• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దేశ రాజధానిలో టీచింగ్‌ ఉద్యోగాలు

547 ఖాళీల భర్తీకి ప్రకటన

 

 

దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. దిల్లీ సబార్డినేట్‌  సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) గ్రూప్‌ బీ, సీ విభాగాల్లో మొత్తం 547 ఖాళీలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా టీచింగ్, నాన్‌ టీచింగ్‌ కేటగిరీల్లో టీజీటీ, పీజీటీలతోపాటు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. 

 

డీఎస్‌ఎస్‌ఎస్‌బీ నుంచి వచ్చే ప్రకటనలకు ఏటా లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. బీఈడీ చదివిన వారికి ఇది చక్కటి అవకాశం. పరీక్షకు ఇంకా సమయం ఉన్నందున సరైన ప్రణాళికతో సన్నద్ధమైతే చక్కటి కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

 

విభాగాల వారీగా ఖాళీలు...

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) - 364

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ట్రైన్డ్‌ టీచర్‌ - 142

నాన్‌ టీచింగ్‌ - 41

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో... 

దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 27

పరీక్ష మాధ్యమం: ఇంగ్లిష్, హిందీ 

ఎంపిక: పోస్టును అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా...

 

అర్హత: టీజీటీ పోస్టులకు బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమాతో కూడిన బీఈడీ లేదా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రొఫెషనల్‌ డిప్లొమా ఉండాలి. పీజీటీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ ఉండాలి. ట్రైనింగ్‌/ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. ఏదైనా హైస్కూల్, కాలేజీలో మూడేళ్లు పనిచేసిన అనుభవం అవసరం. ఇతర ఖాళీలకు పోస్టును అనుసరించి అర్హతలు ఉండాలి.


ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు వస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత వేస్తారు.

 

ఎలా చదవాలి?

ఈ పరీక్షకు సిలబస్‌ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్‌లో రోజువారీ ముఖ్యాంశాల గురించి తెలుసుకుంటూనే విద్యాసంబంధిత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం ఆరునెలల కరెంట్‌ అఫైర్స్‌ చదవాలనేది నిపుణుల మాట. రీజనింగ్‌లో వెర్బల్, నాన్‌వెర్బల్‌ అంశాలకు సమప్రాధాన్యం ఉంటుంది. ఈ ప్రశ్నలు అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాలను లోతుగా పరీక్షించే విధంగా ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అభ్యర్థి నైపుణ్యాన్ని అంచనా వేస్తారు. వీటన్నింటితోపాటు అభ్యర్థి తాను ఎంచుకున్న సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పేపర్‌ ఏటా ముందు సంవత్సరం కంటే కష్టంగా ఇస్తారని ఒక భావన. అందువల్ల గత ప్రశ్నపత్రాలను చూసి, దానికంటే కఠినమైన స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. 

 

జనరల్‌ అవేర్‌నెస్‌లో ఎక్కువగా వార్తల్లో వ్యక్తులు, ప్రాంతాలు, ప్రదేశాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర ముఖ్యాంశాల గురించి తెలుసుకోవాలి. అలాగే జనరల్‌ స్టడీస్‌ కోసం భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, భూగోళశాస్త్రంలో ప్రాథమిక అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.  

 

భాషా పేపర్లలో మంచి మార్కులు సాధించేందుకు ఎక్కువగా చదవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పదసంపద పెరగడమే కాక, భాషతో పరిచయం పెరుగుతుంది. పరీక్షలో సులువుగా సమాధానాలు రాసే వీలుంటుంది. 

 

ఈ మొత్తం పరీక్షలో రీజనింగ్, అరిథ్‌మెటిక్‌ సెక్షన్లను స్కోరింగ్‌ విభాగాలుగా చెబుతారు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకు వీటితో ఇప్పటికే ఎంతోకొంత పరిచయం ఏర్పడి ఉంటుంది. మరింత సాధన చేయడం ద్వారా ఇందులో అధిక మార్కులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://dsssb.delhi.gov.in/home/Delhi-Subordinate-Services-Selection-Board
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Posted Date : 02-08-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌