• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బాగా చదవాలంటే సరిగా తినాలి!

పరీక్షల సమయంలో ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు

 

 

పరీక్షలంటేనే తీవ్రమైన ఒత్తిడి. పైగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి అది మరింత అధికంగా ఉంటుంది. దీంతో తినే తిండి సహించదు. అలాంటప్పుడు ఎక్కువ సమయం చదవలేరు, వెంటనే అలసిపోతారు. ఫలితంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు అవసరమంటున్నారు నిపుణులు... అవేంటో తెలుసుకుందామా!

 

ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారపదార్థాల్ని రోజూ తీసుకోవాలి. ఇందుకోసం శాకాహారులైతే మొలకెత్తిన గింజలు, గ్లాసు పాలు తీసుకోవడం మంచిది. మాంసాహారులైతే ఉడకబెట్టిన గుడ్డు తినొచ్చు. 

 

ఇడ్లీ, దోశ వంటి రొటీన్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కాకుండా ఎక్కువ శక్తినిచ్చేలా గోధుమ/జొన్న రొట్టెలను తినాలి. 

 

మధ్యాహ్నం తీసుకునే భోజనంలో అన్నం తగ్గించి, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులైతే చికెన్‌ తీసుకోవచ్చు.

 

జ్ఞాపకశక్తి పెరిగేందుకు వాల్‌నట్స్, పిస్తా, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవాలి. వీటితో పాటు సాయంత్రం వేళ పాలు  తాగాలి. 

 

ఇవేకాక పల్లీలు, బెల్లం, నువ్వులతో చేసిన రకరకాల స్నాక్స్‌ను తీసుకోవచ్చు. అవి కూడా ఇంట్లో తయారు చేసినవైతే మేలు.

 

ఉడకబెట్టిన సెనగలు, బొబ్బర్లు, అటుకులు, మరమరాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఇందులో లభించే ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది. 

 

రాత్రిపూట డిన్నర్‌ ఆలస్యంగా చేయకూడదు. ఆపిల్, నారింజ వంటి సీజనల్‌ పండ్లను తినొచ్చు. 

 

బయట దొరికే రకరకాల జంక్‌ ఫుడ్స్, మసాలా పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒంటికి సరిపడని కొత్తరకపు ఆహార పదార్థాలను అస్సలు ట్రై చేయకూడదు. 

 

రోజూ తీసుకునే ఆహారాన్ని స్కిప్‌ చేయడంగానీ, ఆలస్యంగా తినడం గానీ చేయడమంటే కోరి ఇబ్బందుల్ని తెచ్చుకున్నట్లే అవుతుంది. అరగకపోవటం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది.  

 

వేసవిలో రోజూ మారే అధిక ఉష్ణోగ్రతల వల్ల తేలికగా డీహైడ్రేషన్‌కి గురవుతుంటారు. దీన్నుంచి బయటపడటానికి మజ్జిగ/ నిమ్మరసాన్ని తాగాలి. సబ్జా కూడా మంచిదే. రెండు గంటలకోసారి గ్లాసు మంచినీటిని తప్పకుండా తాగాలి. పళ్ల రసాల్ని తీసుకోవాలి.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొట్టేద్దాం కానిస్టేబుల్‌ కొలువు!

‣ ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదివేద్దాం!

‣ పరీక్ష కోణంలో.. పకడ్బందీగా!

‣ ఫార్మసీ పీజీకి నైపర్‌ దారి!

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌