• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫ్రెషర్లకు పెరిగిన డిమాండ్‌

ఈమధ్య జాబ్‌ మార్కెట్‌ అంతగా ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. కొత్తగా చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ తాజా నివేదికల ప్రకారం ఈ పరిస్థితిలో కాస్త మార్పులు వచ్చాయి. వీటి ప్రకారం.. రిటెయిల్, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, ఇతర రంగాల్లో తాజాగా కోర్సులు పూర్తిచేసినవారిని తీసుకుంటున్నారు. 


  ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ టీమ్‌లీజ్‌.. తన తాజా ‘కెరియర్‌ ఔట్‌లుక్‌’ నివేదికలో ఈ వివరాలు తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకునే ట్రెండ్‌ దాదాపు 6 శాతం పెరిగినట్లుగా ఇందులో ఉంది. మొత్తంగా అన్ని రంగాల్లో ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం 79.3 శాతానికి పెరిగింది. ఈ విషయానికి సంబంధించి ఈ-కామర్స్‌ - టెక్నాలజీ స్టార్టప్స్‌ (55 శాతం), ఇంజినీరింగ్‌ - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (53 శాతం), టెలి కమ్యూనికేషన్స్‌ (50 శాతం) రంగాల్లో కాస్త పెరుగుదల కనిపించింది. నగరాల విషయం చూస్తే.. ఇలాంటి అవకాశాలు అందించడంలో బెంగళూరు 69 శాతం వాటాతో ముందంజలో ఉంది. తర్వాతి స్థానాల్లో ముంబయి (58 శాతం), చెన్నై (51 శాతం), దిల్లీ (45 శాతం) ఉన్నాయి. కొత్తగా వచ్చేవారికి కంపెనీల్లో డిమాండ్‌ ప్రస్తుతం 68 శాతం వద్ద ఉంది. ఇది గతం కంటే 3 శాతం అధికం.


ఈ నివేదికలో మరో ముఖ్యమైన విషయం- ఫ్రెషర్లు ఉద్యోగావకాశాల్లో జెన్‌ఏఐ ప్రభావం. ఇది హ్యూమన్‌-ఏఐ అనుబంధంతో మరింతగా పరిణామం చెందుతోందన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తించింది. దీనిద్వారా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్, టెక్నికల్‌ రైటర్స్, లీగల్‌ అసిస్టెంట్స్, మార్కెట్‌ రిసెర్చ్‌ అనలిస్ట్, గ్రాఫిక్‌ డిజైనర్స్‌ వంటి ఉద్యోగాలు ప్రభావితం కాబోతున్నాయి. మొత్తంగా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొంతకాలంగా మార్కెట్‌ పరిస్థితి బాగుండక తగ్గిన నియామకాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్‌ స్థిరంగా నిలబడటం, ఇక్కడి వారి ప్రతిభపై కంపెనీలకు నమ్మకం కుదరడం కూడా ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. మరో నాలుగైదు నెలల వరకూ ఈ ట్రెండ్‌ ఇదే విధంగా కొనసాగవచ్చని వారి అంచనా. అందువల్ల ఈలోగా అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటే అనుకున్న కొలువులు సాధించవచ్చు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎస్‌ఐ కొలువులకు మీరు సిద్ధమేనా?

‣ మాంగనీస్‌ ఓర్‌ ఇండియాలో ట్రెయినీలు  

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date : 11-03-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌