• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోల్‌ఫీల్డ్స్ కొలువులు సిద్ధం!

135 ఖాళీల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న 

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకంగా నిలిచిన నాగ్‌పుర్‌లోని వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ 135 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. భూగర్భ, ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో మైనింగ్‌ సర్దార్, సర్వేయర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది!  

కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఎనిమిది అనుబంధ సంస్థల్లో వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూసీఎల్‌) ఒకటి. మినీరత్న హోదాను పొందిన ఈ సంస్థ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో మైనింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లోని పరిశ్రమలకు బొగ్గును సరఫరా చేస్తోంది. అంతేకాకుండా.. దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పారిశ్రామిక అవసరాలనూ తీరుస్తోంది. 


మొత్తం 135 పోస్టుల్లో...


మైనింగ్‌ సర్దార్‌ (టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-సి) పోస్టులు 107 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 43, ఈడబ్ల్యూఎస్‌కు 11, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 29, ఎస్సీకి 16, ఎస్టీకి 08 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/ తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ (డీజీఎంఎస్‌) జారీచేసిన మైనింగ్‌ సర్డార్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. గ్యాస్‌ టెస్టింగ్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్లు ఉండాలి. లేదా మైనింగ్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, డీజీఎంఎస్‌ జారీచేసిన ఓవర్‌మెన్‌ సర్టిఫికెట్, గ్యాస్‌ టెస్టింగ్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్లు అవసరం. 


సర్వేయర్‌ (టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-బి) ఖాళీలు 28 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 12, ఈడబ్ల్యూఎస్‌కు 03, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 07, ఎస్సీకి 04, ఎస్టీకి 02 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టుకు మెట్రిక్యులేషన్‌ పాసై సర్వేయర్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌లో డిప్లొమాతోపాటు సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.


19.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. 


అభ్యర్థుల ఎంపిక రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష తేదీ, ఎక్కడ నిర్వహిస్తారనే వివరాలను సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు.  


‣ మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు ఎంపికైనవారికి ఆరు నెలల ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో ప్రాథమిక మూలవేతనం రూ.31,852 ఇస్తారు. దీనికి అదనంగా డీఏ, ఇతర ప్రోత్సాహకాలూ, సౌకర్యాలూ ఉంటాయి. ప్రొబేషనరీ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను మైనింగ్‌ సర్దార్‌ (టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-సి)గా ఉద్యోగంలోకి తీసుకుంటారు. 


సర్వేయర్‌ (మైనింగ్‌) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో ప్రాథమిక మూలవేతనం రూ.34,391 చెల్లిస్తారు. దీనికి అదనంగా డీఏ, ఇతర ప్రోత్సాహకాలూ, సౌకర్యాలూ ఉంటాయి. ప్రొబేషనరీ పీరియడ్‌ను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులను మైనింగ్‌ సర్వేయర్‌ (టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌-బి)గా ఉద్యోగంలోకి తీసుకుంటారు. 


 రాత పరీక్షలో...


ఈ పరీక్షలో 100 ప్రశ్నలకు 100 మార్కులుంటాయి. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. రాత పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తే.. ఓఎంఆర్‌ షీట్‌తోపాటు క్వశ్చన్‌ బుక్‌లెట్‌ (హిందీ, ఇంగ్లిష్‌)ను ఇస్తారు. ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించినట్లయితే ఆ విషయాన్ని వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు. స్టాట్యుటరీ ప్రొవిజన్స్, యోగ్యత సర్టిఫికెట్‌ పొందిన అంశాల నుంచీ, జనరల్‌ అవేర్‌నెస్, మెంటల్‌ ఎబిలిటీ.. మొదలైన వాటి నుంనీ ప్రశ్నలు ఇస్తారు. 


జనరల్‌ అవేర్‌నెస్‌: ఇండియన్‌ ఎకానమీ, పుస్తకాలు-రచయితలు, సైన్స్‌ - ఇన్నోవేషన్స్‌ అండ్‌ డిస్కవరీస్, స్పోర్ట్స్, అబ్రివేషన్స్, దేశాలు-రాజధానులు, కరెంట్‌ అఫైర్స్‌ - నేషనల్‌ అండ్‌ ఇంటర్నేషనల్, అవార్డ్స్‌ అండ్‌ ఆనర్స్, బడ్టెట్, పంచవర్ష ప్రణాళికలు, భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం, ముఖ్యమైన రోజులు, జనరల్‌ సైన్స్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జనరల్‌ పాలసీ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 


మెంటల్‌ ఎబిలిటీ: వెర్బల్‌ రీజనింగ్, జంబుల్డ్‌ పారాగ్రాఫ్స్‌/ పేరా-జంబుల్స్, ఎసర్షన్‌-రీజన్, కోడింగ్‌-డీకోడింగ్, డేటా సఫిషియెన్సీ, డెరెక్షన్, సమ్మరీ క్వశ్చన్స్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (టేబుల్స్, ఛార్ట్స్, గ్రాఫ్స్‌) కేస్‌లెట్స్, పజిల్స్, ఎనాలజీ, బ్లడ్‌ రిలేషన్స్, క్లాసిఫికేషన్, లాజికల్‌ సీక్వెన్స్‌ ఆఫ్‌ వర్డ్స్, లాజికల్‌ వెన్‌ డయాగ్రమ్, నంబర్‌ సిరీస్, సీక్వెన్స్, మిస్సింగ్‌ క్యారక్టర్స్, స్పాంటేనియస్‌ రియాక్షన్‌ టెస్ట్స్‌.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 


1) రాత పరీక్షలో మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు 100 మార్కులకుగాను అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 45, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి. 


2) సర్వేయర్‌ పోస్టుకు.. అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 100 మార్కులకు 50, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) 45, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి. 


దరఖాస్తు ఫీజు: అన్‌ రిజర్వుడ్‌/ ఓబీసీ-నాన్‌ క్రీమీ లేయర్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎం/డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఫీజును డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా మాత్రమే చెల్లించాలి. వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్, నాగ్‌పుర్‌ పేరు మీద డీడీ తీయాలి. 


ముఖ్యాంశాలు:  ఒక్కొక్కరూ ఒక్క దరఖాస్తును మాత్రమే పంపాలి. ఎక్కువ దరఖాస్తులు పంపితే అన్నింటినీ తిరస్కరిస్తారు. విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను జతచేయాలి. డిస్టెన్స్‌ లెర్నింగ్‌/ పార్ట్‌టైమ్‌ లేదా తత్సమాన విధానాల ద్వారా సాధించిన కనీస విద్యార్హత సర్టిఫికెట్‌లను పరిగణనలోకి తీసుకోరు. పరీక్ష విధానం, తేదీలను తర్వాత వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు.    

దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023 

వెబ్‌సైట్‌:  http://westerncoal.in/
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

Posted Date : 03-02-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌