• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

స్టాక్‌డేల్‌ పారడాక్స్‌

చిన్నచిన్న ఎదురుదెబ్బలకే తల్లడిల్లిపోతుంటాం. అపజయాలకు భయపడుతుంటాం. కానీ ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా స్థిరమైన ఆత్మస్థైర్యంతో నిలబడాలని చెప్పే ఒక విధానం గురించి తెలుసా? అదే స్టాక్‌డేల్‌ పారడాక్స్‌. దీనివెనుక ఒక కథ ఉంది. జేమ్స్‌ స్టాక్‌డేల్‌ అనే ఓ అమెరికన్‌ సైనికుడు వియత్నాం యుద్ధంలో ఖైదీగా శత్రుదేశానికి చిక్కాడు. తనతోపాటు మరికొందరు సైనికులు కూడా ఉన్నారు. ఏం చేయాలో తెలీదు, అక్కడ వారిని చిత్రహింసలు పెట్టినా..చివరికి చంపేసినా అడిగే దిక్కులేదు. బిక్కుబిక్కుమంటూ రోజులు గడుస్తున్నాయి. తాము విడుదలవుతామనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. తనతోటి సైనికులంతా ఒక్కొక్కరే బెంగతో కన్నుమూస్తున్నారు. ఇక తిరిగి వెళతామని కానీ, ఆప్తులను కలుసుకుంటామని కానీ.. ఒక్కరికీ నమ్మకం లేదు. కానీ జేమ్స్‌ మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎప్పటికైనా ఇంటికి చేరుకుంటానని బలంగా నమ్మాడు. అనేక బాధలుపడ్డ తర్వాత చివరికి ఏడున్నరేళ్లకు అతడిని విడుదల చేశారు! ఆ సమయానికి తన తోటివాళ్లెవ్వరూ ప్రాణాలతో లేరు. మంచే జరుగుతుందని నమ్మిన జేమ్స్‌ మాత్రమే మానసికంగా ధైర్యంగా ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం సైన్యంలో అడ్మిరల్‌గా పనిచేశాడు. జిమ్‌ కాలిన్స్‌ అనే రచయిత రాసిన ‘గుడ్‌ టు గ్రేట్‌’ అనే పుస్తకంలో జేమ్స్‌ అనుభవాల ఆధారంగా ఈ ‘స్టాక్‌డేల్‌ పారడాక్స్‌’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎలాంటి కష్టసమయాల్లోనూ ధైర్యాన్ని కోల్పోకూడదనేదే ఈ సూత్రం. తాజాగా హార్వర్డ్‌ యూనివర్సిటీ కరోనా విజృంభణ సమయం నాటి పరిస్థితులను ఉద్దేశించి ‘విపత్తు సమయాల్లో నాయకత్వ లక్షణాలు’ అనే అంశంలో భాగంగా స్టాక్‌డేల్‌ పారడాక్స్‌ను కొనియాడింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్‌-2022

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ

‣ దివ్యమైన కోర్సులు

Posted Date : 15-06-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌