‣ విద్యావకాశాలు, ఇతర వివరాలు
కెనడా.. విదేశాలకు వెళ్లి చదవాలి అనుకునే విద్యార్థుల జాబితాలో తప్పకుండా ఉండే దేశం. అక్కడ చదివితే.. అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడొచ్చని ఆశించేవారు ఎందరో! అందుకే కెనడాలో ఉన్నత విద్యావకాశాలు, ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కెనడాలో రెండు అధికారిక భాషలున్నాయి.. ఇంగ్లిష్, ఫ్రెంచ్. ఏటా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకునే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. సాధారణంగా ఇక్కడి విద్యాసంవత్సరం సెప్టెంబరుతో మొదలై జూన్‌తో ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలుగా పేరుమోసిన ఎన్నో యూనివర్సిటీలు, కళాశాలలకు ఈ దేశం నిలయం. ఇక్కడ పొందిన పట్టాలకు దాదాపు అన్ని దేశాల్లోనూ గుర్తింపు లభిస్తుంది.
కెనడా విద్యాసంస్థల్లో రెండు రకాలు ఉన్నాయి. అవి..
యూనివర్సిటీలు: ఇవి సాధారణ విశ్వవిద్యాలయాల మాదిరిగానే వివిధ రకాల కోర్సులను అందిస్తాయి.
కమ్యూనిటీ కాలేజీలు: ఇవి ప్రత్యేకంగా ఉద్యోగ శిక్షణను ఇచ్చే సంస్థలు. నేరుగా పరిశ్రమకు వెళ్లేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాయి.
‣ యూనివర్సిటీల్లో ఉండే కోర్సుల్లో ఇంజినీరింగ్, అప్లైడ్ సైన్స్‌లో మాస్టర్స్ ప్రధానమైనవి. కాలేజీల్లో రెండేళ్ల వ్యవధితో పోస్ట్ సెకెండరీ డిప్లొమాలు, మూడేళ్ల వ్యవధి ఉండే అడ్వాన్స్‌డ్ డిప్లొమాలు, గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు ఒకటి నుంచి రెండేళ్ల కాలవ్యవధితో లభిస్తున్నాయి.
‣ కెనడా విద్యాసంస్థల్లో ప్రవేశం లభించాలంటే ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్షల్లో తగిన స్కోరు తప్పనిసరి.
ఎస్‌డీఎస్ (స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్)
2018 నుంచి కెనడా ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇండియాతోపాటు చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాల నుంచి వచ్చే విద్యార్థుల వీసా ప్రక్రియను వేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విధానంలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కోర్సు మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు ముందుగానే చెల్లించాలి. అలాగే ఒక ఏడాదికి సరిపోయే ఖర్చుల డబ్బు ఆ దేశంలో ఏదైనా బ్యాంకులో జమ చేయడం ద్వారా జీఐసీ (గ్యారెంటీడ్ ఇన్వెస్టిమెంట్ సర్టిఫికెట్) పొందాలి. సాధారణంగా ఈ పద్ధతిలో వీసాకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు 2 నుంచి 4 వారాల్లో వీసా వచ్చిందీ లేనిదీ తెలిసిపోతుంది.

ఎస్‌డీఎస్ కానివాళ్లు..
‣ ఏదైనా జాతీయ బ్యాంకులో విద్య (లేదా) వ్యక్తిగత రుణం
‣ ప్రావిడెంట్ ఫండ్ నిల్వలు
‣ ఫిక్స్డ్ డిపాజిట్
‣ పొదుపు ఖాతా నిల్వలు
‣ ఎల్‌ఐసీ పాలసీ సరెండర్ వాల్యూ స్టేట్‌మెంట్
‣ పోస్టల్ ఖాతా నిల్వలు
కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
‣ ఉద్యోగులు
‣ రెండేళ్ల ఐటీ రిటర్న్స్/ఫామ్-16
‣ వ్యవసాయ ఆదాయం-రెండేళ్ల మీసేవ ఆదాయ ధ్రువపత్రం
‣ వ్యాపార ఆదాయం - వ్యాపార రిజిస్ట్రేషన్, బిజినెస్ పాన్ కార్డ్, కరెంట్ అకౌంట్ స్టేట్‌మెంట్, రెండేళ్ల ఐటీ రిటర్న్స్.
‣ ఇవి కాకుండా ఇతర ఏ ఆదాయ వనరైనా రెండేళ్లపాటు ఆదాయ ధ్రువపత్రాలు చూపించాల్సి ఉంటుంది.
స్థూలంగా దరఖాస్తు ప్రక్రియ..
‣ కాలేజీలకు అకడమిక్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్, ఐఈఎల్‌టీఎస్, ఇంటర్న్‌షిప్ లేదా పని అనుభవం ధ్రువపత్రాలు వంటి వివరాలు అందించి ఆఫర్ లెటర్ పొందాలి.
‣ యూనివర్సిటీలకు - బి.టెక్. ట్రాన్స్‌స్క్రిప్ట్స్, రెండు లేదా మూడు సిఫార్సు లేఖలు, ఎస్‌ఓపీ, పదోతరగతి, ఇంటర్, ఐఈఎల్‌టీఎస్/టోఫెల్ స్కోర్లు, ఇంటర్న్‌షిప్ లేదా పని అనుభవం ధ్రువపత్రాలు, రెజ్యుమె సమర్పించాలి.
‣ ట్యూషన్ ఫీజు చెల్లించి, జీఐసీ కావాలంటే ఏడాది ఖర్చులు జమ చేయాలి.
‣ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి (టి.బి.).
‣ తర్వాత వీసా బయో మెట్రిక్స్‌కు 85 కెనెడియన్ డాలర్లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. వీసా ఫీజు 150 డాలర్లు ఉంటుంది. అది కూడా చెల్లిస్తే 4 నుంచి 6 వారాల్లో నిర్ణయం తీసుకుంటారు.
- బి.రామ్‌కుమార్, కో-ఫౌండర్, ఐవీవై ఓవర్సీస్
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రణాళికను పాటిస్తూ.. సన్నద్ధతను సమీక్షిస్తూ!
‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!
‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?
‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!
- Read Latest job news, Career news ,Education news and Telugu news
- Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.