• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌పీసీఐఎల్‌లో 400 ఉద్యోగాలు

రాత పరీక్ష లేదు

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక


 


ముంబయిలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) 400 ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గేట్‌ స్కోర్‌ - 2022/2023/2024 ఆధారంగా అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.  


మొత్తం 400 ఉద్యోగాల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 159, ఈడబ్ల్యూఎస్‌లకు 39, ఎస్సీలకు 61, ఎస్టీలకు 32, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 109 కేటాయించారు. 

ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (మెకానికల్‌)-150, కెమికల్‌-73, ఎలక్ట్రికల్‌-69, ఎలక్ట్రానిక్స్‌-29, ఇన్‌స్ట్రుమెంటేషన్‌-19, సివిల్‌-60 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఆరు విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌)/ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. తప్పనిసరిగా గేట్‌-2022/ 2023/ 2024 స్కోర్‌ ఉండాలి. 


ఎలక్ట్రానిక్స్‌ విభాగానికి దరఖాస్తు చేయడానికి.. ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ ఇంజినీరింగ్‌ పాసైనవారు అర్హులు. ఇంజినీరింగ్‌ చివరి ఏడాది పరీక్షలు రాస్తున్నవారు, తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. 


30.04.204 నాటికి జనరల్‌ అభ్యర్థుల వయసు 26 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది. ఎన్‌పీసీఐఎల్‌ ఉద్యోగులకు గరిష్ఠ వయసు లేదు. 

జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్, మహిళలు, ఎన్‌పీసీఐఎల్‌ ఉద్యోగులకు ఫీజు లేదు.  

ఎంపిక: గేట్‌-2022, 2023, 2024 స్కోర్ల ఆధారంగా 1:12 నిష్పత్తిలో అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీంట్లో చూపిన ప్రతిభ, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.  

ఇంటర్వ్యూలో అన్‌రిజర్వుడ్‌ 70 శాతం, ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/ పీడబ్ల్యూబీడీలు 60 శాతం మార్కులు సాధించాలి. 

ఇంటర్వ్యూలు జూన్‌ 3 నుంచి 15 వరకూ నిర్వహించవచ్చు. ఇవి మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో జరుగుతాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపేటప్పుడే ఇంటర్వ్యూ కేంద్రాలను ఎంపికచేసుకోవాలి. 

ఇంటర్వ్యూ సమయంలోనే అసలు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 

పర్సనల్‌ ఇంటర్వ్యూలో హిందీ లేదా ఇంగ్లిష్‌లో సమాధానాలు చెప్పొచ్చు. 

ఇంటర్వ్యూకు హాజరయ్యే ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఏసీ త్రీటైర్‌ రైల్వే ఛార్జీలను చెల్లిస్తారు. 

శిక్షణ: ఎంపికైనవారికి ఏడాదిపాటు ఓరియెంటేషన్‌ శిక్షణ ఉంటుంది. ఇది ముగిశాక వీరిని దేశ, విదేశాల్లో ఎక్కడైనా నియమించవచ్చు. ఎంపికైన ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలకు ఆరు విభాగాల్లోనే కాకుండా.. ఆర్‌అండ్‌డీ, డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్, ఇతర విధులను కూడా కేటాయించవచ్చు. 

స్టైపెండ్‌: శిక్షణ కాలంలో నెలకు రూ.55 వేల స్టైపెండ్, రూ.18 వేలను బుక్‌ అలవెన్స్‌గా ఒకేసారి చెల్లిస్తారు. వసతి, భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. 

శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు సైంటిఫిక్‌ ఆఫీసర్‌/సి గ్రేడ్‌ ఇస్తారు. లెవెల్‌-10 కింద రూ.56,100 వేతనం చెల్లిస్తారు. ఇతర సదుపాయాలుంటాయి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2024

వెబ్‌సైట్‌: www.npcil.co.in
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టాన్‌ఫర్డ్‌లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్‌షిప్పు!

‣ నెట్‌ విలువలకు.. నెటికెట్‌

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

Posted Date : 15-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌