• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెంట్రల్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ల భర్తీ

5వేల ఖాళీలతో ప్రకటన విడుదల

ముంబయిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ రీజియన్లవారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 5,000 ఖాళీల్లో తెలంగాణకు 106, ఆంధ్రప్రదేశ్‌కు 141 ఉన్నాయి. ఎస్సీలకు 763, ఎస్టీలకు 416, ఓబీసీలకు 1162, ఈడబ్ల్యూఎస్‌లకు 500, జనరల్‌కు 2159 పోస్టులను కేటాయించారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. 31.03.2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.800. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400.

అభ్యర్థులకు ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. 8/10/12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్‌లో తెలుగును ఒక సబ్జెక్టుగా చదివుండాలి. 

ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఫిట్‌నెస్, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీంట్లో 5 పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-1లో క్వాంటిటేటివ్, జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 2. బేసిక్‌ రిటైల్‌ లయబిలిటీ ప్రొడక్ట్స్, 3. బేసిక్‌ రిటైల్‌ అసెట్‌ ప్రొడెక్ట్స్, 4. బేసిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొడెక్ట్స్, 5 బేసిక్‌ ఇన్యూరెన్స్‌ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన అంశాలు ఉంటాయి. పరీక్ష వ్యవధికి సంబంధించిన సమచారాన్ని కాల్‌ లెటర్‌లో తెలియజేస్తారు. ఖాళీలకు నాలుగురెట్ల మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. జిల్లా, కేటగిరీలవారీగా అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. ఎంపికైనవారు ఏడాది పాటు అప్రెంటిస్‌గా కొనసాగుతారు. వీరికి నెలకు రూ.10,000 (రూరల్‌/సెమీ అర్బన్‌ బ్రాంచ్‌లు) రూ.12,000 (అర్బన్‌ బ్రాంచ్‌), రూ.15,000 (మెట్రో బ్రాంచ్‌)తోపాటు ఇతర అలవెన్సులూ అందుతాయి. 

అప్రెంటిస్‌షిప్‌ పూర్తయిన అభ్యర్థులకు అసెస్‌మెంట్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. దీంట్లో థియరెటికల్‌ పార్ట్, ఆన్‌-ది-జాబ్‌ ట్రైనింగ్‌ కాంపొనెంట్‌ ఉంటాయి. బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టర్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా థియరీ అసెస్‌మెంట్‌ను, ప్రాక్టికల్‌ అసెస్‌మెంట్‌ను సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్వహిస్తుంది. అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ను సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీఎఫ్‌ఎస్‌ఐ ఎస్‌ఎస్‌సీ సంయుక్తంగా అభ్యర్థులకు అందజేస్తాయి. 

ముఖ్యాంశాలు 

తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు బ్యాంక్‌ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి. ఏమైనా మార్పులూ, చేర్పులూ ఉంటే అభ్యర్థులకు ప్రత్యేకంగా తెలియజేయరు. 

ఇంటర్వ్యూకు హాజరయ్యే జనరల్‌ అభ్యర్థులకు ఎలాంటి ట్రావెలింగ్‌ అలవెన్సులూ చెల్లించరు. నిరుద్యోగులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ట్రావెలింగ్‌ అలవెన్స్‌ చెల్లిస్తారు. 

దరఖాస్తు చేసిన తర్వాత.. మొబైల్‌ నంబర్‌/ అడ్రస్‌/ మెయిల్‌ ఐడీలో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. 

‣ కనీసార్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.  

ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్‌ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుకు చివరి తేదీ: 03.04.2023

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 2వ వారం, 2023

వెబ్‌సైట్‌: https://www.centralbankofindia.co.in/en/recruitments
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ కెనడాలో కోర్సులు చేసేద్దాం!

‣ ప్రణాళికను పాటిస్తూ.. సన్నద్ధతను సమీక్షిస్తూ!

‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!

‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?

‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!

Posted Date : 28-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.