• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెయిల్‌లో 108 కొలువుల భర్తీ

ఐటీఐ, డిప్లొమా అర్హతతో అవకాశం



స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)కు చెందిన బొకారో స్టీల్‌ ప్లాంట్‌.. 108 ఎగ్జిక్యూటివ్, నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. 


ప్రకటించినవాటిలో కొన్ని ఉద్యోగాలు బొకారో స్టీల్‌ ప్లాంట్‌లో.. మరికొన్ని ఝార్ఖండ్‌ మైన్స్‌లో ఉన్నాయి. సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, మెడికల్‌ ఆఫీసర్, మెడికల్‌ ఆఫీసర్‌ (ఓహెచ్‌ఎస్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (సేఫ్టీ) మొదలైన ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 27. వీటితోపాటుగా 81 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలూ ఉన్నాయి. 


1. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)-8: మెట్రిక్యులేషన్‌తోపాటు మూడేళ్ల ఫుల్‌టైమ్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ కెమికల్‌/ పవన్‌ ప్లాంట్‌/ ప్రొడక్షన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. ఫస్ట్‌ క్లాస్‌ బాయిలర్‌ అటెండెంట్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. వయసు 30 ఏళ్లకి మించకూడదు. 


2. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌)-12: మెట్రిక్యులేషన్‌తోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ (ఫుల్‌టైమ్‌) పూర్తిచేయాలి. సెకండ్‌క్లాస్‌ బాయిలర్‌ అటెండెంట్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. 


3. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌)-15: మెట్రిక్యులేషన్, ఎలక్ట్రికల్‌ డిప్లొమా పాసవ్వాలి.  


4. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (మైనింగ్‌)-5: మెట్రిక్యులేషన్‌తోపాటు మైనింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి. 


5. మైనింగ్‌ ఫోర్‌మేన్‌-3: మెట్రిక్యులేషన్‌తోపాటు మైనింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులు కావాలి. మైన్స్‌ ఫోర్‌మేన్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.  


6. సర్వేయర్‌-1: మెట్రిక్యులేషన్, డిప్లొమా ఇన్‌ మైనింగ్‌/ డిప్లొమా ఇన్‌ మైనింగ్‌ అండ్‌ మైన్స్‌ సర్వే పాసవ్వాలి. సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి.  


7. మైనింగ్‌ మేట్‌-3: మెట్రిక్యులేషన్, మైనింగ్‌ మేట్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ ఉండాలి. 


8. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ)-34: మెట్రిక్యులేషన్, ఐటీఐతోపాటు కనీసం ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ట్రెయినింగ్‌ పూర్తిచేయాలి. నేషనల్‌ అప్రెంటిస్‌ సర్టిఫికెట్‌ ఉండి.. ఐరన్‌ ఓర్‌ మైన్‌లో పనిచేసివుండాలి. 



డిప్లొమా 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ, డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు 40 శాతం సరిపోతుంది. 


డిస్టెన్స్‌/ కరస్పాండెన్స్‌/ ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో చదివినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు. 


వయసు: నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో.. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, డిపార్ట్‌మెంటల్‌ వారికి పదేళ్ల సడలింపు ఉంటుంది. 


శారీరక ప్రమాణాలు: రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుల్లో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఇంజినీరింగ్‌ పురుష అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ., నాన్‌ ఇంజినీరింగ్‌ వారి ఎత్తు 150 సెం.మీ. ఉండాలి. బరువు 45 కిలోలు, ఛాతీ 72-75 సెం.మీ. ఉండాలి. దృష్టి లోపాలు ఉండకూడదు. మహిళల ఎత్తు 143 సెం.మీ., బరువు 35 కేజీలు ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు: రూ.700, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌/ ఈఎస్‌ఎం వారికి ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200.  


గ్రేడ్‌ ఎస్‌-3 (ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్, మైనింగ్‌ ఫోర్‌మేన్, సర్వేయర్‌) పోస్టులకు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.150. 


‣ గ్రేడ్‌ ఎస్‌-1 (మైనింగ్‌ మేట్, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌-ట్రెయినీ, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌-బాయిలర్‌) పోస్టులకు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌/ ఈఎస్‌ఎం వారికి రూ.100.


ఎంపిక: ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు.


ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌), ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ) ఎలక్ట్రికల్‌/ మైనింగ్‌ ఫోర్‌మేన్, సర్వేయర్‌ పోస్టులకు: ప్రశ్నపత్రంలో ఆరు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎ: వెర్బల్‌ ఎబిలిటీ, సెక్షన్‌-బి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, సెక్షన్‌-సి: జనరల్‌ నాలెడ్జ్, సెక్షన్‌-డి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, సెక్షన్‌-ఇ: డొమైన్‌ నాలెడ్జ్‌ సంబంధిత డిప్లొమా ఇంజినీరింగ్‌/ టెక్నికల్‌ స్ట్రీమ్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వ్యవధి 90 నిమిషాలు. 


మైనింగ్‌మేట్, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌), మైనింగ్‌మేట్, అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (ట్రెయినీ) పోస్టులకు: సెక్షన్‌-ఎ: వెర్బల్‌ ఎబిలిటీ, సెక్షన్‌-బి: జనరల్‌ నాలెడ్జ్, సెక్షన్‌-సి: లాజికల్‌ రీజనింగ్, సెక్షన్‌-డి: క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, సెక్షన్‌-ఇ: డొమైన్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 90 నిమిషాలు. 


ఒకటికంటే ఎక్కువ పోస్టులకు అర్హతలు ఉన్నట్లయితే.. ఆసక్తి ఉన్నవారు ప్రతి పోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తు చేయాలి.


దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి. దీన్ని ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ సమయంలో చూపించాలి.. 


స్కిల్‌టెస్ట్‌/ ట్రేడ్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ సమయంలో ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 


దరఖాస్తుల ప్రారంభ తేదీ: 16.04.2024


దరఖాస్తుకు చివరి తేదీ: 07.05.2024


వెబ్‌సైట్‌: https://www.sail.co.in/


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Posted Date : 02-04-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌