• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టైమ్స్‌ ర్యాంకింగ్‌లో కలకత్తా వర్సిటీ టాప్‌!

ప్రపంచంలోని యూనివర్సిటీలకు ర్యాంకింగ్‌ ఇచ్చే ది (ది టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌) ఇంపాక్ట్‌ ర్యాంకింగ్స్‌ - 2022 ఇటీవల విడుదలయ్యాయి. వీటిలో ఉత్తమ విద్యాసంస్థలు కలిగిన దేశంగా భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్‌ 100 యూనివర్సిటీల్లో మన దేశం నుంచి 3 వర్సిటీలకు చోటు దక్కింది.  

దేశంలోని సెంట్రల్, స్టేట్‌ ఎయిడెడ్‌ పబ్లిక్‌ విశ్వవిద్యాలయాల్లో కలకత్తా యూనివర్సిటీ తొలిస్థానం (14వ ర్యాంకు) కైవసం చేసుకుంది. డీసెంట్‌ వర్క్‌ అండ్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ సబ్‌ కేటగిరీలో ఈ ర్యాంకు లభించింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమృత విశ్వవిద్యాపీఠం- కోయంబత్తూర్‌ (41వ ర్యాంకు), లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ-పంజాబ్‌ (74వ ర్యాంకు) నిలిచాయి. 

టాప్‌ 800లో ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ (హర్యానా), కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ (భువనేశ్వర్‌), వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (తమిళనాడు), అమిటీ యూనివర్సిటీ (నోయిడా), చిట్కార యూనివర్సిటీ (చండీఘర్‌) చోటు సంపాదించాయి. 

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల నుంచి 1,524 విద్యాసంస్థలు ఈ ర్యాంకింగ్స్‌లో పాల్గొన్నాయి. వీటన్నింటిలో ఆస్ట్రేలియాలోని వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. విద్యాప్రమాణాల నాణ్యత, పరిశుద్ధమైన తాగునీరు - పరిసరాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి... వీటి ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించారు. 

మన దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌

ర్యాంకు                విశ్వవిద్యాలయం

101 - 200    షూలిని యూనివర్సిటీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్, హిమాచల్‌ ప్రదేశ్‌

201 - 300    ఎన్‌ఐటీటీఈ, మంగుళూరు 

301 - 400    జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, మైసూర్‌

301 - 400    సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ, పూణె

401 - 600    దత్త మేఘ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్, నాగ్‌పూర్‌

401 - 600    డాన్‌ బాస్కో యూనివర్సిటీ, అసోం

401 - 600    ఎటర్నల్‌ యూనివర్సిటీ, హిమాచల్‌ ప్రదేశ్‌
401 - 600    గీతమ్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం

401 - 600    హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్, చెన్నై

401 - 600    ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గాంధీనగర్‌

401 - 600    మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, కర్ణాటక

401 - 600    టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ముంబై

601 - 800    ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు

601 - 800    శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 

601 - 800    శ్రీశ్రీ యూనివర్సిటీ, కటక్‌

1001 ప్లస్‌    ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

1001 ప్లస్‌    విజ్ఞాన్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ రిసెర్చ్, గుంటూరు 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణితంలో గరిష్ఠ మార్కులు

‣ టెన్త్‌తో పోస్టల్‌ ఉద్యోగాలు

‣ ఇఫ్లూ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

‣ సౌకర్యంగా చదువుకోడానికి ఈ-బుక్‌రీడర్‌

‣ బహు భాషలు నేర్చుకుంటే..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌