• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సౌకర్యంగా చదువుకోడానికి ఈ-బుక్‌రీడర్‌

ఇప్పటి విద్యార్థులు చదవడం అంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే! క్లాసులు వినడం, మెటీరియల్‌ - నోట్సు సేకరించడం... ఇలా చాలా సమయం వారు అంతర్జాలంలోనే గడుపుతుంటారు. ఆ సమాచారాన్ని చదువుకోవడానికి తిరిగి ప్రింట్లు తీసుకునే అవసరం లేకుండా... అందుబాటులోకి వచ్చినవే ఈ-బుక్‌రీడర్స్‌. గతంలో కొన్ని కంపెనీల ఉత్పత్తులు వచ్చినా... అమెజాన్‌ కిండల్, సోనీ రీడర్‌ వంటివి విడుదలయ్యాక ఈ రీడర్స్‌ను వాడే వారి సంఖ్య పెరిగింది. కరోనా విజృంభణ తర్వాత వీటి అవసరం విద్యార్థులకూ పెరిగింది. ఎన్ని పుస్తకాలనైనా సులువుగా చదువుకునే వీలు కల్పించే ఈ రీడర్లలో... ఎండ, తక్కువ వెలుతురులో కూడా కంటిపై ఒత్తిడి పడకుండా చదివేలా లైటింగ్‌ను మార్చుకునే వీలుంటుంది. నాణ్యమైన కంపెనీ రీడర్‌ అయితే ఒకసారి ఛార్జింగ్‌ పెడితే కొన్నివారాలపాటు పనిచేస్తుంది! నెట్‌ సౌకర్యం కూడా ఉండటం వల్ల పుస్తకాలను సులువుగా డౌన్లోడ్, షేర్‌ చేసుకోవచ్చు. ఈ-ఇంక్‌ అనే టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తూ ఉండటం వల్ల ముద్రించిన పేజీని  చదవడం ఎంత సౌకర్యంగా ఉంటుందో ఈ రీడర్స్‌లో చదవడం కూడా అంతే సులువుగా ఉంటుందట. పైగా ఇవి నీళ్లలో తడిచినా ఏమీ కావు. ఇంకెందుకు ఆలస్యం... మీకేది నచ్చుతుందో చూడండి మరి!

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బహు భాషలు నేర్చుకుంటే..!

‣ సరిహద్దు దళంలో ఉద్యోగాలు

‣ సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

‣ ఎకానమీలో ఏవీ ముఖ్యం?

‣ అవుతారా డ్రోన్‌ పైలట్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌