• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గెయిల్‌లో కొలువులు 

ప్రభుత్వ రంగంలోని మహారత్న, సహజ వాయు సంస్థ అయిన గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ 277 పోస్టులను భర్తీ చేయబోతోంది. సీనియర్‌ ఆఫీసర్‌/ ఆఫీసర్‌ (సెక్యూరిటీ) పోస్టులకు అభ్యర్థులను పీఈటీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, సెక్యూరిటీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మెకానికల్, రెన్యూవబుల్‌ ఎనర్జీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: పోస్టును బట్టి సంబంధిత స్సెషలైజేషన్‌లో 65 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/ బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ మాస్టర్స్‌ డిగ్రీ/ పీజీ డిప్లొమా పాసవ్వాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 60 శాతం సాధించాలి.  

1. చీఫ్‌ మేనేజర్‌ (రెన్యూవబుల్‌ ఎనర్జీ): ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ కెమికల్‌ డిగ్రీ, కేంద్ర/రాష్ట్ర/ ప్రైవేటు సంస్థల్లో 12 ఏళ్ల అనుభవం ఉండాలి. విండ్‌/ సోలార్‌/ హైడ్రోజన్‌ విభాగాల్లో పనిచేయాలి. 

2. సీనియర్‌ ఇంజినీర్‌: ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్, ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి. 

3. సీనియర్‌ ఇంజినీర్‌ (కెమికల్‌): కెమికల్‌/ పెట్రోకెమికల్‌/ కెమికల్‌ టెక్నాలజీ/ పెట్రో కెమికల్‌ టెక్నాలజీ/ కెమికల్‌ టెక్నాలజీ అండ్‌ పాలిమర్‌ సైన్స్‌/ కెమికల్‌ టెక్నాలజీ అండ్‌ పబ్లిక్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, పెట్రోకెమికల్‌ ప్లాంట్‌/ హైడ్రోకార్బన్‌ రిఫైనరీ/ ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌ నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. 

4. సీనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌): మెకానికల్‌/ ప్రొడక్షన్‌/ ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌/ మాన్యుఫ్యాక్చరింగ్‌/ కెమికల్‌ అండ్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్‌ ప్లాంట్‌/ హైడ్రోకార్బన్‌ రిఫైనరీ/ ఫెర్టిటైజర్‌ ప్లాంట్‌ నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. 

5. సీనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఆయిల్, గ్యాస్‌ పైప్‌లైన్ల నిర్మాణం, నిర్వహణలో ఏడాది అనుభవం ఉండాలి. 

6. సీనియర్‌ ఇంజినీర్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ. 

7. సీనియర్‌ ఇంజినీర్‌ (గెయిల్‌టెల్‌ టీసీ/ టీఎం): ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు/ అండర్‌టేకింగ్స్‌/ భారీ ప్రైవేటు సంస్థలకు చెందిన ఫైర్‌ అండ్‌ సేఫ్టీ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌గా ఏడాది అనుభవం ఉండాలి. 

8. సీనియర్‌ ఇంజినీర్‌ (మెటలర్జీ): మెటలర్జీ/ మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ,  మెటలర్జీ/మెటలర్జీ అండ్‌ మినరల్స్‌ టెస్టింగ్‌/డ్యామేజ్‌ మెకానిజాన్ని గుర్తించడంలో ఏడాది అనుభవం ఉండాలి. 

9. సీనియర్‌ ఆఫీసర్‌ (ఫైర్‌ అండ్‌ సేఫ్టీ): ఫైర్‌/ ఫైర్‌ అండ్‌ సేఫ్టీలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ విభాగంలో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. 

10. సీనియర్‌ ఆఫీసర్‌ (సీఅండ్‌పీ): కెమికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెటలర్జీ/ సివిల్‌/ టెలి కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ,  కాంట్రాక్ట్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌/ మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌/ స్టోర్స్‌ అండ్‌ పర్చేస్‌ విభాగంలో ఏడాది అనుభవం. 

11. సీనియర్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌): ఇంజినీరింగ్‌ డిగ్రీ, మార్కెటింగ్‌/ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌/ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ/ ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంబీఏ డిగ్రీ. సంబంధిత విభాగంలో ఏడాది ఉద్యోగానుభవం ఉండాలి. 

12. సీనియర్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌అండ్‌ఏ): సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) లేదా 60 శాతం మార్కులతో బీకాం పాసవ్వాలి. లేదా ఎంబీఏ ఫైనాన్స్‌ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఏడాది అనుభవం.  

13. సీనియర్‌ ఆఫీసర్‌ (హెచ్‌ఆర్‌): డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ. 

14. ఆఫీసర్‌ (సెక్యూరిటీ): డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.సెక్యూరిటీ ఇన్‌స్టలేషన్స్, ఫైర్‌ఫైటింగ్‌/ ఫస్ట్‌ ఎయిడ్‌లో మూడేళ్ల అనుభవం. 

వయసు: 2.02.2023 నాటికి 28-45 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీలకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ముఖ్యాంశాలు:  

ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ కోర్సులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సీఏ/ సీఎంఏ కోర్సుకు మాత్రం మినహాయింపు. 

దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు.  

దరఖాస్తుకు చివరి తేదీ: 02.02.2023

వెబ్‌సైట్‌: https://gailonline.com/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్‌)

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (తెలంగాణ)

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఉన్నత విద్యకు ఉపకారవేతనం!

‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

Posted Date : 27-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌