రెండు మార్కుల ప్రశ్నలు
1. బయోజెనిసిస్ అంటే ఏమిటి?
జ: జీవం, జీవం నుంచి మాత్రమే ఆవిర్భవించడం.
2. పిండోత్పత్తి శాస్త్రానికి, ప్రవర్తనా శాస్త్రానికి (ఇథాలజీ) మధ్య భేదం ఏమిటి?
జ: పిండోత్పత్తి శాస్త్రం - జీవుల్లో జరిగే పిండాభివృద్ధి గురించి తెలిపేది.
ప్రవర్తనా శాస్త్రం - జంతువుల ప్రవర్తనను తెలియజేసేది.
3. ‘జంతు ప్రదర్శనశాలలు వర్గీకరణకు ఉపకరణాలు’ వివరించండి.
జ: జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన లాంటి అంశాల ద్వారా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు ఉపకరణాలు.
4. టాటోనిమీ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి.
జ: శాస్త్రీయ నామంలో జాతి, ప్రజాతి పేరు ఒకటే కావడం.
ఉదా: 1) నాజ నాజ 2) ఏక్సిస్ ఏక్సిస్
5. ప్రోటోస్టొమియా, డ్యుటిరోస్టొమియాలను విభేదికరించండి.
జ: ప్రోటోస్టొమియా - ఆది ఆంత్ర రంధ్రం నోరుగా అభివృద్ధి చెందడం.
డ్యుటిరోస్టొమియా - ఆది ఆంత్ర రంధ్రం పాయువుగా అభివృద్ధి చెందడం.
6. ICZN ను విపులీకరించండి.
జ: ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలాజికల్ నామెన్క్లేచర్ (అంతర్జాతీయ జంతునామీకరణ నియమావళి).
7. ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి.
జ: 1) విన్ బ్లాస్టిన్ 2) డిజిటాలిన్
8. భారతదేశంలోని ఏవైనా నాలుగు పావన వనాలను పేర్కొనండి.
జ: 1) ఖాసీ, జైంటియా కొండలు 2) ఆరావళి పర్వతాలు
3) పశ్చిమ కనుమల ప్రాంతం 4) బస్తర్
9. IUCN ను విపులీకరించండి. అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారు?
జ: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. అంతరించిపోతున్న జాతుల పట్టికను రెడ్ డేటా పుస్తకంలో ఇచ్చారు.
నాలుగు మార్కుల ప్రశ్నలు
1. ఉష్ణ మండలాల్లో అధిక బయోడైవర్సిటీకి కారణాలు తెలపండి.
జ: * దీర్ఘ పరిణామ కాలం
* వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వం కలిగి ఉండటం
* అపరిమిత సౌరశక్తి, నీరు లాంటి వనరుల లభ్యత
2. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ (తాప ప్రాంతాలు) గురించి లఘుటీక రాయండి.
జ: ప్రపంచంలో 34 జీవవైవిధ్య తాప ప్రాంతాలు ఉన్నాయి.
* భారతదేశంలోని పశ్చిమ కనుమలు, శ్రీలంక భూభాగం
* ఇండో - బర్మా ప్రాంతం
* ప్రస్తుత హిమాలయ ప్రాంతం
3. రివెట్ పాపర్ దృగ్విషయాన్ని వివరించండి.
జ: పాల్ ఎల్రిచ్ ప్రతిపాదించిన రివెట్ పాపర్ దృగ్విషయం ఒక ఆవరణ వ్యవస్థ పనీతీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. ఇతడు పర్యావరణాన్ని విమానంతో, పర్యావరణ జాతులను విమాన రివెట్లతోనూ పోల్చాడు. జీవసమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వల్ల ఆ జీవావరణ వ్యవస్థ నాశనమవుతుందని పేర్కొన్నాడు.