• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దూరవిద్యలో యూజీ.. పీజీ 



రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దూర విద్యకు చిరునామా.. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం. కోరిన కోర్సు లభించడం, అందుబాటులో అధ్యయన కేంద్రాలు, తక్కువ ఫీజు, తెలుగు మీడియంలో పీజీ చదువులు.. తదితర కారణాలతో ఈ సంస్థలో ఎక్కువ మంది చేరుతున్నారు. యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను బీఆర్‌ఏఓయూ అందిస్తోంది. వాటిలో జనవరి-ఫిబ్రవరి సెషన్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు!  


ఇవీ కోర్సులు:


యూజీలో.. 

బీఏ, బీఎస్సీ, బీకాంలను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. వీటికి ట్యూషన్‌ ఫీజు మొదటి ఏడాది రూ.2700, తర్వాత రెండేళ్లు ఏడాదికి రూ.2500 చొప్పున చెల్లించాలి. అలాగే సైన్స్‌ కోర్సుల్లో చేరినవారు ల్యాబ్‌ ఫీజు అదనంగా చెల్లించాలి. యూజీ కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు చొప్పున ఉంటాయి.


విభాగాలవారీగా..

కళలు (ఆర్ట్స్‌): తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం.

సోషల్‌ సైన్సెస్‌ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం.

విజ్ఞానశాస్త్రాలు (సైన్స్‌): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం.

వాణిజ్యశాస్త్రం: కామర్స్‌. 

ఎవరు అర్హులు: రెగ్యులర్‌ విధానంలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఉత్తీర్ణత పొందినవారు, మూడేళ్ల పాలిటెక్నిక్‌ కోర్సులు చదివినవారు, రెండేళ్ల డిప్లొమా పూర్తయినవాళ్లు, ఇంటర్మీడియట్‌కు సమాన విద్యార్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 


పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు

ఎంఏ: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ కోర్సులను తెలుగు మాధ్యమంలోనే అందిస్తున్నారు. స్టడీ మెటీరియల్‌ కూడా తెలుగులోనే ఉంటుంది. పరీక్షలు తెలుగు/ ఇంగ్లిష్‌లో రాసుకోవచ్చు. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ ఆంగ్ల మాధ్యమంలోనే లభిస్తుంది. లాంగ్వేజీ కోర్సులు సంబంధిత భాషలో ఉంటాయి. కోర్సుల ఫీజు మొదటి ఏడాదికి రూ.5300. రెండో ఏడాదికి రూ.5000. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌కు మొదటి ఏడాది రూ.7800. రెండో సంవత్సరానికి రూ.7500. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. 

అర్హత: ఏదైనా యూజీ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎమ్మెస్సీ: మ్యాథ్స్, అప్లైడ్‌ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, సైకాలజీ. వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. కెమిస్ట్రీకి మొదటి సంవత్సరం రూ.18,300. రెండో ఏట రూ.18,000. మ్యాథ్స్‌కి రెండేళ్లూ వరుసగా రూ.7800, 7500. మిగిలినవాటికి మొదటి ఏడాదికి రూ.15,300. రెండో సంవత్సరానికి రూ.15,000 ఫీజు చెల్లించాలి. .

అర్హత: సంబంధిత సబ్జెక్టులను బ్యాచిలర్‌ డిగ్రీలో చదివుండాలి. సైకాలజీకి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో సైన్స్‌ గ్రూపులవారు ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులో చేరవచ్చు. 

ఎంఎల్‌ఐఎస్సీ: 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. ట్యూషన్‌ ఫీజు రూ.10,300.

బీఎల్‌ఐఎస్సీ: గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.5300.

ఎంకాం: బీకాం, బీబీఏ, బీబీఎం, బీఏ (కామర్స్‌) వీటిలో ఏదైనా కోర్సు చదివినవారు చేరవచ్చు. ఫీజు మొదటి సంవత్సరం రూ.7800, రెండో ఏడాది రూ.7500.

పీజీ డిప్లొమా: మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషనల్‌ మేనేజ్‌మెంట్‌. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.8000

అర్హత: ఏదైనా డిగ్రీ

డిప్లొమా: సైకలాజికల్‌ కౌన్సెలింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు, హ్యూమన్‌ రైట్స్, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం, ఉమెన్‌ స్టడీస్‌. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. 

అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌కు మాత్రం డిగ్రీ లేదా పీజీలో సైకాలజీ చదివుండాలి. 

సర్టిఫికెట్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్‌ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌. కోర్సుల వ్యవధి ఆరు నెలలు. కోర్సును బట్టి వీటిని పదోతరగతి, ఇంటర్, ఎలాంటి విద్యార్హతలు లేకుండా అందిస్తున్నారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 31.

వెబ్‌సైట్‌: https://www.braouonline.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-01-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.