• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీలు

30 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదలహైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న జోనల్‌ ఆఫీస్‌లు, ప్రాజెక్టు సైటుల్లో 30 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఈసీఈ/ ఈఈఈ/ మెకానికల్‌/ సీఎస్‌ఈ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదా పీజీ ఫస్ట్‌క్లాస్‌లో పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయటానికి అర్హులు. ఇంజినీరింగ్‌ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ధ్రువపత్రాల పరిశీలన నాటికి ఫస్ట్‌క్లాస్‌లో పాసై.. డిగ్రీ సర్టిఫికెట్‌/ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌/ కన్సాలిడేటెడ్‌ మార్క్‌షీట్‌ సమర్పించాలి. 


13.04.2024 నాటికి అభ్యర్థులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు. 


మొత్తం 30 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 15, ఈడబ్ల్యూఎస్‌లకు 2, ఓబీసీలకు 8 ఎస్సీలకు 4, ఎస్టీలకు 1  కేటాయించారు. ఈసీఈ బ్రాంచ్‌లో-05, ఈఈఈ-07, మెకానికల్‌-13, సీఎస్‌ఈ-05 ఉన్నాయి.   


రాతపరీక్ష, ఇంటర్వ్యూ

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:4 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 


రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు 85: 15 చొప్పున వెయిటేజీ ఉంటుంది.


ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలు గుర్తించాలి. 


ధ్రువపత్రాల పరిశీలన తర్వాత పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదికలను అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీకి తెలియజేస్తారు.  


పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా రాత పరీక్షను బెంగళూరు,  చెన్నై, హైదరాబాద్, ముంబయి/ నాగ్‌పుర్‌/ న్యూదిల్లీ/ నోయిడా/ కోల్‌కతా కేంద్రాల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మార్చడానికి అవకాశం ఉండదు. 


ఎంపిక చేసిన అభ్యర్థులను ట్రెయినీ ఆఫీసర్‌గా నియమిస్తారు. వేతన శ్రేణి రూ.40,000- రూ.1,40,000. సంస్థ నిబంధనల ప్రకారం డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర సదుపాయాలు, ప్రావిడెంట్‌ ఫండ్, సెలవులు ఉంటాయి. 


పర్సనల్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యే ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు రానూపోనూ స్లీపర్‌ క్లాస్‌ రైల్వే ఛార్జీలను చెల్లిస్తారు. 


తాజా ఉద్యోగ సమచారాన్ని అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులో రాసిన ఈమెయిల్‌ ఐడీకే తెలియజేస్తారు.


ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడ నుంచైనా విధులు నిర్వర్తించడానికి సిద్ధపడాలి. 


దరఖాస్తుకు చివరి తేదీ: 13.04.2024


వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Posted Date : 01-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌