• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌, ఫార్మసీ డిగ్రీ కోర్సుల్లోకి స్వాగతం

ఏపీ ఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, కాకినాడ 2022-23 విద్యాసంవత్సరానికి బీఈ/బీ.టెక్, బీ.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంజినీరింగ్‌ కామన్‌ ఎం్రçన్స్‌ టెస్ట్‌(ఈసెట్‌) ప్రకటన వెలువరించింది.

అర్హత: గుర్తింపు పొందిన స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ/ ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేళ్ల బీఎస్సీ డిగ్రీలో మ్యాథమేటిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఏపీఈసెట్‌ రాయొచ్చు. 

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500/-, బీసీ అభ్యర్థులకు రూ.550/-, ఓసీ అభ్యర్థులకు రూ.600/-. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో... పరీక్ష సమయం: 3 గంటలు, రెండు పేపర్లు... ఉదయం (9 నుంచి 12 వరకు), మధ్యాహ్నం (3 నుంచి 6 వరకు)

ఎంపిక విధానం: అర్హత మార్కులు: బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌)కు 200 మార్కులకు గానూ 25 శాతం ఉత్తీర్ణత సాధించడం అవసరం, అంటే కనీసం 50 మార్కులు పొందాలి.

అందిస్తున్న కోర్సులు: బయోటెక్నాలజీ, సిరామిక్‌ టెక్నాలజీ, సివిల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ. 

పరీక్ష విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ), ఒక్కో విభాగానికి 200 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు: 200 సిలబస్‌... ఇంజినీరింగ్‌: 200 మార్కులకుగానూ... మ్యాథమేటిక్స్‌ (50 మార్కులకు), ఫిజిక్స్‌(25 మార్కులకు), కెమిస్ట్రీ(25 మార్కులకు)... మిగతా 100 మార్కులకు ఇంజినీరింగ్‌ సజ్జెక్టుపై ప్రశ్నలడుగుతారు. ఒక్కో బ్రాంచ్‌ (అగ్రికల్చరల్‌/ బయోటెక్నాలజీ/ సిరామిక్‌ టెక్నాలజీ/ కెమికల్‌/ సివిల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ మెకానికల్‌/ మెటలర్జికల్‌/ మైనింగ్‌ ఇంజినీరింగ్‌)కు విడిగా ప్రశ్నపత్రం ఉంటుంది. ఫార్మసీ: ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, ఫార్మకోగ్నసీ, ఫార్మకాలజీ... ఒక్కోదానికి 50 చొప్పున 200 ప్రశ్నలడుగుతారు. బీఎస్సీ: మ్యాథమేటిక్స్‌ (100 మార్కులకు), ఎనలిటికల్‌ ఎబిలిటీ, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌లకు 50 చొప్పున 100 ప్రశ్నలుంటాయి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 3 

పరీక్ష: జులై 22 

ప్రిలిమినరీ 'కీ' విడుదల: జులై 25 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బోధన, పరిశోధనలకు అధికారిక అర్హత

‣ మెరుగైన ర్యాంకుకు మెలకువలు ఇవిగో!

‣ విద్యార్థులూ... కళ్లను నిర్లక్ష్యం చేయకండి!

‣ మార్కులు తెచ్చే విపత్తు నిర్వహణ

‣ విద్యార్థులకు విప్రో ఉద్యోగాలు సిద్ధం!

‣ ఇంటర్‌ విద్యార్థులకు ఐఐఎస్‌సీ ఆహ్వానం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌