• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 153 నాన్‌ టీచింగ్‌ ఖాళీలు 

దరఖాస్తుకు గడువు జులై 5

దేశంలోనే మొదటిది.. విస్తీర్ణంలో అతి పెద్దది అయిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - ఖరగ్‌పూర్‌.. 153 నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి.. ట్రేడ్‌టెస్ట్‌ లేదా ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 19, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ 5, జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌ 30, జూనియర్‌ ఇంజినీర్‌/ ఆర్కిటెక్ట్‌ 22, మెడికల్‌ ల్యాబొరేటర్‌ టెక్నీషియన్‌ (ఫిజియోథెరపీ) 1, స్టాఫ్‌నర్స్‌ 12, సీనియర్‌ ల్యాబొరేటర్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ 2, ఫిజికల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ 5, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (గ్రేడ్‌-2) 3, జూనియర్‌ అసిస్టెంట్‌ 20, జూనియర్‌ టెక్నీషియన్‌/ జూనియర్‌ ల్యాబొరేటర్‌ అసిస్టెంట్‌ 23, సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ 5, డ్రైవర్‌ (గ్రేడ్‌-2) 6 పోస్టులు ఉన్నాయి.  

1. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: డిగ్రీతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌.. ఆఫీసు పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎంఎస్‌-వర్డ్, ఎంఎస్‌-ఆఫీస్‌ పరిజ్ఞానం, ఫైల్స్, నోటింగ్, డ్రాఫ్టింగ్‌ తెలిసి ఉండాలి. 30 ఏళ్లు మించకూడదు. 

2. జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌: బీకాం/ బీబీఏ (ఫైనాన్స్‌)/ ఎంబీఏ (ఫైనాన్స్‌)తోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో, అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్, ట్యాలీ, ఎంఎస్‌-వర్డ్, ఎంఎస్‌-ఆఫీస్‌ తెలిసివుండాలి. ఫైల్స్‌ మెయింటెనెన్స్, నోటింగ్, డ్రాఫ్టింగ్‌ తెలియాలి. 

3. జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ లేదా తత్సమాన డిగ్రీ, మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, రిపేరింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్, వర్కషాప్‌/ ల్యాబొరేటరీ/ పరిశ్రమలోని పరికరాల నిర్వహణలో పరిజ్ఞానం, అనుభవం అవసరం.

4. జూనియర్‌ ఇంజినీర్‌/ జూనియర్‌ ఆర్కిటెక్ట్‌: ఇంజినీరింగ్‌/ ఆర్టిటెక్చర్‌ డిగ్రీతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌/ ఆర్టిటెక్చర్‌ డిప్లొమా, మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్, డిజైన్, ఎస్టిమేషన్, కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్‌ మెయింటెనెన్స్‌ అనుభవం అవసరం.  

5. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ (ఫిజియోథెరపీ): ఫిజియోథెరపీ డిగ్రీ, మూడేళ్ల అనుభవం ఉండాలి. 

6. స్టాఫ్‌ నర్స్‌: ఇంటర్మీడియట్‌/ 10+2/ తత్సమాన పరీక్షతో జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌-వైఫరీ పాసవ్వాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. 

7. సీనియర్‌ లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: లైబ్రరీ సైన్స్‌/ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ తత్సమాన డిగ్రీ పాసవ్వాలి. లైబ్రరీ/ విద్యాసంస్థల్లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ అప్లికేషన్‌లో ఏడాది సర్టిఫికెట్‌ కోర్సు చేసినవారికి ప్రాధాన్యం. 

8. ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ పాసవడంతోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. యూనివర్సిటీ/ రాష్ట్ర/ జాతీయ స్థాయిలో స్పోర్ట్స్, గేమ్స్‌/ స్విమ్మింగ్‌/ హాకీ/ జిమ్నాస్టిక్స్‌/ వాలీబాల్‌/ బ్యాడ్మింటన్‌/ వెయిట్‌ లిఫ్టింగ్‌/ టెన్నిస్‌/ టేబుల్‌ టెన్నిస్‌/ అథ్లెటిక్స్‌/ స్క్వాష్‌ ఆడించిన అనుభవం ఉండాలి.

9. అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గ్రేడ్‌-2: డిగ్రీతోపాటు మూడేళ్ల ఉద్యోగానుభవం అవసరం. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రాధాన్యమిస్తారు. లైట్‌ వెహికల్‌/మోటార్‌ సైకిల్‌ నడపడం, ఫైర్‌ అలారమ్స్‌ నిర్వహణ తెలియాలి. 

10. జూనియర్‌ అసిస్టెంట్‌: డిగ్రీతో పాటుగా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఎంఎస్‌-వర్డ్, ఎంఎస్‌-ఎక్సెల్‌ తెలియాలి. కంప్యూటర్‌ పైన నిమిషానికి 35 పదాలు టైప్‌ చేయగలగాలి. 

11. జూనియర్‌ టెక్నీషియన్‌/ జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌: బీఎస్సీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. వైర్‌మెన్‌ లైసెన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ పరిజ్ఞానం అవసరం.  

12. సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌: ఇంటర్మీడియట్‌/ 10+2 పాసవడంతోపాటు సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ప్రాధాన్యమిస్తారు. 

13. డ్రైవర్‌ గ్రేడ్‌-2: పదో తరగతి పాసవడంతోపాటు హెవీ, లైట్‌ వెహికల్‌ లైసెన్స్, మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా పదోతరగతి, ఐటీఐ (ఆటోమొబైల్‌/తత్సమానం)తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. 

1 నుంచి 9 పోస్టులకు 05.07.2023 నాటికి  గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. 10 నుంచి 13 పోస్టులకు గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలకు రూ.250. 

దరఖాస్తుకు చివరి తేదీ: 05.07.2023 

వెబ్‌సైట్‌: https://www.iitkgp.ac.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ‘నీట్‌’ చక్రవర్తి ప్రథమ ర్యాంకర్‌ అనుసరించిన వ్యూహం

‣ ఐటీబీపీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

Posted Date : 20-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.