• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టిస్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు ప్రారంభం

60 స్పెషలైజేషన్‌లతో ప్రకటన విడుదల

దేశంలోని మేటి విద్యా సంస్థల్లో టాటా   ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) ఒకటి. ఇక్కడ అందిస్తోన్న సోషల్‌ వర్క్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఎంతో ప్రత్యేకమైనవి. వైవిధ్యకరమైన చదువులను విస్తృత స్పెషలైజేషన్లతో అందించడం టిస్‌ ప్రత్యేకత. మొత్తం 60 (57 పీజీ, 3 పీజీ డిప్లొమా) కోర్సులను ఈ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి ప్రాంగణాల్లో అందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంలో వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలతో కోర్సుల్లోకి తీసుకుంటారు.


టిస్‌ ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు ఉన్నాయి. ఏ కోర్సులో చేరాలనుకున్నప్పటికీ స్టేజ్‌-1 పరీక్ష అందరికీ ఉమ్మడిగానే ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చదువుకున్న అంశాలతో ఎలాంటి సంబంధం లేదు. ప్రశ్నలన్నీ జనరల్‌ విభాగానికి చెందినవే వస్తాయి. పలు పీజీ కోర్సులకు సాధారణ డిగ్రీ విద్యార్హతతో పోటీ పడొచ్చు. మిగతావాటికి సంబంధిత విభాగంలో యూజీ పూర్తిచేసినవారే అర్హులు. ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చేరిన కోర్సుల ప్రకారం.. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంహెచ్‌ఏ, ఎంపీహెచ్‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు.  


ఇవీ కోర్సులు


ఎడ్యుకేషన్‌ (ఎలిమెంటరీ), డెవలప్‌మెంట్‌ స్టడీస్, విమెన్‌ స్టడీస్, ఇంటర్నేషనల్‌ ఎలక్టోరల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్రాక్టీసెస్, ఎన్విరాన్‌మెంట్‌ క్లైమేట్‌ చేంజ్‌ అండ్‌ సస్టెయినబిలిటీ స్టడీస్, రెగ్యులేటరీ పాలసీ అండ్‌ గవర్నెన్స్, అర్బన్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, వాటర్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్‌ హెల్త్‌ (హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌), పబ్లిక్‌ హెల్త్‌ (హెల్త్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌), పబ్లిక్‌ హెల్త్‌ (సోషల్‌ ఎపిడిమియాలజీ), యానిమల్‌ అసిస్టెడ్‌ థెరపీ ఇన్‌ కౌన్సెలింగ్, గ్లోబల్‌ మెంటల్‌ హెల్త్, అప్లయిడ్‌ సైకాలజీ (క్లినికల్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ ప్రాక్టీస్‌).


లాస్‌ (యాక్సెస్‌ టు జస్టిస్‌), హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్, ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్, చేంజ్‌ అండ్‌ లీడర్‌షిప్‌; సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఎనలిటిక్స్‌ (సెల్ఫ్‌ ఫైనాన్స్‌), మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్, సోషల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, డెవలప్‌మెంట్‌ పాలసీ, ప్లానింగ్‌ అండ్‌ ప్రాక్టీస్‌; సస్టెయినబుల్‌ లైవ్లీహుడ్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ గవర్నెన్స్‌; సోషల్‌ వర్క్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ వర్క్‌ (చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీస్‌/ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌/ క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌/ దళిత్, ట్రైబల్‌ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌/ లైవ్‌లీ హుడ్స్‌ అండ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్స్‌/ మెంటల్‌ హెల్త్‌/ పబ్లిక్‌ హెల్త్‌/ ఉమెన్‌ సెంటర్డ్‌ ప్రాక్టీస్‌/ కౌన్సెలింగ్‌), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, డిజాస్టర్‌ ఇన్ఫర్మాటిక్స్‌ అండ్‌ జియోస్పేషియల్‌ టెక్నాలజీస్‌ (ఏడాది వ్యవధి కోర్సు), ఎడ్యుకేషన్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, నేచురల్‌ రిసోర్స్‌ అండ్‌ గవర్నెన్స్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్ట్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, లేబర్‌ స్టడీస్‌ అండ్‌ సోషల్‌ ప్రొటెక్షన్, పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్టడీస్, సోషియాలజీ అండ్‌ సోషల్‌ ఆంత్రపాలజీ, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, బీఎడ్, ఎంఎడ్‌... తదితర కోర్సులు టిస్‌ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు.  


హైదరాబాద్‌ క్యాంపస్‌లో 


ఎంఏ: ఎడ్యుకేషన్, సిటీస్‌ అండ్‌ గవర్నెన్స్, నేచురల్‌ రిసోర్సెస్‌ అండ్‌ గవర్నెన్స్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్, ఉమెన్‌ స్టడీస్‌.


పీజీ డిప్లొమా: సిటీస్‌ అండ్‌ గవర్నెన్స్, నేచురల్‌ రిసోర్సెస్‌ అండ్‌ గవర్నెన్స్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్‌ కోర్సులు. 


 ఎంపిక ఇలా


ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ టిస్‌-నెట్‌ రాయాలి. స్టేజ్‌-1 పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి స్టేజ్‌-2 ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది ఎంపికలో స్టేజ్‌-1, 2 రెండింటికీ సమాన వెయిటేజీ ఉంటుంది. 


పరీక్షలో..


టిస్‌నెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి వంద నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే అడుగుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, మ్యాథ్స్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 30 మార్కులకు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌లో కటాఫ్‌ మార్కులు పొందడం తప్పనిసరి. పరీక్షపై అవగాహన కోసం టిస్‌ వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టు అందుబాటులో ఉంది. 


 ఏ విభాగాల్లో ఏ ప్రశ్నలు?


ఇంగ్లిష్‌: వర్డ్‌ ఛాయిస్‌/ సెంటెన్స్‌ కరెక్షన్, ఆడ్‌ వన్‌ అవుట్, ఎనాలజీస్, సిననిమ్స్‌ అండ్‌ యాంటనిమ్స్, గ్రామర్, వెర్బల్‌ రీజనింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌.


మ్యాథమెటిక్స్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌: అరిథ్‌మెటిక్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్, నంబర్‌ సిరీస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగుల్లో ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. 


జనరల్‌ అవేర్‌నెస్‌: వర్తమాన సంఘటనలు, అభివృద్ధి, సాంఘిక రాజకీయాంశాలు, సోషల్‌ స్టడీస్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం, క్రీడలు, సంస్కృతి, కళలు భారతదేశ చరిత్ర.. అంశాల్లో ప్రశ్నలుంటాయి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 15.


స్టేజ్‌-1 టిస్‌ నెట్‌ పరీక్షలు: జనవరి 28 - ఫిబ్రవరి 28 మధ్య నిర్వహిస్తారు. 


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం


వెబ్‌సైట్‌: https://admissions.tiss.edu/

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందరూ కామర్స్‌ కోర్సుల్లో చేరుతున్నారు!

‣ సందిగ్ధతను దాటి.. సన్నద్ధత వైపు!

‣ రూ.51 లక్షల జీతంతో క్యాంపస్‌ ఉద్యోగం!

‣ అంద‌రి కోసం ఆన్‌లైన్ లైబ్ర‌రీ

‣ ఎలా నెగ్గాలి సివిల్స్ ఇంట‌ర్వ్యూ?

Posted Date : 23-12-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌