• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పటాల సాధనతో మార్కులు

ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ బోర్డు 30% సిలబస్‌ను తొలగించింది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి మిగతా పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటూ చదవాలి. ముఖ్యంగా వృక్షశాస్త్రంలో నిర్వచనాలు, శాస్త్రీయ నామాలు, పటాలు నేర్చుకోవాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల కోసం పటాలను ఎక్కువగా సాధన చేయాలి. సరైన ప్రణాళికను ఏర్పరచుకొని పరీక్షలకు సిద్ధం కావాలి  

ప్రశ్నపత్రం విశ్లేషణ 

ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. ఈ ప్రశ్నపత్రాన్ని మూడు విభాగాలుగా విభజించారు. విభాగం - ఎలో 10 అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఛాయిస్‌ ఉండదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. విభాగం - బిలో 12 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. విభాగం - సిలో 4 దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఏవైనా రెండింటికి సమాధానాలు రాయాలి.

యూనిట్ల వారీగా వెయిటేజి

*    జీవ ప్రపంచంలో వైవిధ్యం:    4 + 4 + 2 + 2 (12 మార్కులు)

*    మొక్కల బాహ్య స్వరూపం:     8 + 4 + 2 (14 మార్కులు)

*    మొక్కల్లో ప్రత్యుత్పత్తి:     8 + 4 + 2 (14 మార్కులు)

*    మొక్కల సిస్టమాటిక్‌:     4 + 2 (6 మార్కులు)

*   కణ నిర్మాణం - విధులు:    4 + 4 + 2 + 2 (12 మార్కులు)

*    మొక్కల అంతర్నిర్మాణం:     8 + 2 (10 మార్కులు)

*    వృక్ష ఆవరణ శాస్త్రం:     4 + 2 (6 మార్కులు)

సిలబస్‌ విశ్లేషణ

మొదటి సంవత్సరం విద్యార్థులు పటాలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు. 

8 మార్కుల ప్రశ్నలు కచ్చితంగా 2, 3, 6వ యూనిట్ల నుంచి వస్తాయి. కాబట్టి విద్యార్థులు వీటిపై దృష్టి సారించాలి. 

*    నిశ్చిత, అనిశ్చిత పుష్ప విన్యాసాల నుంచి ఒక ప్రశ్న.

*    ఆవృత బీజాల్లో ఫలదీకరణం, పిండకోశం నిర్మాణం, పరాగ సంపర్క సహకారకాల నుంచి ఒక ప్రశ్న.

*    వేరు, కాండం అడ్డుకోతల నుంచి ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. 

*    4వ యూనిట్‌లో మొక్కల సిస్టామాటిక్స్, 7వ యూనిట్‌లో వృక్ష ఆవరణ శాస్త్రాలను క్షుణ్నంగా చదవడం వల్ల (6 + 6 = 12) సులభంగా మార్కులు సాధించవచ్చు.

*    5వ యూనిట్‌ కణ నిర్మాణం - విధులు చాప్టర్‌ నుంచి 12 మార్కులు తప్పకుండా వస్తాయి.  

తొలగించిన పాఠ్యాంశాలు

యూనిట్‌ - 2: వేరు, కాండం, పత్రం, ఫలం, విత్తనం

యూనిట్‌ - 3: 6వ చాప్టర్‌

యూనిట్‌ - 4: ఫాబేసి

యూనిట్‌ - 6: ఎ) కణజాలాలు    బి) పత్రం అడ్డుకోత    సి) ద్వితీయ వృద్ధి

యూనిట్‌ - 7: మొక్కల అనుక్రమం, ఆవరణ శాస్త్ర సహకారకాలు లాంటి అంశాలను పూర్తిగా తొలగించారు.

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 15-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌