• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నవోదయలో 1,377 నాన్‌టీచింగ్‌ పోస్టులు

పరీక్ష సరళి, సిలిబస్‌ వివరాలు



నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) 1,377 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉత్తీర్ణులైనవారిని కేంద్ర, ప్రాంతీయ ఎన్‌వీఎస్‌ కార్యాలయాల్లో నియమిస్తారు. 


పోస్టును బట్టి నియామక పోటీ పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌లలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. పోస్టులు.. వాటి సంఖ్య.. ఇతర వివరాలు చూద్దాం.


1. ఫిమేల్‌ స్టాఫ్‌నర్స్‌ - 121: బీఎస్సీ (ఆనర్స్‌) ఇన్‌ నర్సింగ్‌ లేదా బీఎస్సీ నర్సింగ్‌ లేదా పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌. స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. 50 పడకల ఆసుపత్రిలో రెండున్నర ఏళ్లు పనిచేసిన అనుభవం అవసరం. హిందీ/ ప్రాంతీయ భాష, ఇంగ్లిష్‌లను అర్థం చేసుకుని పనిచేయగలగాలి.  


2. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ - 5: డిగ్రీ పాసవ్వాలి. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్‌ విషయాల్లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి. 


3. ఆడిట్‌ అసిస్టెంట్‌ - 12: బీకాం పాసై.. మూడేళ్ల అకౌంట్స్‌ అనుభవం అవసరం. 


4. జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ - 4: హిందీలో మాస్టర్స్‌ డిగ్రీ.. ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలి. లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్‌ డిగ్రీ.. హిందీ తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలి. ఏ సబ్జెక్టుతోనైనా హిందీ మాధ్యమంలో పీజీ చేయాలి, ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. 


5. లీగల్‌ అసిస్టెంట్‌ - 1: లా డిగ్రీ పాసై.. లీగల్‌ కేసుల నిర్వహణలో మూడేళ్ల అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రావీణ్యం అవసరం. వయసు 23 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 


6. స్టెనోగ్రాఫర్‌ - 23: ఇంటర్మీడియట్‌ పాసై నిమిషానికి 80 పదాల వేగంతో డిక్టేషన్‌ తీసుకుని.. దాన్ని కంప్యూటర్‌ పైన ఇంగ్లిష్‌లో 50 నిమిషాలు, హిందీలో 65 నిమిషాల్లో ట్రాన్‌స్క్రిప్ట్‌ చేయగలగాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. 


7. కంప్యూటర్‌ ఆపరేటర్‌ - 2: బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) పాసవ్వాలి. లేదా బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ) పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. 


8. కేటరింగ్‌ సూపర్‌వైజర్‌ - 78: హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 35 ఏళ్లు. లేదా కేటరింగ్‌లో ట్రేడ్‌ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్‌ ఉండి పదేళ్ల అనుభవం అవసరం (ఈ అవకాశం ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మాత్రమే)


9. జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్‌ - 381: ఇంటర్మీడియట్‌ పాసై.. టైపింగ్‌ వేగం ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు లేదా హిందీలో 25 పదాలు ఉండాలి. లేదా సెక్రటేరియల్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ ఒకేషనల్‌ సబ్జెక్టులుగా స్టేట్‌ బోర్డ్‌ ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. 6 నెలల కంప్యూటర్‌ డిప్లొమా కోర్సు చేసి, అకౌంట్స్‌/ అడ్మినిస్ట్రేటివ్‌ విషయాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు. 


10. ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌ - 128: పదో తరగతి పాసై, ఎలక్ట్రీషియన్‌/ వైర్‌మేన్‌ ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండి.. ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టలేషన్‌/ వైరింగ్‌/ ప్లంబింగ్‌లో రెండేళ్ల అనుభవం అవసరం.. 


11. ల్యాబ్‌ అటెండెంట్‌ - 161: పదో తరగతి పాసై ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా ఉండాలి. లేదా సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30 ఏళ్లు. 


12. మెస్‌ హెల్పర్‌ - 442: పదో తరగతి పాసై, ఐదేళ్లు స్కూల్‌ మెస్‌లో పనిచేసిన అనుభవం అవసరం. నవోదయ విద్యా సమితి నిర్వహించే స్కిల్‌ టెస్ట్‌ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30. 


13. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ - 19: పదో తరగతి పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. 


పరీక్ష ఎలా ఉంటుంది?

స్టాఫ్‌నర్స్‌: ప్రశ్నపత్రంలో 4 పార్ట్‌లు ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు. పార్ట్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలు - 15 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 15 ప్రశ్నలు - 15 మార్కులు. పార్ట్‌-3లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ (జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ హిందీ ప్రతి సబ్జెక్టుకు 10 మార్కుల చొప్పున) 20 ప్రశ్నలకు - 20 మార్కులు. పార్ట్‌-4లో సబ్జెక్టు నాలెడ్జ్‌ 70 ప్రశ్నలకు - 70 మార్కులు.  


జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: స్టేజ్‌-1లో కాంపిటిటివ్‌ పరీక్ష, స్టేజ్‌-2లో టైపింగ్‌ టెస్ట్‌ ఉంటాయి. ప్రశ్నపత్రంలో 5 పార్టులు. పార్ట్‌-1లో మెంటల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 20 ప్రశ్నలకు 20 మార్కులు. పార్ట్‌-2లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలకు-20 మార్కులు. పార్ట్‌-3లో జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 30 ప్రశ్నలకు - 30 మార్కులు. పార్ట్‌-4లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ 30 ప్రశ్నలకు - 30 మార్కులు. పార్ట్‌-5లో బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ ఆపరేషన్‌ 30 ప్రశ్నలకు- 30 మార్కులు. మొత్తం 130 ప్రశ్నలకు - 130 మార్కులు.  


ల్యాబ్‌ అటెండెంట్‌: ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. పార్ట్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-3లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ 30 ప్రశ్నలకు 30 మార్కులు. పార్ట్‌-4లో సబ్జెక్ట్‌ స్పెసిఫిక్‌ నాలెడ్జ్‌ 60 ప్రశ్నలకు 60 మార్కులు.  


మెస్‌ హెల్పర్‌: ప్రశ్నపత్రంలో 4 పార్టులు. పార్ట్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్‌-3లో లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ 20 ప్రశ్నలకు 20 మార్కులు. పార్ట్‌-4లో సబ్జెక్ట్‌ స్పెసిఫిక్‌ నాలెడ్జ్‌ (ఫుడ్, న్యూట్రిషన్, హైజీన్, ఇండియన్‌ ఫుడ్‌ అండ్‌ స్వీట్స్‌ రెసిపీస్‌) 70 ప్రశ్నలకు 70 మార్కులు. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు. 


పై నాలుగు పరీక్షలకు వ్యవధి 2.5 గంటలు.


మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌: ప్రశ్నపత్రంలో మూడు పార్టులు ఉంటాయి  పార్ట్‌-1లో లాంగ్వేజ్‌ టెస్ట్‌ 40 ప్రశ్నలు, 40 మార్కులు. పార్ట్‌-2లో జనరల్‌ అవేర్‌నెస్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ 20 ప్రశ్నలు, 20 మార్కులు, పార్ట్‌-3లో బేసిక్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ ఆపరేషన్‌ 40 ప్రశ్నలు 40 మార్కులు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. వ్యవధి 2 గంటలు.  


వయసు: పోస్టును బట్టి వయః పరిమితిలో తేడాలు ఉన్నాయి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది. 


దరఖాస్తు ఫీజు: స్టాఫ్‌నర్స్‌ పోస్టుకు జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు రూ.1500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీలకు రూ.500. మిగతా అన్ని పోస్టులకూ జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీలకు రూ.500. 


పరీక్ష కేంద్రాలు..

ఆంధ్రప్రదేశ్‌లో: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం. 

తెలంగాణలో: హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌. 


దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2024


వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/nvs/en/Home1
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Posted Date : 03-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌