• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ద్విపద సిద్ధాంతం

(a+b)2 = a2 + 2ab + b2
(a + b)3 = a3 + 3a2b + 3ab2 + b3
లాంటి విస్తరణలను కింది తరగతుల్లో నేర్చుకున్నారు.
         వీటిలో, LHS ని గమనిస్తే రెండు పదాల మొత్తానికి ఘాతం ఉంది. ఇలాంటి విస్తరణలను ద్విపద విస్తరణలు అంటారు. ఈ పాఠ్యాంశంలో, రెండు పదాలకు ధనాత్మక పూర్ణసంఖ్య ' n ' ఘాతంగా ఉన్నప్పుడు విస్తరణకి సంబంధించిన సాధారణ సూత్రాన్ని నేర్చుకుంటారు.


ధనాత్మక పూర్ణ ఘాతానికి ద్విపద సిద్ధాంతం:
       n ధనాత్మక పూర్ణ సంఖ్య అయితే
(x + a)n = nC0xn  +  nC1xn -1a + nC2xn-2a2  +  ........  +  nCr xn-r ar  + ......... + nCnaదీన్నే ద్విపద సిద్ధాంతం అంటారు. 
     దీన్ని గణితానుగమన సూత్రం ద్వారా నిరూపించవచ్చు.


గమనిక:
1.  (x + a)n విస్తరణలోని పదాల సంఖ్య (n + 1)
2.  విస్తరణలో సాధారణ పదం Tr+1 = nCr xn-r . ar

(ఇక్కడ Tr + 1 అనేది విస్తరణలోని (r + 1) వ పదాన్ని సూచిస్తుంది)

ఉదా : (2x  +  3y)5 విస్తరణ కనుక్కోండి.

సాధన సమస్యలు:
1.  (3a  -  4b)8 విస్తరణలో నాలుగో పదాన్ని కనుక్కోండి.
2.   విస్తరణలో x9 గుణకాన్ని కనుక్కోండి.
3. (x + a)n విస్తరణలో 2, 3, 4వ పదాల గుణకాలు వరుసగా 240, 720, 1080 అయితే, x, a, n ల విలువలు కనుక్కోండి.
4. (1  +  x)n విస్తరణలోని, r వ, (r  +  1), (r  +  2) వ పదాల గుణకాలు అంకశ్రేఢిలో ఉంటే,
      n2 - (4r  +  1)n + 4r2  -  2  =  0 అని చూపండి.
5. ద్విపద సిద్ధాంతం ద్వారా,    n

 N,  50n - 49n - 1 ని 49 నిశ్శేషంగా భాగిస్తుందని చూపండి.


(x + a)n విస్తరణలో మధ్య పదాలు :
        n సరిసంఖ్యలున్న, (x  +  a)n విస్తరణలోని పదాల సంఖ్య (n + 1), అంటే బేసి సంఖ్య. వీటిలో ఒక మధ్యపదం ఉంటుంది. దానికి ఇరువైపులా  పదాలుంటాయి. కాబట్టి మధ్యపదం  పదమవుతుంది.
మరియు 
మరియు, 'n' బేసి సంఖ్య అయినప్పుడు, పదాల సంఖ్య (n + 1) అంటే సరి సంఖ్య. వీటిలో రెండు మధ్య పదాలుంటాయి.

ఉదా : 1. (2a + 3b)10 విస్తరణలో మధ్య పదాన్ని కనుక్కోండి.
సాధన: ఇక్కడ n = 10 సరిసంఖ్య. కాబట్టి ఒక మధ్యపదం ఉంటుంది.

2. (3x  +  5y)25 విస్తరణలోని మధ్య పదాలను కనుక్కోండి.
సాధన: ఇక్కడ n  =  25, బేసి సంఖ్య.


సంఖ్యాత్మక గరిష్ఠ పదాలు:
      (1 + x)n విస్తరణలో, ఏ పదం విలువైనా ' n ', ' x 'ల విలువలపై ఆధారపడి ఉంటుంది. ' x ' రుణాత్మకమైన విస్తరణలోని కొన్ని పదాలు రుణాత్మకంగానూ, మరికొన్ని ధనాత్మకంగా ఉంటాయి. వీటిని సంఖ్యాత్మక విలువలుగా పరిగణిస్తే, 

 విలువను బట్టి, ఈ విలువ పూర్ణ సంఖ్య ' p ' అయితే, Tp, Tp+1 లు సంఖ్యాత్మకంగా గరిష్ఠంగా ఉంటాయి. వాటి సంఖ్యాత్మక విలువలు సమానంగా ఉంటాయి.  
లేదా ఆ విలువ పూర్ణ సంఖ్య కానట్టయితే, p + f రూపంలో ఉంటే (p  =  పూర్ణ సంఖ్య p, f  =  దశాంశ భాగం i.e. 0  <  f  <  1)
               Tp+1 మాత్రమే సంఖ్యాత్మకంగా గరిష్ఠ విలువ కలిగి ఉంటుంది.

సాధన సమస్యలు

Posted Date : 06-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌