• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎల్‌ఐసీ హౌసింగ్‌లో కొలువులు   

80 ఖాళీల భర్తీకి ప్రకటన  

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగాల భర్తీ చేయబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని శాఖల్లో అసిస్టెంట్‌/ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్తుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి! ప్రకటించిన ఖాళీలు మొత్తం 80. అసిస్టెంట్‌ పోస్టులు 50, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు 30. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో 10 అసిస్టెంట్‌ పోస్టులున్నాయి. దేశవ్యాప్తంగా 30 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులున్నాయి. 

అసిస్టెంట్‌: అభ్యర్థులను రీజియన్లవారీగా చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు. ఒకరు ఒక రీజియన్‌ నుంచి మాత్రమే దరఖాస్తు చేయాలి. అభ్యర్థి ఎంచుకున్న రీజియన్‌ నుంచే ఆన్‌లైన పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాలి. 

అసిస్టెంట్‌ మేనేజర్‌: దేశవ్యాప్తంగా చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టుకు ఎంపికచేస్తారు. ఈ పోస్టులను రెండు కేటగిరీల్లో భర్తీ చేస్తారు. డిస్ట్రిక్ట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినవారి నుంచి కొందరినీ, ఓపెన్‌ మార్కెట్‌ విధానంలో మరికొందరినీ ఎంపికచేస్తారు. ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఎక్కడైనా నియమించవచ్చు. 

అర్హత: అసిస్టెంట్‌ పోస్టుకు ఏదైనా డిగ్రీ 55 శాతం మార్కులతో పాసైనవారు అర్హులు.  

అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసవ్వాలి. లేదా ఏదైనా పీజీ చేసినవాళ్లు అర్హులు. కరస్పాండెన్స్‌/డిస్టెన్స్‌/పార్ట్‌టైమ్‌ విధానంలో చదివినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.డీఎంఈ కేటగిరీ కింద దరఖాస్తుచేసేవాళ్లు ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులతో పాసైనవాళ్లు లేదా పీజీ చేసినవాళ్లు అర్హులు.  మార్కెటింగ్‌/ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసినవాళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. డిస్ట్రిక్ట్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా మూడేళ్ల పని అనుభవం ఉన్నవారికీ ప్రాధాన్యం ఉంటుంది. 

రెండు పోస్టులకూ కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. 

వయఃపరిమితి: 01.01.22 నాటికి వయసు 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు అదర్స్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేసిన అభ్యర్థుల వయసు 21-28 సంవత్సరాలు ఉండాలి. డీఎంఈ కేటగిరీలో దరఖాస్తు చేసిన అభ్యర్థుల వయసు 21-40 సంవత్సరాలు ఉండాలి. 

జీతభత్యాలు: అసిస్టెంట్‌కు మూల వేతనం నెలకు రూ.22,730 ఉంటుంది. అన్నీ కలిపి రూ.33,960 వరకు అందుకోవచ్చు. పీఎఫ్, మెడిక్లెయిమ్, గ్రాట్యుటీ, ఎల్‌టీసీ, గ్రూప్‌ ఇన్సూరెన్స్, హౌసింగ్‌ లోన్, ఇతర ప్రోత్సాహకాలనూ పొందొచ్చు. 

అసిస్టెంట్‌ మేనేజర్‌కు మూలవేతనం రూ.53,620, ఇతర ప్రోత్సాహకాలన్నీ కలిపి నెలకు రూ.80,110 అందుతుంది. 

ఎంపిక: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ పరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో నాలుగు విభాగాల్లో ఉంటుంది. 

1. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: 50 ప్రశ్నలకు 50 మార్కులు. సమయం 35 నిమిషాలు.

2. లాజికల్‌ రీజనింగ్‌: 50 ప్రశ్నలకు 50 మార్కులు. సమయం 35 నిమిషాలు. 

3. జనరల్‌ అవేర్‌నెస్‌: దీంట్లో ప్రత్యేకంగా హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగానికి చెందిన ప్రశ్నలు వస్తాయి. 50 ప్రశ్నలు, 50 మార్కులు. సమయం 15 నిమిషాలు. 

4. న్యూమరికల్‌ ఎబిలిటీ (అసిస్టెంట్‌): 50 ప్రశ్నలు, 50 మార్కులు. సమయం 35 నిమిషాలు. 

5. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (అసిస్టెంట్‌ మేనేజర్‌): 50 ప్రశ్నలు, 50 మార్కులు. సమయం 35 నిమిషాలు. 

మొత్తం: 200 ప్రశ్నలకు 200 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. 

ఆన్‌లైన్‌ పరీక్ష ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను తగ్గిస్తారు. 

ఇంటర్వ్యూ: ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లతో అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. దీంట్లో కనీసార్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఎంపికైన అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ మేనేజర్లకు 6 నెలల ప్రొబేషనరీ సమయం ఉంటుది. అయితే అసిస్టెంట్‌ మేనేజర్లకు ఆ సమయంలో రూ.25,000 వేతనం ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.800. ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.08.2022

ఆన్‌లైన్‌ పరీక్ష: అసిస్టెంట్, అసిస్టెంట్‌ మేనేజర్‌ రెండు పోస్టులకూ సెప్టెంబరు-అక్టోబరు 2022లో ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షకు 7-14 రోజుల ముందుగా కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దీంట్లో ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం అడ్రస్‌ మొదలైన వివరాలన్నీ ఉంటాయి. 

వెబ్‌సైట్‌: https://www.lichousing.com/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?

‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్‌ టాప్‌!

‣ ఆర్మీలో 191 టెక్నికల్‌ పోస్టులు

‣ సన్నద్ధతకు తుది మెరుగులు!

‣ ఒత్తిడిని వదిలించుకోవచ్చు!

‣ మీడియాలో ప్రవేశానికి కొన్ని కోర్సులు

Posted Date : 13-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌