్‌ పెర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీ అండ్‌ డీటీ) ఉంటాయి. ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు వస్తాయి. పీపీ అండ్‌ డీటీ కోసం ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడాలి. ఇందులో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి వ్యాఖ్యానించమంటారు. స్టేజ్‌-1లో ఎంపికైనవారికి స్టేజ్‌-2 నిర్వహిస్తారు. ఇందులో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-2లోనూ ఎంపికైనవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టు గార్డు వెబ్‌  సైట్‌లో ప్రకటిస్తారు. వీరికి జూన్‌ ఆఖరు నుంచి ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ (ఐఎన్‌ఏ), ఎజిమలలో శిక్షణ ప్రారంభమవుతుంది. 

ఉద్యోగంలో...

విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పలు ఇతర అలవెన్సులు ఉంటాయి. తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్‌ హోదాలు పొందవచ్చు. భారత సముద్రతీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేయాలి. 

విద్యార్హత, వయసు..

పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌)

1) జనరల్‌ డ్యూటీ (పురుషులు)

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌లో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులను చదివి ఉండాలి.

వయసు: అభ్యర్థులు 01.07.1997 - 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి. 

2) కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (పురుషులు/మహిళలు)

అర్హత: మ్యాథమేటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో పన్నెండో తరగతి ఉత్తీర్ణతతోపాటు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 01.07.1997 - 30.06.2003 మధ్య జన్మించి ఉండాలి.  

3) టెక్నికల్‌ పురుషులు (ఇంజినీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌)

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. ఇంటర్‌ ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ 60 శాతం మార్కులు ఉండాలి. 

వయసు: 01.07.1997 - 30.06.2001 మధ్య జన్మించి ఉండాలి.  

ఎత్తు: కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీకి 162.5 సెం.మీ. మిగిలిన విభాగాలకు 157 సెం.మీ. ఉండాలి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. 

అభ్యర్థులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే అన్నింటినీ రద్దు చేస్తారు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షలకు వెళ్లినప్పుడే సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, నకలు కాపీలు, ఫొటోలు, ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవి లేకుండా పరీక్షకు అనుమతించరు. వీటిని పరిశీలించి తిరిగి ఇచ్చేస్తారు.

మొత్తం ఖాళీలు: 50. వీటిలో జనరల్‌ డ్యూటీ 30, కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ 10, టెక్నికల్‌ -ఇంజినీరింగ్‌ 6, మెకానికల్‌ 4 ఉన్నాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 6 నుంచి 17 సాయంత్రం 5:30 వరకు స్వీకరిస్తారు.

ప్రవేశపత్రాలు: డిసెంబరు 28 నుంచి కోస్టుగార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

పరీక్ష తేదీ: స్టేజ్‌-1 ప్రాథమిక పరీక్షలు జనవరి ప్రారంభంలో నిర్వహిస్తారు. తుది నియామకాలు ఫిబ్రవరిలో ఉంటాయి. 

పరీక్ష కేంద్రాలు: గోవా, చెన్నై, కోల్‌కతా, నోయిడా 

వెబ్‌సైట్‌: https://www.joinindiancoastguard.gov.in/
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ AF CAT - 2022: వాయుసేనలో విశిష్ట కొలువులు

‣ పదునుగా ప్రిపరేషన్‌!

‣ మీ గురించి మీరు ఆకట్టుకునేలా చెప్పగలరా?

‣ శాస్త్రీయంగా చదివేద్దాం!

Posted Date : 07-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌