• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరిహద్దు దళంలో ఉద్యోగాలు

ఇంజినీరింగ్‌ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం

దేశ రక్షణ దళాల్లో పనిచేయాలనుకునే యువత కోసం డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) మొత్తం 90 గ్రూప్‌ ‘బి’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఇది చక్కటి అవకాశం. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

30 ఏళ్ల వయసు మించని యువతీయువకులను బీఎస్‌ఎఫ్‌ ఆహ్వానిస్తోంది. ఇటీవలే కమాండెంట్‌ కొలువులకు నోటిఫికేషన్‌ రాగా... తాజాగా గ్రూప్‌ బి పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌) - 1, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌) - 57, జూనియర్‌ ఇంజినీర్‌/సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) - 32 ఖాళీలున్నాయి.

విద్యార్హతలు: ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌) పోస్టుకు ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ ఉండాలి. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌) పోస్టు కోసం సివిల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాసై ఉండాలి. జూనియర్‌ ఇంజినీర్‌/సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టుకు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పాసవ్వాలి. 

పరీక్ష విధానం: అన్ని పోస్టుల అభ్యర్థులకు తొలుత రాతపరీక్ష నిర్వహిస్తారు. దాని తర్వాత ఇంటర్వ్యూ, శారీరక సామర్థ్య పరీక్ష పాసవ్వాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.200/-, యువతులకు, ఎస్సీ, ఎస్టీ, సర్వీస్‌లో ఉన్నవారు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

పరీక్ష విధానం: రాత పరీక్షలో మొత్తం రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది, గంటన్నరలో పూర్తి చేయాలి. 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

రెండో పేపర్‌ కూడా 100 మార్కులకు ఉంటుంది, 2 గంటల్లో పూర్తి చేయాలి. 

ఎస్‌ఐ (వర్క్స్‌): జనరల్‌ ఇంజినీరింగ్‌ (సివిల్‌) - 10 ప్రశ్నలు - 100 మార్కులు. (12 ప్రశ్నలు ఇస్తారు.. 10 ప్రశ్నలను ఎంచుకోవాలి.)

జేఈ/ఎస్‌ఐ (ఎలక్ట్రికల్‌): జనరల్‌ ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌) - 10 ప్రశ్నలు - 100 మార్కులు  (12 ప్రశ్నలు ఇస్తారు.. 10 ప్రశ్నలను ఎంచుకోవాలి.)

రాతపరీక్ష పాసయ్యేందుకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. 

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌: పురుష అభ్యర్థులు 165 సెం.మీ ఎత్తుండాలి. ఛాతీ శ్వాస పీల్చినప్పుడు 81 సెం.మీ, వదలినప్పుడు 76 సెం.మీ ఉండాలి. వైద్య ప్రమాణాలను అనుసరించి ఎత్తుకు తగిన బరువుండాలి. మహిళలైతే 157 సెం.మీ ఎత్తు, 46 కేజీలకు తగ్గకుండా బరువు ఉండాలి. 

ఎలా చదవాలి: ఈ ప్రశ్నపత్రం స్థాయి సాధారణంగా మధ్యస్థంగా ఉంటుంది. రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రశ్నలు ఉన్నా... అభ్యర్థి విజయంలో ఇంజినీరింగ్‌ సబ్జెక్టులదే కీలకపాత్ర. అందువల్ల సిలబస్‌ చూసుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో అర్థమవుతుంది. పరీక్షకు సరిపడా సమయం ఉన్నందున అభ్యర్థులు సరైన ప్రణాళికతో సన్నద్ధత మొదలుపెడితే విజయతీరాలకు చేరుకోవచ్చు. ఫిజికల్‌ టెస్ట్‌ ప్రామాణిక కొలతలకు సరిపోతున్నారో లేదో చూసుకుని అందుకు తగిన విధంగా డైట్‌ తీసుకోవాలి. 

దరఖాస్తుకు చివరితేదీ: జూన్‌ 8

ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ

‣ విదేశీ వ్యవహారాల అధ్యయన వ్యూహం ఇదీ!

‣ ఐటీ ఉద్యోగాలకు కోడింగ్‌ అక్కర్లేదు!

‣ ఇంజినీరింగ్‌, ఫార్మసీ డిగ్రీ కోర్సుల్లోకి స్వాగతం

‣ బోధన, పరిశోధనలకు అధికారిక అర్హత

‣ మెరుగైన ర్యాంకుకు మెలకువలు ఇవిగో!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌