• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కాపీ కొట్టాలని ఎందుకు అనిపిస్తుందంటే?

 

 

నచ్చినా నచ్చకపోయినా విద్యార్థిగా ఉన్నప్పుడు పరీక్షలు తప్పనిసరి. కొందరు వాటిని అవకాశంగా తీసుకుని టాపర్లుగా నిరూపించుకుంటే... మరికొందరు పేరు చెబితేనే డీలా పడిపోతుంటారు. కొద్దిమందైతే ఏకంగా చూసిరాసేద్దామని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇలా కాపీ కొట్టాలి అనిపించడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయట. ఏళ్లతరబడి విద్యార్థులను పరిశీలించి ఈ విషయాలను గుర్తించారు నిపుణులు. వీటిని అధిగమించడం ద్వారా ఇలా చూసి రాయాల్సిన అవసరం లేకుండా సొంత మార్కులతో దర్జాగా పాసవ్వచ్చు అంటున్నారు.

 

ఎక్కువగా చూసిరాతలకు ప్రయత్నించేవారిలో అత్యధికులు సమయపాలన లేనివారేనట. ఖాళీగా ఉన్నప్పుడు ఏదోలా కాలక్షేపం చేసేసి, ఆఖర్లో పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు ఇలాంటివారు. దీనివల్ల ఉన్న తక్కువ సమయంలో చదివినదంతా అర్థంకాక పరీక్షలో చేతులెత్తేస్తుంటారు. అందుకే  విద్యాసంవత్సరం మొదటి నుంచి చక్కని సమయ పాలనను అలవరుచుకోవడం చాలా అవసరం.

 

పరీక్షల సమయంలో అధికంగా ఒత్తిడికి లోనయ్యి... పరీక్షకు కూర్చునే ముందువరకూ పుస్తకాలు తిరగేస్తూ హైరానా పడేవారు బాగా చదివినవి కూడా మర్చిపోయే ఆస్కారం ఉంటుందట. తీరా రాయాల్సిన సమయానికి జవాబులు గుర్తురాక పక్కచూపులు చూడాల్సి వస్తుంది. అందువల్ల అధిక ఒత్తిడి ఎంతమాత్రం మంచిది కాదు.

 

కొంతమంది ఫెయిల్‌ అయిపోతామేమో, తక్కువ మార్కులు వస్తాయేమో అని లోలోపల భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇళ్లల్లో పెద్దవాళ్లు కాస్త కఠినంగా ఉంటూ, ఇతరులతో పోల్చి చూస్తుంటే ఆ విద్యార్థులు ఎలా అయినా అధిక మార్కులు తెచ్చుకోవాలని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. 

 

నోట్సు సరిగ్గా రాయనివారు, అవసరమైన పుస్తకాలు - మెటీరియల్‌ను మొదటినుంచి అనుసరించని వారు కూడా ఏం చదవాలో, ఎలా చదవాలో తేల్చుకోలేక కాపీ కొట్టడానికి సిద్ధమైపోతుంటారు. 

 

‣ ‘చాలామంది రాస్తున్నారు కదా’ అనే ధోరణి మరో కారణం. మనం చేసేది తప్పు అని తెలిసినా ఇలా మనసు మనకే సర్దిచెప్పి కాపీ కొట్టించేస్తుందన్నమాట. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సి  విషయం ఏంటంటే ఒక్కసారి అలా చూసి రాయడం అలవాటైతే.. వచ్చే పరీక్షలకు మనసు పెట్టి, కష్టపడి చదవాలని అనిపించదట. సులువుగా పాసయ్యే మార్గాల కోసం బుర్ర వెతుకుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదం. చదివే అంశాల మీద సరైన అవగాహన లేకపోతే, ముఖ్యంగా టెక్నికల్‌ సబ్జెక్టులు చదివే వారు... కెరియర్‌లో చాలా ఇబ్బందులు పడతారు. విషయావగాహన లేక మళ్లీ ప్రాథమిక అంశాల నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. అందుకే కాపీ ఆలోచనలు ఏమైనా వస్తుంటే వాటికి బై చెప్పి... కష్టానికి హాయ్‌ అనండి!

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కుదిరిన వేళల్లో కాస్త సంపాదించుకుంటారా?

‣ టెన్త్‌ పాసైతే సాయుధ దళాల్లోకి స్వాగతం!

‣ ‘క్రిటికల్‌’ అంటే నిజంగా క్రిటికల్‌ కాదు!

‣ దివ్య జీవనానికి దృఢమైన ఆసరా!

Posted Date : 02-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌