• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బయో టెక్నాలజీలో పీజీ

63 విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జీఏటీ-బీ   

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో జరిగే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌- బయోటెక్నాలజీ (జీఏటీ-బీ) ప్రకటన వెలువడింది. జాతీయస్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా వివిధ బయోటెక్నాలజీ పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు పొందొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

జీఏటీ-బీ 2022కు హాజరయ్యే అభ్యర్థులు సైన్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోన్న అభ్యర్థులు కూడా ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు. అయితే సంబంధిత విద్యాసంస్థ జారీచేసిన అండర్‌టేకింగ్‌/ అటెస్టేషన్‌ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.  

జీఏటీ-బీ ద్వారా వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో బయోటెక్నాలజీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంఎస్సీ బయోటెక్నాలజీ, అనుబంధ కోర్సులు, ఎంటెక్‌ బయోటెక్నాలజీ, అనుబంధ కోర్సులు, ఎంఎస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ అండ్‌ ఎంవీఎస్‌సీ యానిమల్‌ బయోటెక్నాలజీ.. మొదలైన పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 63 యూనివర్సిటీ/ విద్యాసంస్థల్లోని బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.  

స్టైపెండ్‌: జీఏటీ-బీ 2022లో అర్హత సాధించి, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు ప్రతినెలా స్టైపెండ్‌ పొందొచ్చు. ఎంఎస్సీ బయోటెక్నాలజీ, సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌ లభిస్తుంది. ఎంఎస్సీ అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ అభ్యర్థులకు రూ.7,500 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఎంటెక్‌/ఎంవీఎస్‌సీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు నెలకు రూ.12,000 స్టైపెండ్‌ పొందొచ్చు. కోర్సు మొదటి సంవత్సరంలో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగానే రెండో సంవత్సరంలో స్టైపెండ్‌ను కొనసాగిస్తారు. 

పరీక్ష విధానం: జీఏటీ-బీ ప్రశ్నపత్రం బహుళైచ్ఛిక విధానంలో ఉంటుంది.కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ). ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది. సెక్షన్‌-ఎలో 60 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 60 మార్కులు. ఈ ప్రశ్నలు 10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయాలజీల నుంచి ఉంటాయి. సెక్షన్‌-బిలోని 100 ప్రశ్నల్లో 60 రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 180 మార్కులు. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు.  

బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ)

డాక్టరల్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్స్‌ అవార్డుల కేటాయింపునకు దేశవ్యాప్తంగా జరిగే అర్హత పరీక్ష ఇది. ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ప్రకటన వెలువడింది. అభ్యర్థులు బీఈటీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరి-1, కేటగిరి-2 అనే రెండు రకాల మెరిట్‌ లిస్ట్‌లను తయారుచేస్తారు. రిజర్వేషన్‌ నిబంధనలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందిస్తారు. కేటగిరి-1లో స్థానం సంపాదించినవారు దేశంలో గుర్తింపుపొందిన ఏ విద్యాసంస్థ నుంచైనా ఫెలోషిప్‌ పొందొచ్చు. 

అర్హత: బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ) రాసే అభ్యర్థులు బ్యాచిలర్స్‌ (బీఈ/బీటెట్‌/ఎంబీబీఎస్‌) అండ్‌ మాస్టర్స్‌ (ఎంఎస్సీ/ ఎంటెక్‌/ ఎంవీఎస్‌సీ/ ఎం.ఫార్మ్‌/ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ/ ఎంటెక్‌), బయోమెడికల్, బయోఇన్‌ఫర్‌మేటిక్స్, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యుటేషన్‌ బయోలజీ, జెనెటిక్స్, మైక్రోబయోలజీ, జువాలజీ లేదా బయోలజీ/లైఫ్‌-సైన్సెస్‌కు చెందిన అనుబంధ కోర్సులు పాసై ఉండాలి. ఫైనల్‌ సెమిస్టర్‌కు హాజరవుతున్నవాళ్లు, ఫైనల్‌ సెమిస్టర్‌ రిజల్ట్‌ కోసం ఎదురుచూస్తున్నవాళ్లు కూడా దరఖాస్తు చేయొచ్చు. 

మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అండ్‌ ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 55 శాతం మార్కులు సాధించాలి. 

వయసు: మార్చి 31 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ మహిళలకు వయఃపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు (నాన్‌-క్రీమీ లేయర్‌) 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. 

పరీక్ష విధానం: ఈ ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లుంటాయి. సెక్షన్‌-ఎలో 50 ప్రశ్నలు; ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 150 మార్కులు. దీంట్లో జనరల్‌ సైన్స్, మ్యాథమేటిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ఎనలిటికల్, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ జనరల్‌ బయోటెక్నాలజీ ఉంటాయి. 

సెక్షన్‌-బిలో సిలబస్‌ ప్రకారం బయోటెక్నాలజీకి చెందిన 150 ప్రశ్నలుంటాయి. వాటిలో 50 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 150 మార్కులకు ఉంటుంది.  

పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్‌/ సికిందరాబాద్‌. 

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2022 

జీఏటీ-బీ తేదీ: 23.04.2022 ఉదయం 9 - 12 గంటలు

బీఈటీ తేదీ: 23.04.2022 మధ్యాహ్నం 3 - 6 గంటలు

వెబ్‌సైట్‌: http://dbt.nta.ac.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెన్త్‌తో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం

‣ నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించడం ఎలా?

‣ ఆలోచన భిన్నమైతే అందుతాయి అవకాశాలు

‣ పర్సనాలిటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?

‣ రెండు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి?

‣ ఇప్పుడే మొదలుపెట్టండి... టెట్‌ సన్నద్ధత!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌