• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌ఎల్‌సీలో పారామెడికల్‌ పోస్టులు 

జూన్‌ 1 దరఖాస్తుకు గడువు

నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది పోస్టుల భర్తీకి నవరత్న సంస్థ నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్‌ ప్రకటన విడుదల చేసింది. ఎంపికైనవారిని తమిళనాడులోని నైవేలిలో ఉన్న 350 పడకల జనరల్‌ హాస్పిటల్‌లో నియమిస్తారు. అభ్యర్థులను ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కింద మూడేళ్ల కాలానికి విధుల్లోకి తీసుకుంటారు.  

ప్రకటించిన 103 ఖాళీల్లో మేల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్, ఫిమేల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్‌ మొదలైనవి ఉన్నాయి. పోస్టులను అనుసరించి అర్హతల్లో తేడాలు ఉంటాయి. 

1. మేల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: 36 పోస్టులు. పదో తరగతి లేదా సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. నర్సింగ్‌ అసిస్టెంట్‌/ మల్టీపర్పస్‌ హాస్పిటల్‌ వర్కర్‌గా ఏడాది వ్యవధి ఉన్న పారామెడికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలి. 

2. ఫిమేల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: 22 పోస్టులు. మేల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఉన్న అర్హతలే వర్తిస్తాయి. 

3. మెటర్నిటీ అసిస్టెంట్‌: 5 పోస్టులు. ఇంటర్మీడియట్‌ పాసై రెండేళ్ల ఆగ్జిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేయాలి. లేదా డిప్లొమా ఇన్‌ జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ చేయాలి. నర్సెస్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. 

4. పంచకర్మ (ఆయుర్వేద) అసిస్టెంట్‌: 4 పోస్టులు. ఏడాది/రెండేళ్ల వ్యవధి ఉండే పంచకర్మ థెరపీ కోర్సు పాసవ్వాలి. లేదా రెండేళ్లు అంతకంటే ఎక్కువ వ్యవధి ఉన్న పంచకర్మ థెరపీ డిప్లొమా పాసవ్వాలి.  

5. రేడియోగ్రాఫర్‌: 3 పోస్టులు. రేడియోలజీ అండ్‌ ఇమేజింగ్‌ సైన్స్‌ టెక్నాలజీ/ మెడికల్‌ రేడియోలజీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ/ రేడియోలజీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ/ మెడికల్‌ టెక్నాలజీ (రేడియోలజీ అండ్‌ అండ్‌ ఇమేజింగ్‌)/రేడియోగ్రఫీలో బీఎస్సీ పాసవ్వాలి.

6. ల్యాబ్‌ టెక్నీషియన్‌: 4 పోస్టులు. బీఎస్సీ ఎంఎల్‌టీ పాసవ్వాలి. 

7. డయాలసిస్‌ టెక్నీషియన్‌: 2 పోస్టులు. డయాలసిస్‌ టెక్నాలజీ/రీనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ/డయాలసిస్‌ థెరపీ/బి.వొకేషనల్‌ (రీనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ)లో బీఎస్సీ పాసవ్వాలి. 

8. ఎమర్జెన్సీ కేర్‌ టెక్నీషియన్‌: 5 పోస్టులు. ఎమర్జెన్సీ కేర్‌ టెక్నాలజీ/ ఎమర్జెన్సీ మెడిసిన్‌ టెక్నాలజీ/యాక్సిడెంట్‌ అండ్‌ ఎమర్జెన్సీ కేర్‌ టెక్నాలజీ/క్రిటికల్‌ కేర్‌ టెక్నాలజీలో బీఎస్సీ పాసవ్వాలి. 

9. ఫిజియోథెరపిస్ట్‌: 2 పోస్టులు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)/ మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) పాసవ్వాలి. 

10. నర్సులు: 20 పోస్టులు. బీఎస్సీ నర్సింగ్‌/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ అండ్‌ డీజీఎన్‌ఎం పాసవ్వాలి. స్టేట్‌/ ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. 

ప్రభుత్వ/ ప్రైవేటు హాస్పిటళ్లు, ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో పనిచేసి.. పదవీ విరమణ చేసిన నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రాంతీయ/ స్థానిక భాష తెలిసి ఉండాలి. స్థానిక భాష అయిన తమిళాన్ని పదోతరగతి/ మెట్రిక్యులేషన్‌లో ఒక సబ్జెక్టుగా చదివినట్టుగా సర్టిఫికెట్‌ సమర్పించాలి. అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు. ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. 

ఎంపిక ఎలా?

రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ఆబ్జెక్టివ్‌ విధానంలోని ప్రశ్నలు అభ్యర్థుల సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. రాత పరీక్షలో పాసవ్వాలంటే అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సంపాదిస్తే సరిపోతుంది. ప్రాథమిక దశలో ఎంపికైన అభ్యర్థులు ప్రీ ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ పరీక్షకు హాజరుకావాలి.

ఎంపికైనవారికి నెల వేతనంతోపాటు ప్రావిడెంట్‌ ఫండ్‌/ గ్రాట్యుటీ, వైద్య సదుపాయాలు, లీవ్‌లు, ఆఫీస్‌ టూర్లకు వెళ్లినప్పుడు టీఏ/ డీఏ, బోర్డింగ్‌ ఛార్జీలు, వసతి సదుపాయం లేదా హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్‌ చెల్లిస్తారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 01.06.2023

ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రతి పోస్టుకూ ప్రత్యేకంగా దరఖాస్తు నింపాలి. అవసరమైన సర్టిఫికెట్లనూ వేర్వేరుగా అప్‌లోడ్‌ చేయాలి. ప్రతి పోస్టుకూ దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 

దరఖాస్తు ఫీజు రూ.486. 

ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. కానీ వీరు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.236 చెల్లించాలి. 

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/new_website/index.htm

సన్నద్ధత

రాత పరీక్షలోని ప్రశ్నలు అభ్యర్థుల సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. కాబట్టి సిలబస్‌లోని అంశాలపై స్పష్టత ఉండాలి. ముందుగా ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. 

రుణాత్మక మార్కులు లేవు. కాబట్టి ఏ ప్రశ్ననూ వదలకుండా సమాధానాలు రాయాలి. 

తెలిసిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలను గురిస్తే.. తెలియని వాటికి చివరలో కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించొచ్చు. 

ప్రాధాన్యమున్న అంశాలను బాగా చదువుకోవాలి. 

పాత ప్రశ్నపత్రాలను పూర్తిచేయడం వల్ల సన్నద్ధతపైన స్పష్టత వస్తుంది. ఏయే అంశాల్లో మెరుగ్గా ఉన్నారో, వేటిల్లో బలహీనంగా ఉన్నారో సమీక్షించుకునే దాని ప్రకారం చదివితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.     

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో అత్యున్నత హోదా

‣ ఇంటర్‌తో 1600 కేంద్ర కొలువులు

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు తుది సన్నద్ధత

‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్‌

‣ ఇంటర్‌తో ఉపాధ్యాయ విద్య.. డీఎడ్‌

Posted Date : 26-05-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌