• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐటీబీపీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 

81 హెచ్‌సీ(మిడ్‌వైఫ్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌) గ్రూప్‌ సి (నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ప్రాక్టికల్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

మొత్తం 81 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 34, ఓబీసీకి 22, ఎస్సీకి 12, ఎస్టీకి 06, ఈడబ్ల్యూఎస్‌కు 07 కేటాయించారు. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 10 శాతం ఖాళీలను రిజర్వు చేశారు. వీరు అందుబాటులో లేనట్లయితే ఈ పోస్టులకు నాన్‌-ఈఎస్‌ఎం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పదోతరగతి, ఆగ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం) కోర్సు పాసవ్వాలి. సెంట్రల్‌ లేదా స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ కావాలి. వయసు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 నుంచి 8 ఏళ్ల మినహాయింపు వర్తిస్తుంది. 

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)లో భాగంగా పరుగు, లాంగ్‌జంప్, హైజంప్‌ నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రతిదాంట్లోనూ అర్హత సాధించాలి. 800 మీటర్ల పరుగును 4 నిమిషాల 45 సెకన్లలో ముగించాలి. 9 అడుగుల లాంగ్‌జంప్, 3 అడుగుల హైజంప్‌లను మూడు ప్రయత్నాల్లో సాధించాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనికి మార్కులు ఉండవు. దీంట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించినవారిని ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ)కు ఎంపికచేసి శారీరక కొలతలు తీసుకుంటారు. అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 147.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. వయసు, ఎత్తులకు తగినంత బరువు ఉండాలి. దీంట్లో అర్హత సాధించినవారిని రాత పరీక్షకు ఎంపికచేస్తారు. 

పీఈటీ సమయంలో గర్భం ధరించిన మహిళలకు ప్రసవానంతరం ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రసవమైన ఆరు వారాల తర్వాత వీరు వైద్యులు జారీచేసిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. 

రాత పరీక్ష 

ఈ పరీక్ష తేదీ, ప్రదేశాలను తెలియజేస్తూ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిట్‌ కార్టులను జారీచేస్తారు. వీటిని ఐటీబీపీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను ఓఎంఆర్, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌... ఈ రెండింటిలో ఏ విధానంలో నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తారు. ప్రశ్నపత్రంలో 5 భాగాలుంటాయి. 1) జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ రీజనింగ్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 2) జనరల్‌ అవేర్‌నెస్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 3) న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 4) ఇంగ్లిష్‌/హిందీ కాంప్రహెన్షన్‌ - 10 ప్రశ్నలు, 10 మార్కులు. 5) ట్రేడ్‌/ప్రొఫెషన్‌ రిలేటెడ్‌- 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి. 

ట్రేడ్‌/ ప్రొఫెషనల్‌ రిలేటెడ్‌ సబ్జెక్టుల సిలబస్‌లో.. 1) కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, 2) ప్రైమరీ హెల్త్‌కేర్‌ నర్సింగ్‌ 3) చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌ 4) మిడ్‌వైఫరీ 5) కమ్యూనిటీ హెల్త్‌ అండ్‌ హెల్త్‌ సెంటర్‌ మేనేజ్‌మెంట్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. రాత పరీక్షలో అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. దీంట్లో అర్హత పొందినవారి డాక్యుమెంట్స్‌ తనిఖీ చేసి.. ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌కు పంపిస్తారు. 

ప్రాక్టికల్‌ ఎగ్జామినేషన్‌: దీన్ని ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహిస్తారు. దీంట్లో వైవాకు 40, ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఐడెంటిఫికేషన్‌కు 30, ప్రొసీజర్స్‌కు 30.. మొత్తం 100 మార్కులు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ను తయారుచేస్తారు. తర్వాత మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు.  

దరఖాస్తు గడువు: 08.07.2023

వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

‣ విదేశీ విద్యకు ఉపకార వేతనాలు

‣ బెల్‌లో 205 ఇంజినీర్‌ కొలువులు

‣ ఇంటర్‌ కోర్సు వివరాలివిగో..

‣ వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు

Posted Date : 20-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.