• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బెల్‌లో 205 ఇంజినీర్‌ కొలువులు 

అర్హత: బీఎస్సీ, బీఈ, బీటెక్‌

బెంగళూరులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం 205 పోస్టుల్లో ట్రెయినీ ఇంజినీర్‌వే 191 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 67, ఈడబ్ల్యూఎస్‌కు 27, ఓబీసీకి 57, ఎస్సీకి 24, ఎస్టీకి 16 కేటాయించారు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు 14 ఉంటే.. అన్‌రిజర్వుడ్‌కు 3, ఈడబ్ల్యూఎస్‌కు 7, ఓబీసీకి 3, ఎస్సీకి 1 ఉన్నాయి. 

1) ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజినీరింగ్‌ బీఎస్సీ/ బీఈ/బీటెక్‌ పాసవ్వాలి. 28 ఏళ్లు మించకూడదు. 

2) ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజినీరింగ్‌ బీఎస్సీ/ బీఈ/ బీటెక్‌ పాసవ్వాలి. వయసు 32 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. 

ప్రాజెక్టు ఇంజినీర్లను మొదట్లో మూడేళ్ల కాలానికి తీసుకున్నప్పటికీ ప్రాజెక్టు అవసరాలను, వ్యక్తిగత నైపుణ్యాన్నీ బట్టి మరో ఏడాది పొడిగిస్తారు. మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000 వేతనంగా చెల్లిస్తారు. 

ట్రెయినీ ఇంజినీర్లను రెండేళ్ల కాలానికి తీసుకున్నప్పటికీ మరో ఏడాది పొడిగిస్తారు. వీరికి మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది రూ.35,000, మూడో ఏడాది రూ.40,000 చెల్లిస్తారు. ఈ వేతనానికి అదనంగా మెడికల్, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం, యూనిఫామ్స్, స్టిచింగ్‌ ఛార్జెస్, ఫుట్‌వేర్‌ అలవెన్స్‌ కింద ఏడాదికి రూ.12,000 చెల్లిస్తారు. గతంలో మూడేళ్లు ట్రెయినీ ఇంజినీర్‌గా బెల్‌లో పనిచేసి.. ప్రాజెక్టు ఇంజినీర్‌గా ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.45,000 చెల్లిస్తారు. రెండో ఏడాది రూ.50,000, మూడో ఏడాది రూ.55,000 చెల్లిస్తారు. 

జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. ఎస్సీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు పాసయితే సరిపోతుంది. వార్షిక పరీక్షలు పాసైన తర్వాత పొందిన ఉద్యోగానుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. కోర్సులో భాగంగా పొందిన పని అనుభవాన్ని లెక్కలోకి తీసుకోరు. ఉద్యోగం చేస్తోన్న అభ్యర్థులు.. గతంలో చేసిన ఉద్యోగం, పనిచేసిన కాలానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.

ఎంపిక ఎలా?

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన అర్హతలున్న అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపికచేస్తారు. దీనికి 85 మార్కులు ఉంటాయి. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు జరిపే రాత పరీక్షలో.. జనరల్‌ ఎబిలిటీ, సబ్జెక్టుకు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి రెండున్నర గంటలు. ట్రెయినీ ఇంజినీర్‌ పరీక్షలో జనరల్‌ ఇంగ్లిష్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అండ్‌ రీజనింగ్, టెక్నికల్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి రెండున్నర గంటలు. దీంట్లో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. దీనికి 15 మార్కులు ఉంటాయి. 

1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులు 35 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలను బెంగళూరులో నిర్వహిస్తారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు.. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుకు రూ.472. ట్రెయినీ ఇంజినీర్‌కు రూ.177. 

దరఖాస్తుకు చివరి తేదీ: 24.06.2023

వెబ్‌సైట్‌: https://bel-india.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌ కోర్సు వివరాలివిగో..

‣ వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు

‣ బెస్ట్‌ కెరియర్.. బ్యాంకింగ్‌ టెక్నాలజీ

‣ జనరేషన్‌ ‘జడ్‌’ జాబ్స్‌తో నయా ట్రెండ్‌!

‣ ’జీఆర్‌ఈ’లో ముఖ్య మార్పులివే..

‣ ఆన్‌లైన్‌లో ముఖ్యం.. పాజిటివిటీ

Posted Date : 14-06-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌