• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌లో ఆఫీసర్లు!

100 పోస్టులతో నోటిఫికేషన్‌



ది ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 100 స్కేల్‌-1 క్యాడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను మూడు దశల్లో జరిగే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.


మొత్తం పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 45, ఈడబ్ల్యూఎస్‌కు 9, ఓబీసీలకు 26, ఎస్సీలకు 7, ఎస్సీలకు 13 కేటాయించారు. 31.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ఉద్యోగులకు 8 ఏళ్ల సడలింపు ఉంటుంది. 


   ఏ పోస్టులు? ఎన్ని?    

1. అకౌంట్స్‌-20: 31.12.2023 నాటికి బీకామ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం సరిపోతుంది. లేదా ఎంబీఏ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణులు కావాలి. లేదా ఐసీఏఐ నుంచి కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ పూర్తిచేయాలి. 

2. యాక్చూరియల్‌-5: స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ యాక్చూరియల్‌ సైన్స్‌ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం. లేదా స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ యాక్చూరియల్‌ సైన్స్‌ మాస్టర్‌ డిగ్రీ చదవాలి. 

3. ఇంజినీరింగ్‌-15: బీఈ/ బీటెక్‌ ఇన్‌ ఆటోమొబైల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ కెమికల్‌/ పవర్‌/ ఇండస్ట్రియల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా ఎంఈ/ఎంటెక్‌ ఇన్‌ ఆటోమొబైల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ కెమికల్‌/ పవర్‌/ ఇండస్ట్రియల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ చేయాలి. 

4. ఇంజినీరింగ్‌ (ఐటీ)-20: బీఈ/ బీటెక్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. లేదా ఎంఈ/ ఎంటెక్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పాసవ్వాలి. 

5. మెడికల్‌ ఆఫీసర్‌-20: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ లేదా తత్సమాన విదేశీ డిగ్రీలు పూర్తిచేయాలి. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌లో రిజిస్టర్‌ కావాలి. 

6. లీగల్‌-20: లా డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఎస్సీ/ఎస్టీలకు 55 శాతం సరిపోతుంది. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250 + జీఎస్టీ అదనం. ఇతరులకు రూ.1000 + జీఎస్టీ అదనం. 

ఎంపిక: అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఫేజ్‌-1లో ప్రిలిమినరీ, ఫేజ్‌-2లో మెయిన్స్, ఫేజ్‌-3లో ఇంటర్వ్యూ ఉంటాయి. 


ప్రిలిమినరీ పరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో 100 మార్కులకు ఉంటుంది. దీంట్లో 3 సెక్షన్లు, ఒక్కోదానికి నిర్దిష్ట సమయం ఉంటాయి. 

1. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 మార్కులు, 20 నిమిషాలు, ఇంగ్లిష్‌లో ఉంటుంది. 

2. రీజనల్‌ ఎబిలిటీ 35 మార్కులు, 20 నిమిషాలు, ఇంగ్లిష్‌/హిందీ.

3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35 మార్కులు, 20 నిమిషాలు, ఇంగ్లిష్‌/హిందీ.

అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ కనీసార్హత మార్కులు సాధించాలి. పాసైనవారిని 1:20 నిష్పత్తిలో మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. 


మెయిన్‌ పరీక్ష: ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ 200 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ 30 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పూర్తయిన తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్‌ మొదలవుతుంది. కంప్యూటర్‌పై టైప్‌ చేయడం ద్వారా డిస్క్రిప్టివ్‌ రాయాలి. వ్యవధి రెండున్నర గంటలు. ప్రతి సెక్షన్‌కు నిర్దిష్ట సమయం ఉంటుంది. 

1: టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్, ఆబ్జెక్టివ్, 40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ, 30 నిమిషాలు.

2: టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, ఆబ్జెక్టివ్, 40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ, 30 నిమిషాలు.

3: టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్, ఆబ్జెక్టివ్, 40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ, 25 నిమిషాలు.

4: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, ఆబ్జెక్టివ్, 40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ, 30 నిమిషాలు. 

5: సంబంధిత విభాగానికి చెందిన టెక్నికల్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ పరిజ్ఞానంపై ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, 40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ, 35 నిమిషాలు. 

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌- 30 మార్కులు (లెటర్‌ రైటింగ్‌-10, ఎస్సే 20 మార్కులు). వ్యవధి 30 నిమిషాలు. ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది.   

మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

 డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. 

 ప్రిలిమినరీ, మెయిన్స్‌లోని ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ల్లో ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. 

ఇంటర్వ్యూ: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలకు 80:20 వెయిటేజీ ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ, చిరునామాలను కాల్‌లెటర్‌ ద్వారా తెలియజేస్తారు. వీటిని సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మెయిన్స్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. 


ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: 

ఆంధ్రప్రదేశ్‌లో: విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు. 

తెలంగాణలో: హైదరాబాద్‌/రంగారెడ్డి, వరంగల్‌. 

 మెయిన్స్‌ పరీక్షను తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు. 

‣ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)/  పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ప్రీ ఎగ్జామినేషన్‌ శిక్షణ ఉంటుంది.  దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ఈ శిక్షణపై తమ అభ్యర్థనను తెలియజేయాలి. శిక్షణకు ఎంపికైనవారి వివరాలను అభ్యర్థుల ఈమెయిల్‌/ మొబైల్‌ నంబర్లకు తెలియజేస్తారు

దరఖాస్తుల ప్రారంభం: 21.03.2024

దరఖాస్తుకు చివరి తేదీ: 12.04.2024

వెబ్‌సైట్‌: www.orientalinsurance.org.in


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date : 18-03-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌