• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు 

అర్హత: డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దేహ్రాదూన్‌లోని మినీరత్న సంస్థ.. తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీఐఎల్‌) జూనియర్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఈ పరీక్షను నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) సహకారంతో టీహెచ్‌డీసీఐఎల్‌ నిర్వహిస్తోంది. 

బ్యాక్‌లాక్, ప్రస్తుత ఖాళీలు కలిపి.. జూనియర్‌ ఇంజినీర్‌ ట్రెయినీ (సివిల్‌) 72, జూనియర్‌ ఇంజినీర్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) 72, జూనియర్‌ ఇంజినీర్‌ ట్రెయినీ (మెకానికల్‌) 37 మొత్తం 181 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో మూడేళ్ల ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ డిప్లొమా/ లేటరల్‌ ఎంట్రీ డిప్లొమా/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులు డిప్లొమా పాసైతే సరిపోతుంది. 

ఎంపిక ఎలా?

అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలో 3 పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-1లో సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించిన 140 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి 30, పార్ట్‌-3లో రీజనింగ్‌ సంబంధిత 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటరాక్షన్‌/ వైవాకు ఎంపికచేస్తారు. 

రాత పరీక్ష, ఇంటరాక్షన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిబంధనల్లో ప్రత్యేక వర్గాలవారికి ఎలాంటి సడలింపూ ఉండదు. టీహెచ్‌డీసీ వెబ్‌సైట్‌లోని కెరియర్‌ సెక్షన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 

ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణ అందిస్తారు.. శిక్షణలో మూలవేతనం, డీఏ, ఇతర ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు. లీవ్, మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ సదుపాయం, ప్రావిడెంట్‌ ఫండ్, పెన్షన్, గ్రాడ్యుటీ మొదలైనవి ఉంటాయి. ఉద్యోగం రెగ్యులర్‌ అయిన తర్వాత.. వీటితోపాటుగా కంపెనీ క్వార్టర్స్‌/ హెచ్‌ఆర్‌ఏ, మంత్లీ కన్వియన్స్‌ ఎక్స్‌పెండిచర్‌ రీఇంబర్స్‌మెంట్, మొబైల్‌ సదుపాయాలు ఉంటాయి. 

శిక్షణలో భాగంగా.. వివిధ యూనిట్లు/ ప్రాజెక్టులు/ కార్పొరేషన్‌కు చెందిన ఆఫీసులకు హాజరుకావాలి. అభ్యర్థి పనితీరు ఆశించిన తీరులో లేనట్లయితే శిక్షణకాలాన్ని పెంచే అవకాశం ఉంటుంది. 

గమనించాల్సినవి..

అభ్యర్థులు తమ పేరును ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌లో తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాలి. 

ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ డిప్లొమాలేని అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అనర్హులు. 

కరస్పాండెన్స్‌/ డిస్టెన్స్‌ విధానంలో చేసిన ఇంజినీరింగ్‌ డిప్లొమాను పరిగణనలోకి తీసుకోరు. 

ముఖ్యాంశాలు

07.06.2023 నాటికి గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు రుసుము రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023

పరీక్ష కేంద్రాలు: దెహ్రాదూన్, హల్ద్‌వని, హరిద్వార్, రూర్కీ, ఆగ్రా, అలీఘర్, గ్రేటర్‌ నోయిడా, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, వారణాసి, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గ్యాంగ్‌టక్, గువహటి, జమ్మూ, కోల్‌కతా, ముంబయి, రాంచీ 

వెబ్‌సైట్‌: https://www.thdc.co.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ విదేశీ విద్యకు ఉపకార వేతనాలు

‣ బెల్‌లో 205 ఇంజినీర్‌ కొలువులు

‣ ఇంటర్‌ కోర్సు వివరాలివిగో..

‣ వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు

Posted Date : 17-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.