• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒత్తిడి వ‌ద్దు.. ఓపిగ్గా ప్ర‌య‌త్నించు!

క్లిష్ట ప‌రిస్థితులను అధిగ‌మించేందుకు సూచ‌న‌లు

చాలామంది ఎదుర్కొనే ప్రశ్న ఇది... భారీగా ఫీజు కట్టి,  కష్టపడి చదివి, పట్టా పుచ్చుకుని బయటకు వస్తే... తీరా ఆ చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాదు! 

ఒకపక్క ఖాళీగా ఉండలేక ఒత్తిడి, మరోపక్క సరైన ఉద్యోగం కనపడక డీలా. ఇలాంటి సమయాల్లో ఏం చేయొచ్చు? దీన్ని ఎలా ఎదుర్కోవాలి?


మౌఖిక పరీక్షను ఎదుర్కోవడం గురించి మరింత బాగా నేర్చుకోండి. ఎంత చక్కటి అకడమిక్‌ స్కోరు, రెజ్యూమె ఉన్నా ఇంటర్వ్యూ సరిగ్గా ఇవ్వకపోతే ఉద్యోగం పొందే అవకాశాలు గణనీయంగా పడిపోతాయి. చక్కగా మాట్లాడటం, సరైన బాడీ లాంగ్వేజ్‌ కలిగి ఉండటం, ఇంటర్వ్యూలో పాటించాల్సిన ఇతర నియమాలు, టిప్స్‌ను తెలుసుకోవడం ద్వారా ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయి.


ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మనల్ని మనం బయటపడేసుకునేలా చిన్నచిన్న మార్పులు, ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఏదేమైనా ఒత్తిడికి లోను కాకుండా విజయం సాధించేందుకు ప్రయత్నించాలి. 

 ఒక్కసారి రెజ్యూమెను తరచి చూడండి. కేవలం చదువు, ఇతర వివరాల సమాచారంతో బోరింగ్‌గా ఉందా లేక ఆసక్తి కలిగించేలా ఒక్క విషయం అయినా అనిపిస్తోందా అన్నది కంపెనీల కోణం నుంచి ఆలోచించండి. ఎవరైనా మనల్ని ఎందుకు ఉద్యోగంలోకి తీసుకోవాలి అనే ప్రశ్న మనకు మనమే వేసుకుంటే... ఆ సమాధానంలోంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దానికి తగిన విధంగా రెజ్యూమెను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండండి. ఇతరులకంటే భిన్నంగా కనిపించేలా ప్రయత్నించండి. 

 సంస్థలకు పంపే కవర్‌ లెటర్స్, ఈ-మెయిల్స్‌ను జాగ్రత్తగా గమనించండి. అవి అవతలివారిని చదివించేలా ఉండాలి. వారి వెబ్‌సైట్‌లో మనం ఏం చూశాం, ఎందుకు సంప్రదించాం, వారికి ఏం చేయగలం అనే విషయాన్ని తెలియజేసేలా క్లుప్తంగా, స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఎదుటివ్యక్తి తిరిగి సమాధానం ఇచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 

 కేవలం దరఖాస్తులు పంపడమే కాకుండా, ఇంకేం చేయవచ్చో ఆలోచించండి. నియామకాలు జరుగుతున్నట్లు ప్రకటించకపోయినా కంపెనీలను సంప్రదించడం, నెట్‌వర్క్‌ మీటింగ్స్‌కు హాజరుకావడం, అవసరమైతే ఊరు మారడం, ఏదైనా కోర్సు నేర్చుకోవడం... ఏం చేస్తే ఇప్పుడున్న పరిస్థితి మెరుగవుతుందో అంచనా వేయండి.

కేవలం నిర్దేశించుకున్న ఉద్యోగమే కాకుండా... దానికి అనుబంధంగా ఏదైనా ఫీల్డ్‌లో ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించండి. కొంతకాలం తర్వాత మారే అవకాశం ఉంటుంది కదా! ముందైతే జాబ్‌ దొరకడం ముఖ్యం.  

 జాబ్‌ మార్కెట్లో ఎన్నో ఓపెనింగ్స్‌ ఉంటాయి. అందులో మనకు నప్పే వాటిని, మనకు ప్రాధాన్యం దక్కే వాటిని ఎంచుకోవడం కూడా ముఖ్యమే. అప్పుడే ఆ ఉద్యోగం అందుకునే వీలుంటుంది. ప్రొఫైల్‌కు వీలైనంత దగ్గరగా అనిపించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే తిరిగి జవాబు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

 అన్నింటికీ మించి నిరుత్సాహపడొద్దు. ప్రతి ఒక్కరికీ క్యాంపస్‌లలోనే ఉద్యోగాలు వచ్చేయవు. చాలామందికి చదువు పూర్తవ్వడానికీ, ఉద్యోగంలో చేరడానికీ మధ్య ఒక క్లిష్టమైన సంధి దశ ఉంటుంది. ఆ సమయంలో ఎంత ఓపిగ్గా ప్రయత్నిస్తే అంత బాగా కెరియర్‌ను రూపొందించుకున్నవాళ్లం అవుతాం!

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేనేజ‌ర్ల‌కు టూరిజం స్వాగ‌తం!

‣ స‌త్వ‌ర ఉద్యోగాలు .. సొంత ప‌రిశ్ర‌మ‌లు!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

‣ విదేశీ విద్యకు సిద్ధమవుతున్నారా?

‣ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు

Posted Date : 08-03-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌